పాట్నా: బీహార్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసు అధికారి బంగ్లాను పేల్చివేశారు. ఔరంగాబాద్ జిల్లాలోని మంజౌలీ గ్రామంలో ఈ దాడికి పాల్పడ్డారు. ఇన్స్పెక్టర్ కేదార్ నాథ్ సింగ్ బంగ్లాను మావోయిస్టులు పేల్చివేశారు. కొద్ది రోజుల క్రితం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేశారు.
ఇంట్లో ఉన్న వారిని బయటకు రమ్మని డైనమేట్ తో పేల్చివేశారని ఔరంగాబాద్ ఎస్పీ ఉపేందర్ కుమార్ శర్మ తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.
పోలీసు అధికారి బంగ్లా పేల్చివేత
Published Thu, Jul 24 2014 2:48 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement