attacks on terrorists
-
'పాక్ కు ధీటుగా బదులిచ్చాం'
సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ని దాటి పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయవంతంగా సర్జికల్ దాడులు జరిపిన భారత్ సైన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఈ విషయంపై పాక్ మీడియా మాత్రం భిన్నంగా స్పందించింది. భారత ఆర్మీ జరిపిన దాడులలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ మీడియా వెల్లడించింది. భారత్ తమ భూభాగంలోకి చొరబడి అకారణంగా కాల్పులకు తెగబడిందని పేర్కొంది. ఎలోవోసీని దాటి సర్జికల్ దాడులు చేసి మీడియాలో హైప్ క్రియేట్ చేశారని పాక్ ఆర్మీ పెద్దలు భారత్ పై మండిపడుతున్నారు. భారత్ మా మీద దాడి చేసినందున, అదే తీరుగా మేం కూడా సర్జికల్ అటాక్ చేస్తామని హెచ్చరించింది. పాక్ నుంచి ప్రతీకార దాడులు జరిగే అవకాశాలున్నాయని ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఫాలీ మేజర్ అభిప్రాయపడ్డారు. పాక్ ఉగ్రదాడులకు భారత్ తగిన రీతిలో సమాధానం చెప్పిందన్నారు. గతంలో మాదిరిగా ఉన్నట్లు కాదు.. ప్రస్తుతం భారత్ దూకుడుగా వ్యవహరిస్తుందన్న విషయం పాక్ అర్థం చేసుకుంటే మంచిదని హెచ్చరించారు. సరైన ప్రణాళితో, చాలా తెలివిగా దాడుల ప్లాన్ అమలు చేసిన అందర్నీ ఆయన అభినందించారు. ఈ ఘటన కేవలం ఆర్మీకి మాత్రమే కాదు దేశం మొత్తానికి ఎనర్జీని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఉడీలో పాక్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. -
సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటీ?
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడికి గట్టి సమాధానం ఇచ్చిన భారత ఆర్మీని చూసి నేడు దేశమంతా గర్విస్తోంది. మొట్టమొదటిసారి ఇండియన్ ఆర్మీ పాక్ గుండెలు అదిరిపడేలా గర్జించింది. వ్యూహాలను రచించడంలోనూ, అవసరం అయినప్పుడు వాటిని అమలుచేయడంలోనూ తామేం తక్కువకాదని భారత్ నిరూపించింది. పాక్ భూభాగంలో దాడిని గురించి ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ వివరణ ఇస్తూ బాంబులు అనే మాటను ఉపయోగించకుండా 'సర్జికల్ స్ట్రైక్స్'(నిర్దేశిత దాడులు) ఓ పదం ఉపయోగించారు. దీనిపై కొంతమందికి అవగాహన ఉన్నప్పటికీ ఎంతోమంది అసలు సర్జికల్ ఎటాక్స్ అంటే ఏమిటని ఆలోచనలో పడ్డారు. సర్జికల్ ఎటాక్స్ అంటే మరేమీ లేదు. ముందుగా తెలిసిన సమాచారం ప్రకారం పక్కాగా నిఘా నిర్వహించి అణువణువు జాగ్రత్తగా వ్యవహరించి నిక్కచ్చిగా ఓ లక్షిత ప్రాంతాన్ని ఎంచుకొని పక్కాగా దాడి చేయడం. ఆర్మీ ఎంతమేరకు లక్ష్యంగా ఎంచుకుంటుందో సరిగ్గా అంతే మొత్తంలో ధ్వంసం అవుతుంది. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. అయితే, ఈ దాడి ప్రాంతలోని నిర్మాణాలకుగానీ, వాహనాలు, భవనాలకు, ఇతర జనావాసాలకు గానీ ఎలాంటి చిన్ననష్టం కూడా సంభవించదు. ఇంకా చెప్పాలంటే.. ఇటీవల మయన్మార్ లో నాగా తీవ్రవాదులను భారత సేనలే ఎదుర్కొన్నాయి. 70మంది భారత ఆర్మీ కమాండోలు ఆపరేషన్ ప్రారంభించి ఈ సర్జికల్ ఆపరేషన్ ద్వారా 40నిమిషాల్లో పని పూర్తి చేశారు. ఆ సమయంలో 38మంది నాగా తీవ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో ఉపయోగించి బాంబుల పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ లక్షిత ప్రాంతాన్ని తుత్తునియలు చేయగల సామర్ధ్యం ఉంటుంది. 2003లో ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికా కూడా సర్జికల్ దాడులే చేసింది. అక్కడి ప్రభుత్వ భవనాలు, మిలటరీ క్యాంపులను ఈ దాడుల ద్వారానే ధ్వంసం చేసింది. -
38మంది హతం.. ఏడుగురు బందీ!
-
అఖిలపక్ష సమావేశం ప్రారంభం
-
భారత సైన్యం ఎలా కదిలిందంటే?
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేపట్టిన సర్జికల్ దాడుల వివరాలను భారత సైన్యం అధికారికంగా ఆయా రాజకీయ పార్టీల సీనియర్లకు, అగ్ర నాయకులకు, ముఖ్యమంత్రులకు చాలా స్పష్టంగా వివరించింది. అర్థరాత్రి 12.30గంటల ప్రాంతంలో మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ తెల్లవారు జామున 4.30గంటల ప్రాంతంలో ముగిసినట్లు వివరించింది. ఊడీ ఉగ్రదాడి నేపథ్యంలో తొలిసారి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం దాదాపు ఎనిమిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగిన తర్వాత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాక్ ఈ విషయం చేరవేశారు. అనంతరం ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి తాము దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు చెప్పడంతోపాటు తాజాగా జరిపిన దాడి గురించి ఆర్మీ తరుపున ఆయా ముఖ్యమంత్రులకు అగ్రనేతలకు చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ దాడి వివరాలను తెలియజేశారు. సైన్యం చెప్పిన వివరాల ప్రకారం సైన్యం ఆపరేషన్ కు ఎలా కదిలిందంటే.. ఉడీ ఉగ్రదాడి చేసేందుకు ముందు పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు పెద్దపెద్ద కొండ ప్రాంతాల నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలుసుకున్నారు. ఉడీ ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులే హతమయ్యారు. దీని ప్రకారం మరింత మంది ఉగ్రవాదులు సమీప ప్రాంతంలోని ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో వారం రోజుల ముందే భారత సైన్యం ప్రణాళిక సిద్ధం చేసి నిఘా ప్రారంభించింది. వారు ఏ క్షణంలోనైనా మరోసారి దాడి చేయొచ్చని నిఘా సమాచారం అందింది. దీంతో బదులు చెప్పాలని నిర్ణయించుకున్న సైన్యం నియంత్రణ రేఖను తొలిసారి దాటి పాకిస్థాన్ భూభాగం వైపు 500 మీటర్ల నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ముందుకు కదిలాయి. వివిధ సెక్టార్లలోని ఎనిమిది స్థావరాలపై దాడి చేశాయి. ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు భారత ఆర్మీ పారాకమాండోస్, హెలికాప్టర్లను ఉపయోగించారు. బలగాలను ఈ హెలికాప్టర్ల ద్వారా అనుమానిత ప్రాంతంలోకి దించారు. ఒక్కసారిగా అనూహ్యంగా భారత్ సైన్యం నిర్వహించిన సర్జికల్ ఆపరేషన్ లో ఉగ్రవాద శిబిరాలకు భారీ నష్టం చోటుచేసుకుంది. దాదాపు 38మంది ఉగ్రవాదులు హతమై మరికొందరు బందీగా తీసుకున్నారు ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యర్ధుల నుంచి లభించిన ఆయుధాలు అన్నీ కూడా పాక్ కు చెందినవని గుర్తించారు. ఈ దాడిలో హతమైనవారు పాక్ ప్రాంతానికి చెందినవారు, పాక్ ఆక్రమితి కశ్మీర్ కు చెందినవారని తెలిసింది. ఈ దాడిలో కేవలం ఉగ్రవాదులే కాకుండా వారికి దారి చూపించేవారు, శిబిరాల నిర్వాహకులు కూడా ఉండటంతో ఎక్కువమంది గాయపడ్డారు. ఈ దాడిలో హతమైన వారంతా జమ్మూకశ్మీర్ తోపాటు ఇతర మెట్రో నగరాలపై దాడులు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
38మంది హతం.. ఏడుగురు బందీ!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసింది. మరో ఏడుగురు బందీ అయినట్లు సమాచారం. అయితే, ఈ దాడిలో భారత్ సైనికుల్లో ఏ ఒక్కరూ గాయపడలేదు. భారత ఆర్మీ ప్రత్యేక దళం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30గంటల ప్రాంతంలో దాడిని ప్రారంభించి 4.30గంటల ప్రాంతంలో ముగించింది. ఈ దాడి ముగిసిన వెంటనే ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాక్ ఈ విషయం చేరవేశారు. పాక్ కూడా భారత సైన్యం తమ భూభాగంలోకి చొరబడినట్లు ఒప్పుకుంది. ఉడీ ఉగ్రదాడిలో 18మంది వీర జవాన్లను కోల్పోయిన భారత్ తీవ్రంగా బాధపడింది. ఈ విషయంలో గట్టిగా స్పందించాలని నిర్ణయించింది. ఉడీ దాడి జరిగిన రోజే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాక్ ఉగ్రమూకలపై సైన్యంతోనే బుద్ధి చెబుతామని అన్నారు. అదే సమయంలో ఈ దాడిని పాక్ ఖండించకపోగా భారత్ ని రెచ్చగొట్టింది. ఆ దాడి వాళ్లే చేసుకుని పాక్ పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ప్రతి దాడికి పాక్ ను నిందించడం అలవాటుగా మారిందని పేర్కొంది. ఇదే సమయంలో పాక్ ప్రధాని షరీఫ్ కూడా ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో ఉగ్రవాదులను వెనుకేసుకొచ్చాడు. దీంతో రక్తం పాలు కలిసి సాగడం కుదరదని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేశారు. పాక్ ఉగ్రవాద దేశం అని నేరుగా ప్రకటించారు. ప్రపంచమంతా ఆదేశాన్ని ఉగ్రవాద దేశంగా గుర్తించాలని అన్నారు. అదే సమయంలో తాము అణుదాడులకు కూడా వెనుకాడబోమంటూ పాక్ నుంచి స్వరం వినిపించింది. ఇదే అదనుగా తీసుకున్న మోదీ తన వ్యూహానికి మరింత పదును పెట్టారు. పాక్ పై ఘాటు విమర్శలు చేయడమే కాకుండా ఉడీ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందంటూ ఆధారాలతో సహా బయటపెట్టించారు. తాను సార్క్ సమావేశం కావడం లేదని అనూహ్యంగా ప్రకటించారు. భారత్ సరసనే బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, భూటాన్ కూడా నిలిచాయి. ఇదే సమయంలో మరికొంతమంది ఉగ్రవాదులు మరోసారి దాడికోసం రానున్నారని నిఘా సమాచారం తెలియడంతో దెబ్బకు దెబ్బ కొట్టాలనే తీరుగా పక్కా వ్యూహాత్మకంగా ఎన్నడూ లేనిది తొలిసారి మూడు కిలోమీటర్ల పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత్ సేన మెరుపుదాడి చేసింది. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సర్జికల్ ఆపరేషన్ నిర్వహించింది. పాక్ తో పోలిస్తే ఇలా భారత్ చేయడం తొలిసారి. ఆ దేశం ఇప్పటికే పదులసార్లు భారత్ లోకి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి చొరబడింది. -
‘భారత్ మాతాకి జై.. సైన్యం వెంటే మేమంతా..’
-
పాక్ భూభాగంపై భారత సైన్యం దాడులు
-
‘భారత్ మాతాకి జై.. సైన్యం వెంటే మేమంతా..’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం 'సునిశిత దాడులు' (సర్జికల్ స్ట్రైక్స్) చేయడాన్ని కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సమర్థించారు. దేశం మొత్తం సైన్యం వెనుక నిలబడుతుందని భరోసాయిచ్చారు. సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియజేశారు. ఉగ్రవాద స్థావరాలపై మన సైన్యం జరిపిన దాడి గర్వకారణమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదానికి మద్దతు మానునోవాలని పలుమార్లు దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చినా దాయాది దేశం తన వైఖరిని మార్చుకోలేదన్నారు. ‘భారత్ మాతాకి జై. జాతి యావత్తు సైనం వెనుక ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ తీవ్రవాదిలా వ్యవహరిస్తోందని, దానికి తగిన సమాధానం చెప్పాల్సిన అసవరముందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి భారత్ సైన్యం నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘తీవ్రవాదులలందరికీ ఇది తగిన గుణపాఠం. మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు మాకు ఉంద’ని బీజేపీ నాయకుడు షహనవాజ్ హుస్సేన్ అన్నారు. Proud of our armed forces for their heroic surgical strikes on terror launch pads. — Ravi Shankar Prasad (@rsprasad) 29 September 2016 भारत माता की जय। पूरा देश भारतीय सेना के साथ है — Arvind Kejriwal (@ArvindKejriwal) 29 September 2016 I congratulate the brave Indian soldiers & the army leadership for giving a befitting reply to terrorists across LOC.@rammadhavbjp @BJPLive — Dr Raman Singh (@drramansingh) 29 September 2016 I again salute the valour of Indian Army for giving befitting reply to those attacking innocent Indians & ensuring zero tolerance on terror. — Amit Shah (@AmitShah) 29 September 2016 These operations r a part of d mandate of the Army to prevent infiltration of terrorists into J&K from across the Line of Control. — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 September 2016 Nation is proud of PM @narendramodi for isolating #Pakistan & now conducting surgical strikes to give a befitting reply to proxy war. — Prakash Javadekar (@PrakashJavdekar) 29 September 2016 Congratulations to our Rock Solid Army for the #SurgicalStrike Congratulations to our PM Shri @narendramodi he stands true to his reputation — Rajyavardhan Rathore (@Ra_THORe) 29 September 2016 -
పాక్ భూభాగంపై భారత సైన్యం దాడులు
భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై 'నిర్దేశిత దాడులు' (సర్జికల్ స్ట్రైక్స్) చేసింది. పాక్ భూభాగంలోనే తాము ఈ దాడులు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తెలిపారు. పాక్ భూభాగంలో ఉన్న 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులకు దాడుల విషయం గురించి చెప్పారు. ''నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల లాంచ్పాడ్లపై భారత సైన్యం గత రాత్రి నిర్దేశిత దాడులు చేసింది. ఈ దాడిలో భారత సైన్యం వైపు నుంచి ఎలాంటి నష్టం సంభవించలేదు. మన భూభాగంలోకి చొరబడాలని కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులను మట్టి కరిపించడమే ఈ దాడుల ఉద్దేశం. నేను పాకిస్థాన్ డీజీఎంఓకు ఫోన్ చేసి, మన ఆందోళన గురించి చెప్పాను, గత రాత్రి నిర్దేశిత దాడులు చేసినట్లు వివరించాను'' అని లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు వాళ్ల భూభాగంలో చోటు ఇవ్వొద్దని ఇన్నాళ్లుగా పదే పదే చెబుతున్నా వాళ్లు మాత్రం దాడులకు పాల్పడుతూనే ఉన్నారని ఆయన అన్నారు. పూంఛ్ లోను, ఉడీలోను ఈనెల 11, 18వ తేదీలలో జరిగిన దాడులే అందుకు నిదర్శనమని చెప్పారు. ఇక భారత సైన్యం దాడులకు దేశంలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇది అద్భుతమైన ఆపరేషన్ అని, భారత సైన్యం బాగా స్పందించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఫాలీ హోమీ మేజర్ అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఏం చెప్పారో అదే చేస్తున్నారని బీజేపీ నాయకుడు రాం మాధవ్ ట్వీట్ చేశారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను శిక్షించడం మొదలైందని ఆయన చెప్పారు. మరోవైపు.. భారత సైన్యం దాడులను ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. శాంతి కావాలని కోరుకుంటున్న తమ విధానాన్ని తమ బలహీనతగా భావించకూడదని ఆయన అన్నారు. తమ దేశ రక్షణ, భద్రతలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. భారత్ సైన్యం విడుదల చేసిన ప్రకటన