ayush hospital
-
క్షీణిస్తున్న ఆయుష్
ఆయుష్ విభాగాలు నిర్వీర్యమవుతున్నాయి. ఈ వైద్య విధానాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తూ కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. జిల్లా కేంద్రమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆయుష్ విభాగంలో ఒక్క వైద్యుడూ లేకపోవడం..మందులు కొరత అందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు(హాస్పిటల్): పెద్దాసుపత్రిలోని ఆయుష్ విభాగంలో రెగ్యులర్ హోమియో వైద్యుడిగా ఉన్న డాక్టర్ వెంకటయ్య 2016 మే 19వ తేదీన బదిలీపై తెలంగాణాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన స్థానంలో డాక్టర్ సుజాతను నియమించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమె విధులకు సక్రమంగా హాజరయ్యేది కాదు. గత డిసెంబర్లో ఆమె గుడివాడకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. అప్పటి నుంచి బ్రాహ్మణకొట్కూరులో పనిచేస్తున్న డాక్టర్ భారతిని సోమ, బుధ, శుక్రవారాలు, ఆత్మకూరులో పనిచేస్తున్న డాక్టర్ జవహర్‌లాల్‌ను మంగళ, గురు, శనివారాల్లో డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేసేటట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్ భారతి రెగ్యులర్‌గా వస్తున్నా కొంత కాలంగా డాక్టర్ జవహర్లాల్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎవ్వరూ రావడం లేదు. రోగులు మాత్రం ఆసుపత్రికి వచ్చి వెనుతిరిగిపోతున్నారు. డిస్పెన్సరీలో డాక్టర్లు ఉంటారో..ఉండరోననే ఉద్దేశంతో ఇటీవల వారు రావడం కూడా మానేశారు. గతంలో ఇక్కడ రోజుకు 70 నుంచి 120 వరకు రోగులు చికిత్స కోసం వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఆయుర్వేద డిస్పెన్సరీలో 2017 జూన్‌లో డాక్టర్ పీవీ నాగరాజ బదిలీపై బనగానపల్లికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇక్కడ ఏ ఒక్కరినీ నియమించలేదు. పాణ్యంలో పనిచేస్తున్న డాక్టర్ గ్రేస్ సెలెస్టియల్ సోమ, బుధ, శుక్రవారాలు మాత్రమే వస్తూ రోగులను పరీక్షిస్తున్నారు. మిగిలిన రోజుల్లో వైద్యులు లేక రోగులు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. ఆయుర్వేదంలో మందులు ఖాళీ ఆయుర్వేద విభాగంలో మందులు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వం వద్ద ఆయుష్నిధులు పుష్కలంగా ఉన్నా ఇక్కడ మాత్రం మందుల కొరత వేధిస్తోంది. ఉండాల్సిన మందుల్లో 10 శాతం కూడా లేవు. వచ్చిన రోగులకు వైద్యులు ప్రైవేటుకు మందులు రాయాల్సి వస్తోంది. రెండు విభాగాల్లో డాక్టర్లు లేకపోవడంతో ఇక్కడ పనిచేసే ఫార్మాసిస్టులే రోగులకు పెద్ద దిక్కుగా మారారు. రెండు నెలలుగా మందులు లేవు నాకు గ్యాస్ట్రబుల్, కీళ్లనొప్పులు, షుగర్ వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులకు నేను గతంలో ఆయుర్వేద వైద్యాన్ని వాడుతూ తగ్గించుకున్నాను. ఆ మందులే నాకు బాగా పనిచేసేవి. ప్రైవేటుగా మందులు కొనుగోలు చేసినా ఇక్కడ ఇచ్చినంతగా పనిచేసేవి కావు. అయితే రెండు నెలల నుంచి ఇక్కడ మందులు లేకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది. –బి. నరసింహులు, రిటైర్డ్ సూపరింటెండెంట్, విద్యాశాఖ -
అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఔషధ మొక్కలకు నిలయమైన అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిలో ఏర్పాటు చేయనున్న ఆ ఆస్పత్రిలో ఆయుర్వేదం, హోమియో, యునానీ, నేచురో పతి వంటి ప్రత్యామ్నాయ వైద్యసేవలను అందించనున్నారు. అనంతగిరిలో 140 ఎకరాల విస్తీర్ణంలో టీబీ ఆస్పత్రి ఉంది. దీనిలోని 28 ఎకరాలను ఆయుష్ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. రూ.6 కోట్లతో 50 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం మరికొన్ని నిధులను కేటాయించనుంది. టీబీ ఆస్పత్రి పరిధిలో ఉన్న కొన్ని భవనాలను ఆయుష్ ఆస్పత్రికి కేటాయించనున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులతో రక్తపోటు, మధుమేహం, వెన్నునొప్పి, మెడ నొప్పి, కాళ్ల నొప్పుల వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతికూల ప్రభావాలు లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు ప్రకృతి వైద్యమే ఉత్తమ మని తాజాగా వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక ఆయుష్ ఆస్పత్రి ఉంది. ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కు వగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అనంతగిరిలో వైద్య శాఖ మరో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది. ఔషధ మొక్కల నిలయం... వికారాబాద్ సమీపంలో అనంతగిరి ప్రాంతం లో అడవులు ఉంటాయి. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితుల్లో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో ఆయు ష్ వైద్య సేవలందిస్తే రోగులకు త్వరగా ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో కొత్త ఆస్పత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే రోగులకు అవసరమైన వసతి ఏర్పాట్లను చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. అనంతగిరి ప్రాంతంలోని కొండల్లో భారీ సంఖ్యలో ఔషధ మొక్కలను నాటాలని అటవీ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. త్వరలోనే ప్రారంభం అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడి టీబీ ఆస్పత్రిలోని భవనాల్లో కొన్నింటిని అప్పగించనున్నారు. వైద్య సేవలకు అవసరమైన ఇతర వసతులను సమకూరుస్తున్నాం. ఇది పూర్తి కాగానే ఆస్పత్రిని ప్రారంభిస్తాం. – ఎ.రాజేందర్‌రెడ్డి, ఆయుష్ డైరెక్టర్ -
ప్రతి జిల్లాలోనూ ఆయూష్ ఆస్పత్రులు
లాలాపేట: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 20 పడకల ఆయూష్ హాస్పిటల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ఆయూష్ వైద్యాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయూష్ వైద్య సేవలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయి నుంచే ఆయూష్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. గతంలో అల్లోపతి, హోమియోపతి, ఆయూష్ వేర్వేరు విభాగాలుగా ఉన్నందున నిరాదరణకు గురయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందులో భాగంగా అన్ని రకాలైన వైద్య సేవలను ఒకే గొడుగు కిందికు తెస్తున్నామన్నారు. ప్రస్తుత ఆయూష్ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు నూతనంగా నిర్మించే హాస్పిటల్లలో ఆయూష్‌కు ప్రత్యేక స్థలం కేటాయించేలా, ఆహ్లదకరమైన వాతావరణం నెలకొల్పేలా వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తామన్నారు. అనంతగిరిలో ఆయూష్ హాస్పిటల్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయూష్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, కమిషనర్ బుద్ధప్రకాష్, డాక్టర్ రమణి, లలితకుమారి, డా. కరుణాకర్‌రెడ్డి, నీరజారెడ్డి, మనోహర్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.