భారత సైన్యం ఎలా కదిలిందంటే? | indian army prepared plan 7 days back | Sakshi
Sakshi News home page

భారత సైన్యం ఎలా కదిలిందంటే?

Published Thu, Sep 29 2016 4:11 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

భారత సైన్యం ఎలా కదిలిందంటే? - Sakshi

భారత సైన్యం ఎలా కదిలిందంటే?

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేపట్టిన సర్జికల్ దాడుల వివరాలను భారత సైన్యం అధికారికంగా ఆయా రాజకీయ పార్టీల సీనియర్లకు, అగ్ర నాయకులకు, ముఖ్యమంత్రులకు చాలా స్పష్టంగా వివరించింది. అర్థరాత్రి 12.30గంటల ప్రాంతంలో మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ తెల్లవారు జామున 4.30గంటల ప్రాంతంలో ముగిసినట్లు వివరించింది. ఊడీ ఉగ్రదాడి నేపథ్యంలో తొలిసారి పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం దాదాపు ఎనిమిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను మట్టికరిపించిన విషయం తెలిసిందే.

ఈ దాడి జరిగిన తర్వాత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాక్ ఈ విషయం చేరవేశారు. అనంతరం ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి తాము దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు చెప్పడంతోపాటు తాజాగా జరిపిన దాడి గురించి ఆర్మీ తరుపున ఆయా ముఖ్యమంత్రులకు అగ్రనేతలకు చెప్పారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ దాడి వివరాలను తెలియజేశారు. సైన్యం చెప్పిన వివరాల ప్రకారం సైన్యం ఆపరేషన్ కు ఎలా కదిలిందంటే..

  • ఉడీ ఉగ్రదాడి చేసేందుకు ముందు పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు పెద్దపెద్ద కొండ ప్రాంతాల నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలుసుకున్నారు.
  • ఉడీ ఉగ్రదాడిలో నలుగురు ఉగ్రవాదులే హతమయ్యారు. దీని ప్రకారం మరింత మంది ఉగ్రవాదులు సమీప ప్రాంతంలోని ఉన్నట్లు సమాచారం అందింది.
  • దీంతో వారం రోజుల ముందే భారత సైన్యం ప్రణాళిక సిద్ధం చేసి నిఘా ప్రారంభించింది.
  • వారు ఏ క్షణంలోనైనా మరోసారి దాడి చేయొచ్చని నిఘా సమాచారం అందింది. దీంతో బదులు చెప్పాలని నిర్ణయించుకున్న సైన్యం నియంత్రణ రేఖను తొలిసారి దాటి పాకిస్థాన్ భూభాగం వైపు 500 మీటర్ల నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ముందుకు కదిలాయి.
  • వివిధ సెక్టార్లలోని ఎనిమిది స్థావరాలపై దాడి చేశాయి.
  • ఈ ఆపరేషన్‌ నిర్వహించేందుకు భారత ఆర్మీ పారాకమాండోస్‌, హెలికాప్టర్లను ఉపయోగించారు. బలగాలను ఈ హెలికాప్టర్ల ద్వారా అనుమానిత ప్రాంతంలోకి దించారు.
  • ఒక్కసారిగా అనూహ్యంగా భారత్ సైన్యం నిర్వహించిన సర్జికల్ ఆపరేషన్ లో ఉగ్రవాద శిబిరాలకు భారీ నష్టం చోటుచేసుకుంది.
  • దాదాపు 38మంది ఉగ్రవాదులు హతమై మరికొందరు బందీగా తీసుకున్నారు
  • ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యర్ధుల నుంచి లభించిన ఆయుధాలు అన్నీ కూడా పాక్ కు చెందినవని గుర్తించారు.
  • ఈ దాడిలో హతమైనవారు పాక్ ప్రాంతానికి చెందినవారు, పాక్ ఆక్రమితి కశ్మీర్ కు చెందినవారని తెలిసింది.
  • ఈ దాడిలో కేవలం ఉగ్రవాదులే కాకుండా వారికి దారి చూపించేవారు, శిబిరాల నిర్వాహకులు కూడా ఉండటంతో ఎక్కువమంది గాయపడ్డారు.
  • ఈ దాడిలో హతమైన వారంతా జమ్మూకశ్మీర్ తోపాటు ఇతర మెట్రో నగరాలపై దాడులు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement