Aurangabad district
-
శ్రీమంతుడు... నానాపటేకర్
సాక్షి, ముంబై: కరువు ప్రాంత రైతులను ఆదుకునేందుకు తనవంతుగా కృషి చేస్తున్న బాలీవుడ్ నటుడు నానాపటేకర్.. మరో అడుగు ముందుకేశారు. మరో నటుడు మకరంద్ అనాస్పురేతో కలసి స్థాపించిన ‘నామ్’ సంస్థ తరఫున ఔరంగాబాద్ జిల్లాలోని థోందలాగావ్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మహాత్మా గాంధీ జయం తి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గ్రామసభలో నానా పటేకర్, మకరంద్ ఈ విషయాన్ని ప్రకటించారు. మరాఠ్వాడలో నెలకొన్న కరువు పరిస్థితులపై వీరిద్దరు చొరవ తీసుకుని రైతులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరికొందరు బాలీవుడ్, మరాఠీ చలనచిత్ర పరిశ్రమకు చెంది న వారు కూడా రైతులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలసి స్థాపించిన నామ్ సంస్థ మరాఠ్వాడలోని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి మరో అడుగు ముందుకేసింది. రాబోయే రోజు ల్లో కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో రైతులకు సూచనలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే జల వనరులతోపాటు రైతుల కోసం కొన్ని ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నారు. రైతులతో భేటీ అవుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. నామ్ సంస్థకు మద్దతు తెలిపే వారి సంఖ్య పెరగడంతోపాటు వీరు తోడ్పాటు అందించే రైతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలిపారు. -
నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్
ఔరంగాబాద్: అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన బీహార్లోని ఔరంగబాద్ జిల్లాలోని న్యూఢిల్లీ - కోల్కత్తా 2వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉపేంద్ర కుమార్ శర్మ వెల్లడించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. శివభక్తులంతా జార్ఖాండ్లోని దేవ్గఢ్ దేవాలయాన్ని సందర్శించుకుని వస్తున్నారని... ఆ క్రమంలో శివభక్తులంతా ప్రయాణ బడలికతో వారు ప్రయాణిస్తున్న బస్సును జాతీయ రహదారి పక్కన ఉంచి ... ఆ పక్కనే వారు నిద్రకు ఉపక్రమించారని ఎస్పీ వెల్లడించారు. అదే రహదారిపై అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పడంతో శివభక్తులపైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పోలీసు అధికారి బంగ్లా పేల్చివేత
పాట్నా: బీహార్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసు అధికారి బంగ్లాను పేల్చివేశారు. ఔరంగాబాద్ జిల్లాలోని మంజౌలీ గ్రామంలో ఈ దాడికి పాల్పడ్డారు. ఇన్స్పెక్టర్ కేదార్ నాథ్ సింగ్ బంగ్లాను మావోయిస్టులు పేల్చివేశారు. కొద్ది రోజుల క్రితం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేశారు. ఇంట్లో ఉన్న వారిని బయటకు రమ్మని డైనమేట్ తో పేల్చివేశారని ఔరంగాబాద్ ఎస్పీ ఉపేందర్ కుమార్ శర్మ తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.