ఎమ్మెల్యే కళ్లలో కారం: మహిళ అరెస్ట్
ముజఫర్ నగర్:
ఎమ్మెల్యే కళ్లలో కారంతో దాడి చేసిన కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో బీజేపీ ఎమ్మెల్యే కపిల్ దేవ్ అగర్వాల్, తన ఆఫీసులో స్థానికులతో సమావేశంలో ఉండగా విక్రాంత్, కపిల్, ప్రదీప్ అనే యువకులు కారంతో దాడి చేశారు. ఈ దాడిలో కపిల్ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
అయితే ఈ కేసులో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రాంత్ తల్లి గీతను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు యువకులు ఇంకా పరారీలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే పై దాడి జరిగిన సమయంలో అంగరక్షకులు కాల్పులు జరిపినా కూడా, ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి తప్పించుకొనిపోయారు.