Ayush Mhatre
-
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
India U-19 squad Announced for tour of England: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు సెలక్టర్లు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జూన్ 24- జూలై 23 వరకు సుదీర్ఘకాలం పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.ఇందులో భాగంగా తొలుత 50 ఓవర్ల ఫార్మాట్లో వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య రెండు మల్టీ-డే మ్యాచ్‌లు (Multi Day Matches) జరుగుతాయి.కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటుఇక ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే భారత యువ జట్టుకు ముంబై ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా అభిజ్ఞాన్ కుందును సెలక్ట్ చేశారు. అదే విధంగా.. ఐపీఎల్-2025లో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది.ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆయుశ్, వైభవ్‌ల ఆట తీరుపైనే ఉండనుంది. పొట్టి క్రికెట్లో అదరగొట్టిన ఈ ఇద్దరు యంగ్ స్టార్లు.. యాభై ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్లో యూకేలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు సాధించాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే చెన్నై తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి.. ఆరు మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2025లో తమదైన ముద్ర వేయగలిగారు.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టుఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ👉జూన్ 27- తొలి వన్డే- హోవ్👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్‌హామ్👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్.చదవండి: వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా -
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్, ఆయుశ్లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీఅదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్తాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయుశ్ కూడా అదరగొట్టాడుమరోవైపు.. ఆయుశ్ మాత్రే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయుశ్ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.ఒత్తిడికి లోనుకావద్దుఇదిలా ఉంటే.. రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత సీఎస్కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్, ఆయుశ్ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.అయితే, 200కు పైగా స్ట్రైక్ రేటు మెయింటెన్ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.అందుకు ఓటమిఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విఫలమైతే ఆ ప్రభావం లోయర్ ఆర్డర్‌పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం, ఢిల్లీ👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 187/8 (20)👉రాజస్తాన్ స్కోరు: 188/4 (17.1)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఓ సీజన్లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయం కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.విధ్వంసకర శతకంతొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్ అయిన వైభవ్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. తాజాగా సీఎస్కేపై చితక్కొట్టిన ఈ హర్యానా కుర్రాడు 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఓ శతకం, ఓ అర్ద శతకం సాయంతో 252 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అది కూడా 18 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించి.. తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్-2025లో తమ ఆఖరి మ్యాచ్‌లో చెన్నైతో తలపడ్డ రాజస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా సీజన్ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది.18 ఏళ్ల వయసు నిండక ముందే ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ- మొత్తం పరుగులు- 252 (రెండు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు)👉ఆయుశ్ మాత్రే- మొత్తం పరుగులు- 206 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉రియాన్ పరాగ్- మొత్తం పరుగులు- 160 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉సర్ఫరాజ్ ఖాన్- మొత్తం పరుగులు- 111 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0)👉అభిషేక్ శర్మ- 63 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0).చదవండి: ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటాNo fear and pressure 🙅Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
ఐపీఎల్ ఆడుతుండగానే మరో జాక్‌పాట్ కొట్టిన సీఎస్కే చిచ్చరపిడుగు
సీఎస్కే చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రే ఐపీఎల్ 2025 ఆడుతుండగానే మరో జాక్ పాట్ కొట్టాడు. నిన్న (మే 7) జరిగిన ముంబై టీ20 లీగ్ వేలంలో మాత్రేకు భారీ ధర దక్కింది. మాత్రేను ట్రయంప్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఫ్రాంచైజీ రూ. 14.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మాత్రే నాలుగో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వేలంలో అత్యధిక మొత్తం అథర్వ అంకోలేకర్‌కు దక్కింది. అంకోలేకర్‌ను ఈగల్ థానే స్ట్రయికర్స్ ఫ్రాంచైజీ రూ. 16.25 లక్షల ధరకు సొంతం చేసుకుంది. అంకోలేకర్ తర్వాత అత్యధిక బిడ్డింగ్ ముషీర్ ఖాన్, సాయిరాజ్ పాటిల్‌కు దక్కింది. ముషీర్‌ను ఏఆర్సీఎస్ అంధేరి.. సాయిరాజ్‌ను ఈగల్ థానే స్ట్రయికర్స్ రూ. 15 లక్షలకు దక్కించుకున్నాయి.వీరి తర్వాత వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కేకేఆర ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ నిలిచాడు. రఘువంశీని ముంబై ఫాల్కన్స్ రూ. 14 లక్షలకు దక్కించుకుంది. షమ్స్ ములానీకి 14 లక్షలు, సూర్యాంశ్ షేడ్గేకు రూ. 13.75 లక్షలు లభించాయి.కాగా, ముంబై టీ20 లీగ్ ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎనిమిది జట్లు నిన్న జరిగిన వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఒక్కో జట్లు గరిష్ఠంగా 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి జట్టు ఓ ఐకాన్ ఆటగాడిని ఎంపిక చేసుకుంది. ఐకాన్ ఆటగాడికి రూ. 20 లక్షలు లభిస్తాయి. సూర్యకుమార్ యాదవ్ (ముంబై నార్త్ ఈస్ట్), అజింక్య రహానే (బాంద్రా బ్లాస్టర్స్), పృథ్వీ షా (ముంబై పాంథర్స్), శ్రేయస్ అయ్యర్ (ముంబై ఫాల్కన్స్),శివమ్ దూబే (అంధేరి), శార్దూల్ ఠాకూర్ (థానే స్ట్రయికర్స్), సర్ఫరాజ్ ఖాన్ (ముంబై సబర్బ్స్), తుషార్ దేశ్‌పాండే (మరాఠ రాయల్స్) ఐకాన్ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. ఈ లీగ్ మే 26 నుంచి జూన్ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది.జట్ల వివరాలు..ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఐకాన్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్ (20 లక్షలు) ప్లేయర్స్: సిధాంత్ ఆధత్రావ్ (7.75 లక్షలు), ఆయుష్ మాత్రే (14.75 లక్షలు), సూర్యాంశ్ షెడ్గే (13.75 లక్షలు), పరీక్షిత్ వల్సంకర్ (7.25 లక్షలు), జే జైన్ (4 లక్షలు), హృషికేశ్ గోరే (3.40 లక్షలు), ఆకాష్ పవార్ (3 లక్షలు), శ్రేయాస్ గురవ్ (3 లక్షలు), భరత్ సుదమ్ పాటిల్ (2 లక్షలు), మకరంద్ పాటిల్ (2 లక్షలు)బాంద్రా బ్లాస్టర్స్ ఐకాన్ ప్లేయర్: అజింక్యా రహానే (20 లక్షలు) ప్లేయర్లు: సువేద్ పార్కర్ (8.50 లక్షలు), ఆకాశ్ ఆనంద్ (8.25 లక్షలు), రాయ్స్టన్ డయాస్ (7 లక్షలు), కర్ష్ కొఠారి (5 లక్షలు), తుషార్ సింగ్ (3 లక్షలు), అథర్వ పూజారి (3 లక్షలు), ఓం కేష్కామత్ (3.20 లక్షలు), ధనిత్ రౌత్ (4.60 లక్షలు), నమన్ పుష్పక్ (3 లక్షలు), పార్థ్ అంకోలేకర్ (3 లక్షలు), అతిఫ్ హబీబ్ అత్తర్వాలా (6.25 లక్షలు), ద్రుమిల్ మత్కర్ (7.25 లక్షలు), మహ్మద్ అదీబ్ వాసియుల్ ఉస్మాని (2.70 లక్షలు)నార్త్ ముంబై పాంథర్స్ ఐకాన్ ప్లేయర్: పృథ్వీ షా (20 లక్షలు)ప్లేయర్స్: తనుశ్ కోటియన్ (10 లక్షలు), మోహిత్ అవస్తీ (10.50 లక్షలు), ఖిజార్ దఫేదార్ (5.50 లక్షలు), దివ్యాంష్ సక్సేనా (5.25 లక్షలు), అభిజ్ఞాన్ కుందు (5 లక్షలు), ఆయుష్ వర్తక్ (6.25 లక్షలు), సౌరభ్ సింగ్ (3 లక్షలు), హర్షల్ జాదవ్ (5 లక్షలు), ప్రిన్స్ దేవాంగ్ షైక్ (2 లక్షలు), షాలిక్ జౌక్ల్ (2 లక్షలు), అలీమ్ (3.40 లక్షలు), ముజామిల్ కద్రి (2 లక్షలు)SoBo ముంబై ఫాల్కన్స్ ఐకాన్ ప్లేయర్: శ్రేయాస్ అయ్యర్ (20 లక్షలు) ప్లేయర్స్: అంగ్క్రిష్ రఘువంశీ (14 లక్షలు), వినాయక్ భోయిర్ (5.75 లక్షలు), సిద్ధార్థ్ రౌత్ (7 లక్షలు), హర్ష్ అఘవ్ (5.25 లక్షలు), కుష్ కరియా (3 లక్షలు), నిఖిల్ గిరి (3 లక్షలు), ప్రేమ్ దేవ్కర్ (3 లక్షలు), ఆకాశ్ పార్కర్ (11.25 లక్షలు), అమోల్ టార్పురే (3 లక్షలు), ఇషాన్ ముల్చందని (3.40 లక్షలు), మయూరేశ్ తండేల్ (2 లక్షలు)ARCS అంధేరీ ఐకాన్ ప్లేయర్: శివమ్ దూబే (20 లక్షలు) ప్లేయర్లు: ప్రసాద్ పవార్ (13 లక్షలు), ముషీర్ ఖాన్ (15 లక్షలు), హిమాన్షు సింగ్ (5.50 లక్షలు), అఖిల్ హెర్వాద్కర్ (6.50 లక్షలు), సిద్దిద్ తివారీ (3 లక్షలు), ప్రవార్జా (3 లక్షలు), రజారీ 3 లక్షలు (3 లక్షలు), సాక్షం ఝా (3.60 లక్షలు), ప్రసూన్ సింగ్ (3 లక్షలు), ఐశ్వరీ సర్వే (2 లక్షలు), అజయ్ మిశ్రా (2 లక్షలు), బద్రే ఆలం (2.50 లక్షలు), మొయిన్ ఖాన్ (2 లక్షలు), మోనిల్ సోనీ (2.20 లక్షలు)ఈగిల్ థానే స్ట్రైకర్స్ ఐకాన్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్ (20 లక్షలు) ప్లేయర్లు: శశాంక్ అత్తార్డే (6.50 లక్షలు), సాయిరాజ్ పాటిల్ (15 లక్షలు), అథర్వ అంకోలేకర్ (16.25 లక్షలు), హర్ష్ తన్నా (16.25 లక్షలు), హర్ష్ తన్నా (7.7 లక్షలు), రవీంద్ర కుమార్ యాదవ్ (3.80 లక్షలు), ఆర్యన్ చౌహాన్ (3 లక్షలు), హర్ష్ సలుంఖే (3 లక్షలు), నూతన్ గోయెల్ (3.20 లక్షలు), ఆర్యరాజ్ నికమ్ (2.10 లక్షలు), అమర్త్య రాజే (2 లక్షలు), కౌశిక్ చిఖాలికర్ (2 లక్షలు)ఆకాశ్ టైగర్స్ ముంబయి సబర్బ్స్ ఐకాన్ ప్లేయర్: సర్ఫరాజ్ ఖాన్ (20 లక్షలు)ప్లేయర్లు: హార్దిక్ తామోర్ (8.50 లక్షలు), జే బిస్తా (12 లక్షలు), షమ్స్ ములానీ (14 లక్షలు), సిల్వెస్టర్ డిసౌజా (5 లక్షలు), అయాజ్ అహ్మద్ అఫ్జల్ అహ్మద్ ఖ్ (5.25 లక్షలు), సిద్ధార్థ్ అక్రే (4.60 లక్షలు), అర్జున్ డాని (4.20 లక్షలు), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (3 లక్షలు), జైద్ పాటంకర్ (3.60 లక్షలు), కరణ్ షా (2 లక్షలు), కృతిక్ శంకరప్ప హనగవాడి (2 లక్షలు)ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ ఐకాన్ ప్లేయర్: తుషార్ దేశ్‌పాండే (20 లక్షలు)ప్లేయర్లు: సిద్దేశ్ లాడ్ (10.25 లక్షలు), సచిన్ యాదవ్ (7 లక్షలు), ఆదిత్య ధుమాల్ (7.25 లక్షలు), ఖాన్ అవైస్ నౌషాద్ (4.20 లక్షలు), సాహిల్ జాదవ్ (3 లక్షలు), నమన్ ఝవార్ (3 లక్షలు), మాక్స్వెల్ స్వామినాథన్ (4.60 లక్షలు), వరుణ్ రావ్ (3 లక్షలు), రోహన్ ఘాగ్ (3 లక్షలు), అజయ్ సింగ్ జానూ (2.20 లక్షలు), చిన్మయ్ సుతార్ (5 లక్షలు), ఇర్ఫాన్ ఉమెయిర్ (9.25 లక్షలు), పరాగ్ ఖానాపుర్కార్ (6 లక్షలు) -
సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. అతడితో పోలికే వద్దు!
ఐపీఎల్-2025 (IPL 2025)లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)తో పాటు వెలుగులోకి వచ్చిన మరో యువ సంచలనం ఆయుశ్ మాత్రే (Ayush Mhatre). వైభవ్ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగితే.. ఆయుశ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నారు.అయితే, ఈ ఇద్దరూ ఆయా జట్ల కెప్టెన్లు గాయం కారణంగా దూరం కావడంతో తుదిజట్టులోకి రావడం సహా ఇద్దరూ ఓపెనర్లే కావడం విశేషం. వైభవ్ రాజస్తాన్ సారథి సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేస్తే.. ఆయుశ్ చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు బదులు బ్యాట్ ఝులిపిస్తున్నాడు.ఇద్దరూ ఇ ద్దరే..ఇక వైభవ్ ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా అద్భుత శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. భారత్ తరఫున ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే సైతం వైభవ్ మాదిరే అరంగేట్ర మ్యాచ్‌లో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ వంటి పటిష్ట జట్టుపై 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో మాత్రం ఆయుశ్ దుమ్ములేపాడు.ఆర్సీబీ విధించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆయుశ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ 17 ఏళ్ల టీనేజర్.ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై ఆర్సీబీ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఆయుశ్ ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేశాడని అతడి తండ్రి యోగేశ్ మాత్రే తెలిపాడు. అదే విధంగా ఆయుశ్‌ను వైభవ్‌తో పోల్చుకోవద్దని తాను సలహా ఇచ్చినట్లు వెల్లడించాడు.సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. అతడితో పోలికే వద్దు!ఈ మేరకు మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘వైభవ్.. నువ్వూ వేర్వేరు రకమైన బ్యాటర్లు అని ఆయుశ్‌కు చెప్పాను. ఎవరైనా నిన్ను వైభవ్‌తో పోలిస్తే పట్టించుకోవద్దనన్నాను.అంతేకాదు వైభవ్‌ను అనుకరించకూడదని కూడా చెప్పాను. అతడిలా సెంచరీ చేయాలనే తొందరపాటు కూడా వద్దన్నాను. ఎందుకంటే ఆయుశ్ కూడా ఇంకా చిన్నవాడే. ఇప్పుడే తనపై పోలికలతో భారం పడి.. వాడు ఒత్తిడికి లోనుకావడం నాకు ఇష్టం లేదు. తను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.ధోని చెప్పిందిదేఇక ఆర్సీబీపై ఆయుశ్ ఇన్నింగ్స్ తర్వాత దిగ్గజ క్రికెటర్ ధోని. ‘బాగా ఆడావు చాంపియన్’ అని ప్రశంసించారు. నిజానికి జట్టును గెలిపించలేకపోయానని ఆయుశ్ బాధపడ్డాడు. అయితే, ధోని వచ్చి వెన్నుతట్టిన తర్వాత వాడు ఎంతగానో సంబర పడిపోయాడు.‘బాగా బ్యాటింగ్ చేశావు.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఆడాలి’ అని ధోని చెప్పారంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ధోని చెప్పినవి రెండు మాటలే అయినా ఆయన ప్రభావం మాత్రం ఎంతగానో ఉంటుంది. ఆయుశ్‌కు ఇష్టమైన, తను ఆరాధించే క్రికెటర్ నుంచి మెచ్చుకోలు మర్చిపోలేనిది’’ అని ఆయుశ్ తండ్రి యోగేశ్ మాత్రే చెప్పుకొచ్చాడు.చదవండి: కెప్టెన్‌గానే కాదు.. వైస్ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్!.. రేసులో మూడు పేర్లు.. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
ఐపీఎల్-2025లో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే దుమ్ములేపుతున్నారు. 14 ఏళ్ల సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరపున సంచలనాలు సృష్టిస్తుండగా.. ఆయుష్ మాత్రే సీఎస్కే తరపున అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ రికార్డు సెంచరీతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో జట్టులోకి వచ్చిన మాత్రే తన మెరుపు ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు యువ క్రికెటర్లు తిరిగి భారత అండర్-19 జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో భారత జూనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనున్నట్లు సమాచారం. ఈ ఇంగ్లండ్ టూర్‌కు సూర్యవంశీ, మాత్రే వెళ్లనున్నారు. సూర్యవంశీ గత ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఈ బిహారీ క్రికెటర్ జూనియర్ జాతీయ జట్టు తరపున రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. గతేడాది అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత యువ జట్టుకు తొలి టూర్ కావడం గమనార్హం. అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. కాగా ఇదే జూన్‌లో భారత సీనియర్ జట్టు కూడా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. -
MI VS CSK: సూర్యవంశీ తరహాలో ఇరగదీసిన ఆయుశ్ మాత్రే.. అరంగేట్రంతో రికార్డు
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆయుశ్ మాత్రే సీఎస్కే తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. మాత్రే ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మాత్రే 17 ఏళ్ల 278 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. మాత్రేకు ముందు ఈ రికార్డు అభినవ్ ముకుంద్ పేరిట ఉండేది. ముకుంద్ 18 ఏళ్ల 139 రోజుల వయసులో సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు.ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులైన ఆటగాళ్ళు17y 278d - ఆయుశ్ మాత్రే vs MI, వాంఖడే, 2025*18y 139d - అభినవ్ ముకుంద్ vs RR, చెన్నై, 200819y 123d - అంకిత్ రాజ్‌పూత్ vs MI, చెన్నై, 201319y 148d - మతీష పతిరన vs GT, వాంఖడే, 202220y 79d - నూర్ అహ్మద్ vs MI, చెన్నై, 2025మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే 16 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి రచిన్ రవీంద్ర (5) ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్‌లోనే ఇరగదీశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. #RRvLSG: 14-year-old Vaibhav Suryavanshi's first three balls vs LSG on IPL debut: 𝐒𝐈𝐗, 1 RUN, 𝐒𝐈𝐗,#MIvCSK: 17-year-old Ayush Mhatre's first four balls vs MI on IPL debut: 1 RUN, 𝗙𝗢𝗨𝗥, 𝐒𝐈𝐗, 𝐒𝐈𝐗,WHAT A WAY TO ANNOUNCE YOUR ARRIVAL! | 📸: JioStar pic.twitter.com/WRVTwqEt2f— CricTracker (@Cricketracker) April 20, 20256.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్‌కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) ఎలా రెచ్చిపోయాడో, ఈ మ్యాచ్‌లో ఆయుశ్ మాత్రే కూడా అలాగే ఇరగదీశాడు. సూర్యవంశీ తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. -
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గైక్వాడ్ గైర్హాజరీలో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్ మొత్తంలో ధోనినే సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.సీఎస్కే యాజమాన్యం తాజాగా రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా (ముంబై), ఉర్విల్ పటేల్ (గుజరాత్), సల్మాన్ నిజర్ (కేరళ) పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రేకే ఓటు వేసింది. మాత్రేను సీఎస్కే 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. మాత్రే ఈ సీజన్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది సీఎస్కే మాత్రేను ట్రయల్స్‌కు కూడా పిలిపించుకుంది.మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్కే మేనేజ్మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ కోసం సీఎస్కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 20న సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి రావచ్చు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్‌లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్‌లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు గడించాడు. మాత్రే 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్‌గా ముద్ర వేసుకున్నాడు. -
IPL 2025: సీఎస్కే జట్టులో మార్పు..? ముంబై బ్యాటర్‌కు పిలుపు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో బలహీనంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్ రుతురాజ్, ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రమే రాణించారు. మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి అవకాశం వచ్చిన మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. గత సీజన్లో మెరుపులు మెరిపించిన శివమ్ దూబే ఈ సీజన్లో స్థాయికి తగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మూడో మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న విజయ్ శంకర్ కూడా ఫెయిలయ్యాడు. జడేజా, ధోని పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా సీఎస్కే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం తమ బ్యాటింగ్ విభాగాన్ని బలపరచుకునే యోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబై యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రేను ట్రయల్స్‌కు పిలిచింది. దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న మాత్రేను సీఎస్కే గత సీజన్లో కూడా ట్రయల్స్‌కు పిలిచింది. అతని పెర్ఫార్మెన్స్తో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్లో ఎందుకో అతన్ని ఎంపిక చేసుకోలేదు.మాత్రే గతేడాది జరిగిన U19 ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించాడు. 44 సగటున, 135.38 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు చేశాడు. కుడిచేతి వాటం స్టైలిష్ బ్యాటర్ అయిన మాత్రే.. గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కూడా సత్తా చాటాడు. 65.43 సగటున, 135.50 స్ట్రైక్ రేట్‌తో 458 పరుగులు చేశాడు.మాత్రేను ట్రయల్స్‌కు పిలిచిన విషయాన్ని అంగీకరించిన సీఎస్కే యాజమాన్యం అవసరమైతేనే (ఎవరైనా గాయపడితే) అతన్ని జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికైతే కొత్తగా ఎవరినీ జట్టులో చేర్చుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి, ఆతర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన సీఎస్కే తమ నాలుగో మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ను సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం (3:30) ఆడుతుంది.బెంచ్ కూడా బలహీనమేఈ సీజన్లో సీఎస్కే జట్టు ఎంపిక అస్సలు బాగోలేదు. ఆ జట్టు బెంచ్ కూడా చాలా బలహీనంగా ఉంది. వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లను తప్పిస్తే ఆ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లు కూడా లేరు. ఈ సీజన్లో సీఎస్కే ఎంపిక చేసుకున్న విదేశీ ఆటగాళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. బౌలర్లలో నూర్ అహ్మద్ ఒక్కడే రాణిస్తున్నాడు. పతిరణ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్ సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్ తేలిపోయారు. బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర ఒక్కడే రాణిస్తున్నాడు. డెవాన్ కాన్వేను తుది జట్టులోకి తెద్దామనుకుంటే నలుగురు ఆటగాళ్ల నియమం అడ్డొస్తుంది.సీఎస్కే పూర్తి జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, షేక్ రషీద్, శ్రేయస్ గోపాల్, డెవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి -
చరిత్ర సృష్టించిన ముంబై యువ సంచలనం.. యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు బద్దలు
ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ భారీ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత చిన్న వయసులో 150 ప్లస్ చేసిన ఆటగాళ్లుఆయుశ్ మాత్రే 17 ఏళ్ల 168 రోజులుయశస్వి జైస్వాల్ 17 ఏళ్ల 291 రోజులురాబిన్ ఉతప్ప 19 ఏళ్ల 63 రోజులుటామ్ ప్రెస్ట్ 19 ఏళ్ల 136 రోజులుమాత్రే ఇన్నింగ్స్ విషయానికొస్తే.. నాగాలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ (28 బంతుల్లో 73 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడటంతో ముంబై భారీ స్కోర్ చేసింది. శార్దూల్ సిక్సర్ల సునామీ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 42 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. బ్యాట్‌తో మెరిసిన శార్దూల్ ఠాకూర్ (4-1-12-2) బంతితోనూ సత్తా చాటాడు. రాయ్స్టన్ డయాస్ రెండు, సుయాన్ష్ షేడ్గే ఓ వికెట్ దక్కించుకున్నారు. నాగాలాండ్ ఇన్నింగ్స్‌లో డేగా నిశ్చల్ (5), హేమ్ చెత్రి (2), యుగంధర్ సింగ్ (0), కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ (0), చేతన్ బిస్త్ (0) ఔట్ కాగా.. రుపేరో (22), జే సుచిత్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవాలంటే 36 ఓవర్లలో 362 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు, టీమిండియా స్టార్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ముంబై మేనేజ్మెంట్ పై ముగ్గురికి విశ్రాంతినిచ్చింది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.