Auto Johnny
-
ఆటోలో మెగాస్టార్!
⇒ మీలో ఎవరు కోటీశ్వరుడులో సత్తాచాటిన ఆటోడ్రైవర్ ⇒ కానిస్టేబుల్‌గానూ ఎంపిక ⇒ రూ.3.60లక్షలు సొంతం చేసుకున్న మేడ్చల్ యువకుడు మేడ్చల్: మెున్నటివరకు అతనొక సాధారణ యువకుడు. రెక్కాడితే గానీ డొక్కాడని. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా చదువు ఆగిపోవడంతో తండ్రిలాగే ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు. అయితే తాను ఆందరిలా జీవించకూడదని ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు.అందుకు తగినట్లుగా కృషి చేశాడు. ఓ వైపు ఆటో నడుపుతూనే ఇంటర్మీడియట్ పూర్తి చేసి పోలీస్ ఉద్యోగం కోసం సాధన చేశాడు కొంత కాలం ఇంటికి దూరంగా నగరంలో ఉంటూ కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అతడికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రూపంలో జాక్‌ఫాట్ తగిలింది. ఈ కార్యక్రమం నాల్గవ సెషన్లో పాల్గొన్న సతీష్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకున్నాడు. అతడే ఆధారం మేడ్చల్ మండలం పూడూర్ గ్రావూనికి చెందిన తాళ్ళపల్లి సత్యనారాయణ, శారద దంపతులకు కుమారుడు సతీష్‌గౌడ్(26), కుమార్తె సౌజన్య ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సతీష్ చిన్నతనం నుంచే బతుకుపోరాటంలో రాటుదేలాడు. పేపర్ బాయ్‌గా, చిట్ ఫండ్స్‌లో కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తూ 10వ తరగతి పూర్తి చేశాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి ఆటో డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించాడు. నగరంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పొషిస్తూనే ఇంటర్ పూర్తి చేశాడు. అంతలో చెల్లెలు సౌజన్య పెళ్లి చేయడం, అనారోగ్యంతో తండ్రి మరణంతో కుటుంబ భారం అతడిపైనే పడింది. కలిసొచ్చిన కోటీశ్వరుడు.... పోలీస్ ఉద్యోగం సాధించాలనే తపనతో కఠోర శ్రమ చేసి అన్ని పరీక్షల్లో అర్హత సాధించి శిక్షణ కోసం ఎదురు చూస్తున్న సతీష్‌కు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ద్వారా అదృష్టం తలుపుతట్టింది. చిరంజీవి నేతృత్వంలో ప్రారంభంకానున్న నాలుగో సెషన్లో పాల్గొనేందుకు ఎస్ఎంఎస్ ద్వారా వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం పంపాడు. అనంతరం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆడిషన్స్‌లో మంచి మార్కులతో అర్హత సాధించాడు. కార్యక్రమంలో ఇద్దరి తర్వాత హాట్ సీట్‌కు చేరుకున్నాడు. రూ.3.60లక్షలు సొంతం హాట్ సీట్‌కు చేరుకున్న సతీష్ పలు ప్రశ్నలకు చకచకా సమాధానాలు చెప్పి రూ.1.60 లక్షలు గెలుచుకున్నాడు. పేద కుటుంబానికి చెందిన సతీష్‌ను ప్రొత్సహించేందుకు గాను చిరంజీవి స్వయంగా రూ.2 లక్షలు అందజేశారు. సతీష్ ఆటోలో ఆటో జానీ హాట్ సీట్‌కు చేరుకున్న సతీష్ చిరంజీవిని తమ ఆటోలో ఎక్కాలని కోరడంతో అందుకు అంగీకరించిన మెగాస్టార్ తాను కూడా ఆటో ఎక్కి చాలా రోజులైందని చెబుతూ సతీష్ ఆటో ఎక్కాడు. మెగాస్టార్ చిరంజీవి తన ఆటోలో ఎక్కడం సంతోషంగా ఉందని సతీష్ పేర్కొన్నాడు. ఈ సందర్బంగా అతను చిరంజీవికి ఆటో డ్రైవర్ యూనిఫామ్( చొక్కా)ను బహుమతిగా అందజేశారు. ఆనందంగా ఉంది : సతీష్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న నాకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. చిరంజీవి నా ఆటోలో ఎక్కడం ఎప్పటికి మరిచిపోలేను. కార్యక్రమం ద్వారా గెలుచుకున్న డబ్బుతో అప్పులు తీరుస్తా శుక్రవారం విడుదలైన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో అర్హత సాధించడం ఆనందంగా ఉంది. పోలీస్ ఉద్యోగం చేతపట్టి కుటుంబాన్ని మరింత బాగా చూసుకుంటా. -
మెగాస్టార్ స్టోరీని పికప్ చేసిన రవితేజ?
-
పూరి దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం
ఆటోజానీ 2015, మే 9.... మెగాస్టార్ చిరంజీవికి మోస్ట్ మెమరబుల్ డే. సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘జగదేకవీరుడు- అతిలోక సుందరి’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల కుంభవృష్టి కురిపించింది. చిరంజీవి టాప్‌టెన్ చిత్రాల్లో కచ్చితంగా నిలిచే సినిమా ఇది. ఆ చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత సి.అశ్వనీదత్‌లను శనివారం తన ఇంటికి పిలిచి నూతన వస్త్రాలతో సత్కరించి ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ నాటి జ్ఞాపకాలను తలచుకున్నారు చిరంజీవి. ఈ హడావిడి అంతా అయిపోయాక, రాత్రి పూట చిరంజీవిని పూరి జగన్నాథ్ కలిశారు. చిరంజీవి 150వ సినిమా కోసం పూరి కథ చెప్పడం మొదలుపెట్టారు. చిరంజీవి స్పెల్ బౌండ్ . వెంటనే లేచి పూరిని హగ్ చేసుకుని, ‘‘నా 150వ చిత్రానికి నువ్వే దర్శకుడివి’’ అని చెప్పేశారు. దాంతో కొన్నేళ్లుగా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన నిరీక్షణకు తెరపడి నట్టే. ‘శంకర్‌దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయడం, దాంతో ఏడేళ్లు వెండితెరకు దూరం కావడం తెలిసిందే. గతేడాది కాలంగా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది చిరంజీవికి కథలు వినిపించారు కూడా. అయితే తన రీ ఎంట్రీ, దానికి తోడు 150వ సినిమా కావడంతో చిరంజీవి కథ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రెండు నెలల క్రితం చిరంజీవి కోసం ‘ఆటో జానీ’ పేరుతో కథ తయారు చేస్తున్నట్టు పూరి వెల్లడించారు. ఫైనల్‌గా మొన్న శనివారం రాత్రి చిరంజీవికి పూరి కథ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. చిరంజీవి ఎక్స్ట్రార్డినరీగా కామెడీ పండిస్తారు. ఈ కోణంలో పూరి ఎక్కువ దృష్టి పెట్టి ఈ స్క్రిప్టు తయారు చేశారని వినికిడి. చిరంజీవి వీరాభిమాని అయిన పూరి జగన్నాథ్‌కు ఎప్పటినుంచో తన అభిమాన కథానాయకునితో సినిమా చేయాలని ఆకాంక్ష. గతంలో ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇన్నేళ్లకు పూరి కల నెరవేరనుంది. ఈ ‘ఆటో జానీ’ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సెప్టెంబరులో చిత్రీకరణ మొద లుపెట్టి 2016 సంక్రాంతికి ‘ఆటో జానీ’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలనేది పూరి సంకల్పం. పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడవుతాయి. -
పూరితో... ఆటోజానీ?
రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ, మళ్ళీ గ్లామర్ మీద, ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టిపెట్టిన నటుడు - రాజకీయవేత్త చిరంజీవి. ఇంతకీ ఆయన నటించే 150వ సినిమా ఏమిటి? దర్శకుడు ఎవరు? కొన్ని నెలలుగా ఈ చర్చ సాగుతూనే ఉంది. ఇంతకీ, ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారా? ఇప్పుడు వినిపిస్తున్న మాట అదే! చిరంజీవి కోసం ఇప్పటి దాకా కథ, స్క్రిప్టు సిద్ధం చేయలేదన్న మాటే కానీ, ‘ఆటో జానీ’ పేరిట పూరి ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథే ఈ సంగతి వెల్లడించారు. సాక్షాత్తూ అమితాబ్ సైతం ఆ మధ్య మాట్లాడుతూ, చిరంజీవి 150వ సినిమాకు పూరి పేరు సిఫార్సు చేస్తూ, ఆయన దర్శకత్వం వహిస్తే తాను అందులో అతిథి పాత్ర చేస్తానన్న సంగతినీ పూరీయే గుర్తు చేశారు. ఇక, ఇటీవలే రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ తూటాల్లో చిరుకు పూరి పేరు సూచించిన విషయం తెలిసిందే! మరి ట్వీట్లు, సిఫార్సు మాటల మాటెలా ఉన్నా, టైటిల్ పెట్టి మరీ సిద్ధంగా ఉన్న వీరాభిమాని పూరికి చిరంజీవి చాన్సిస్తారా? చిరంజీవి ఫోన్‌కాల్ కోసం పూరి ఎదురు చూస్తుంటే, ఈ వార్త నిజమై, అధికారికంగా ఈ కాంబినేషన్ ఖరారైతే అంతకన్నానా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక పెదవి విప్పాల్సింది చిరంజీవే!