Audion launch
-
అందుకే డబ్ చేశాం
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్గా, రవీనా కీలక పాత్రలో నటించారు. ఈ నెల 4న తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాను అదే టైటిల్‌తో ‘దిల్’ రాజు తెలుగులో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ‘లవ్ టుడే’ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, నటి రాధికా శరత్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా విడుదలైన ‘లవ్ టుడే’ యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తమిళ ట్రైలర్ చూసి రీమేక్ ఆలోచన వచ్చింది. కానీ మ్యాజిక్ మిస్సవుతుందేమోనని తెలుగులో డబ్ చేశాం’’ అన్నారు. ‘‘తమిళంలోలానే ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు ప్రదీప్. -
రావణలంకలో పాటలు
క్రిష్ బండిపల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రావణలంక’. బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వం వహించారు. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో అశ్విత, త్రిష కథానాయికలుగా నటించారు. ఉజ్జల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను డైరెక్టర్ వీరశంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత క్రిష్ బండిపల్లి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఎందుకు నువ్వే నిర్మిస్తున్నావని కొందరు స్నేహితులు అడిగారు. వేరే నిర్మాతల దగ్గరికి వెళితే బడ్జెట్ సమస్యలు వస్తాయని నేనే నిర్మించానని చెప్పాను. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. హిమాలయాల్లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు తీశాం. బ్యాంకాక్, వైజాగ్‌లోనూ చిత్రీకరణ జరిపాం. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు’’ అన్నారు బి.ఎన్.ఎస్ రాజు. -
ఈ పాట మెగాభిమానులకు అంకితం
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. నటుడు ‘షకలక’ శంకర్ టైటిల్ పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆడియోను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రభు ఎంతో ఆవేదనతో, ధర్మాగ్రహంతో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ చేరువ కావాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం నేను స్వయంగా రాసిన ‘వర్మా వర్మా వర్మా... ఓ రాంగ్ గోపాల్ వర్మ... ఇలా కాలింది ఏమిటయ్యా నీ ఖర్మ..’ అనే పాటని ర్యాప్ షకీల్ చక్కగా పాడటంతో పాటు మా చిత్రానికి సంగీతం అందించాడు. ఈ పాటను మెగాభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యా¯Œ ్సకు అంకితం చేస్తున్నాను. అందుకే పవన్ పుట్టినరోజున ఈ పాటను విడుదల చే శాం. చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ముగ్గురు పవన్ అభిమానులకు మా చిత్రం ద్వారా వచ్చే ఆదాయంలో పావు వంతు వారి కుటుంబాలకు అందిస్తాం’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ షకీల్ పాల్గొన్నారు. -
అమ్మాయంటే అలుసా దిశకు అంకితం
‘‘స్టార్ హీరోలు, దర్శకుల దగ్గర ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాను. తొలిసారి నిర్మాతగా మారి సినిమా తీశాను. అనుకోని ఇబ్బందుల వల్ల సినిమా ఆగిపోతే నా భార్యకు తెలియకుండా ఇల్లు అమ్మేసి సినిమా పూర్తి చేశాను’’ అన్నారు నేనే శేఖర్. ఆయన హీరోగా, దర్శక–నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. కార్తీక్ రెడ్డి, స్వాతి, శ్వేత, ఆర్తి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల చేశారు.‘‘ప్రస్తుత సమాజానికి ఎటువంటి కథ అయితే బావుంటుందో తెలిసినవాడు శేఖర్’’ అన్నారు నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత రామసత్యనారాయణ. ‘‘ఈ సినిమాను దిశకు అంకితం చేస్తున్నా’’ అన్నారు నేనే శేఖర్. -
‘కాప్పాన్’ ఆడియో ఫంక్షన్
-
సూర్యకు నటన రాదనుకున్నా!
‘‘తన సహనటులెవరికీ చెడ్డ పేరు రాకూడదనుకుంటారు శివకుమార్. వాళ్ల అబ్బాయిలు సూర్య, కార్తీని కూడా అలానే పెంచారు. తొలి సినిమా ‘పరుత్తివీరన్ (‘మల్లిగాడు’)లో కార్తీ అద్భుతంగా చేశాడు. సూర్య ఫస్ట్ సినిమా చూసి తనకు నటించడం రాదేమో? అనుకున్నాను. తనని తాను మలచుకొని ఈ స్థాయిలో నిలబడ్డాడు’’ అని రజనీకాంత్ అన్నారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాప్పాన్’ (తెలుగులో బందోబస్త్). సయేషా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈరోజు సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు కేవీ ఆనంద్ నా ‘శివాజీ’ సినిమాకు కెమెరామేన్. ఆయనకు కథ మీద మంచి జడ్జిమెంట్ ఉంది. నేను ఆయనతో ఓ సినిమా చేయాలి కానీ ఆగిపోయింది. మోహన్‌లాల్ గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. హ్యారిస్ మ్యూజిక్ బావుంటుంది. ‘నేనే దేవుణ్ణి’ సినిమాలో ఆర్య నటన ఆశ్చర్యం కలిగించింది. తమిళ ఇండస్ట్రీకు దొరికిన వరం నిర్మాత సుభాస్కరన్. ప్రస్తుతం ‘ఇండియన్ 2, దర్బార్, పొన్నియిన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. ‘శివపుత్రుడు, గజిని, సింగం, సింగం 2’ వంటి గొప్ప సినిమాలు చేశారు సూర్య. విద్యా వ్యవస్థపై సూర్య చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ‘అగరం’ సంస్థ ద్వారా ఎందర్నో విద్యావంతుల్ని చేస్తున్నారు సూర్య’’ అన్నారు. ‘‘కేవీ ఆనంద్‌గారు, నేను చేస్తున్న మూడో (వీడొక్కడే, బ్రదర్స్) సినిమా ఇది. అందర్నీ మెప్పించేలా ఈ సినిమా తీశారాయన. సుభాçస్కరన్గారికి థ్యాంక్స్. ఆర్య ముందే సాయేషాతో ప్రేమగా నటించే సీన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాను (నవ్వుతూ). రజనీకాంత్‌గారికి, శంకర్‌గారికి థ్యాంక్స్. ఒకరి దారి రహదారి.. మరొకరేమో తన సినిమాలతో ఇండస్ట్రీను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. నా బలం ఫ్యాన్సే. కుటుంబం తర్వాతే సమాజం గురించి ఆలోచించండి (అభిమానులను ఉద్దేశిస్తూ..)’’ అన్నారు సూర్య. ‘‘ఈ కాప్పాన్కు (రక్షించేవాడు) పైనున్న కాప్పాన్ అండగా నిలుస్తాడనుకుంటున్నాను’’ అన్నారు మోహన్‌లాల్. ‘‘సూర్య రానురాను యువకుడిలా మారిపోతున్నాడు. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి’’ అన్నారు శంకర్. ‘‘ఈ సినిమాలో మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్ర చేశారు. సూర్యకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. సీన్ అద్భుతంగా రావడానికి ఎంత కష్టమైనా పడతాడు సూర్య’’ అన్నారు ఆనంద్. ‘‘సమాజం మీద బాధ్యత ఉన్న కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. నటుడిగా ఆల్రెడీ నిరూపించుకున్నారు’’ అన్నారు రచయిత వైరముత్తు. ‘‘6వ తరగతిలో పెయింటింగ్ పోటీలో నా చేతుల మీదగా ఆవార్డ్ తీసుకున్నారు ఆనంద్. సూర్యకు, తనకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు శివకుమార్. -
‘వెల్కమ్ టు అమెరికా’ ఆడియో ఆవిష్కరణ