Automatic Transmission
-
మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్ వేరియంట్ రూ.18,600, సీఎన్జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను ఈ కారుకు పొందుపరిచారు. సీఎన్జీ వేరియంట్లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్ షిఫ్టర్స్‌తో అత్యాధునిక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. ఎక్స్ఎల్6 కొత్త వెర్షన్.. ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెలాఖరులో ఎక్స్ఎల్6 కొత్త వర్షన్ రానుందని ఆయన చెప్పారు. -
మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్
న్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (ఏటీ) ఫీచర్‌తో సరికొత్త న్యూ జనరేషన్ స్కార్పియోను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13.13 లక్షల నుంచి రూ.14.33 లక్షల (ఎక్స్‌షోరూం ఢిల్లీ) మధ్యలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏటీ వేరియంట్ ఎస్యూవీ స్కార్పియో టాప్-ఎండ్ ఎస్10 వేరియంట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగదారులకు అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా తెలిపారు. -
జెనెక్స్ నానో వచ్చేసింది..
ఐదు వేరియంట్లలో లభ్యం ⇒ ధరలు రూ.1.99 లక్షల నుంచి రూ.2.89 లక్షల రేంజ్లో ⇒ మైలేజీ 23.6 కి.మీ. వరకూ ముంబై: టాటా మోటార్స్ కంపెనీ కొత్త నానో కారును మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. పూర్తిగా మార్పులు, చేర్పులు చేసి జెనెక్స్ నానో పేరుతో ఈ కారును అందిస్తోంది. అధునాతన తాజా సాంకేతిక ఫీచర్లతో రూపాం దించిన ఈ కార్ల ధరలు రూ.1.99 లక్షల నుంచి రూ.2.89 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. 5 ప్రధాన వేరియంట్లలో, 7 రంగుల్లో ఈ జెనెక్స్ నానోను కంపెనీ అంది స్తోంది. స్మార్ట్ సిటీ కారుగా దీనిని రూపొం దించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. పాత నానో మోడళ్లనంటిన్ని ఆపేస్తున్నామని, సీఎన్జీ వేరియంట్‌ను మాత్రం కొనసాగిస్తామని పేర్కొన్నారు. తమ ప్రయాణికుల వాహన పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన బ్రాండ్‌గా నానో కొనసాగుతుందని తెలిపారు. రెండేళ్ల నుంచి వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వినూత్నమైన ఫీచర్లతో ఈ జెనెక్స్ నానోను అందిస్తున్నామని వివరించారు. మూడో నానో.. 2009 మార్చిలో నానో కారును మొదటిసారిగా టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చింది. ప్రారంభ ధరగా రూ. లక్షకే ఈ కారును(బేసిక్ మోడల్) అందించింది. ఈ ధరకు లక్ష కార్లను విక్రయిం చింది. అమ్మకాలు ఆశిం చిన విధంగా లేకపోవడం తో పలు మార్పు చేర్పులు చేసి నానో ట్విస్ట్ పేరుతో రెండో నానోను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నానో ట్విస్ట్ కూడా ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో తాజాగా జెనెక్స్ నానోను అంది స్తోంది. ఇప్పటివరకూ 2.7 లక్షల నానో కార్లు అమ్ముడయ్యాయి. జెనెక్స్ నానో ప్రత్యేకతలు.. ఆటోమాటిక్ ట్రాన్సిమిషన్ జెనెక్స్ నానో కార్లు 22.9 కి.మీ, ఆటోమాటిక్ ట్రాన్సిమిషన్ ఫీచర్ లేనివి 23.6 కి.మీ. మైలేజీని ఇస్తాయని కంపెనీ పేర్కొంది. డిజిటల్ ఇన్ఫో డిస్ప్లే, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, 110 లీటర్ల లగేజ్ స్పేస్, 500కి.మీ. దూర ప్రయాణానికి వీలుగా ఉండేలా 24 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్, బ్లూ టూత్ కనెక్టివిటీతో కూడిన యాంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. వేగం పెంచేం దుకు స్పోర్ట్స్ మోడ్, ట్రాఫిక్ బాగా ఉన్నప్పుడు పదే పదే బ్రేక్‌లు, యాక్సిలేటర్లను వాడకుండా క్రీప్ ఫీచర్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది.