5 వేలమంది పోలీసుల నియామకానికి రంగం సిద్ధం | 5 thousand police Appointments To prepare the sector | Sakshi
Sakshi News home page

5 వేలమంది పోలీసుల నియామకానికి రంగం సిద్ధం

Published Fri, Jul 3 2015 3:21 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

5 thousand police Appointments To prepare the sector

డిప్యూటీ సీఎం చినరాజప్ప
ఆత్రేయపురం: రాష్ట్రంలో 5వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధమైందని, సంబంధిత ఫైల్ సీఎం చంద్రబాబు వద్ద ఉందని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో మండల టీడీపీ అధ్యక్షుడు ముళ్లపూడి భాస్కరరావు ఇంట జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

అరటికి గిట్టుబాటు ధర కల్పించేందుకు తన వంతు ప్రయత్నిస్తానన్నారు. ఆలమూరు వద్ద గోదావరిలో పడి మృతిచెందిన కుటుంబాలకు త్వరలో పరిహారం అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement