పోలీస్ కస్టడీకి ఫకృద్దీన్, బిలాల్
సేలం, న్యూస్‌లైన్: బీజేపీ నేత, ఆడిటర్ రమేష్ హత్యకేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పోలీస్ ఫకృద్దీన్, బిబాల్ మాలిక్‌లను 12 రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి విజయలక్ష్మి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. వేలూరు జైలులో ఉన్న తీవ్రవాదులు ఫకృద్దీన్, బిలాల్ మాలిక్‌లను పోలీ సులు ఆడిటర్ రమేష్ హత్య కేసులో బుధవారం అరెస్టు చేశారు. వారిని గురువారం సేలం జ్యుడీషియల్ మేజి స్ట్రేట్ నంబర్ 4 కోర్టులో హాజరు పరి చారు. ఈ కేసుపై న్యాయమూర్తి విజయలక్ష్మి విచారణ జరిపారు. ఫకృద్దీన్, బిబాల్‌లను 12 రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తూ ఉత్తర్వులిచ్చారు. వారిని సే లం సూరమంగళంలో ఉన్న మహిళా పో లీసు స్టేషన్లో ఉంచి విచారణ చేయాలని, మూడు రోజులకు ఒక వారి న్యాయవాది పుగళేంది,
జాహీర్ అహ్మద్‌లను అర గంట కలుసుకోవచ్చునని తెలిపారు. అనంతరం వారిద్దరినీ పోలీ సులు బయటకు తీసుకు వస్తుండగా సేలంలోని పత్రికలు, టీవీ చానళ్ల విలేకర్లు, ఫొటో గ్రాఫర్లు ఫకృద్దీన్, బిబాల్‌లను ఫొటోలు తీసేందుకు ప్రయత్నిం చారు. విలేకర్లను,ఫొటో గ్రాఫర్లను పో లీసులు తోసేశారు. దీంతో కెప్టన్ టీవీ రిపోర్టన్ నారాయణన్, దినమలర్ వెబ్ టీవీ రిపోర్టర్ జ్యోతి కింద పడి గాయపడ్డారు. దీంతో విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ముందుఉన్న ఏర్కాడు మెయిన్ రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న సేలం సిటీ డెప్యూటీ కమిషనర్ ఏజీ బాబు ఏర్కాడు సెంటర్‌కు చేరుకుని విలేకర్లతో చర్చలు జరిపారు. అనంతరం విలేకర్లు అక్కడ నుంచి న్యా యమూర్తి మోహన్‌దాస్‌ను కలుసుకుని పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు.