-
అయ్యో పాపం అబ్మాయి!
‘ప్రేమా మజాకా!’ అని మరోసారి అనిపించే సంఘటన ఇది. పంజాబ్‌కు చెందిన ఆంగ్రేజ్ సింగ్, పరమ్‌జిత్ కౌర్ ప్రేమికులు. కౌర్ ‘బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ నిర్వహించే మల్టీ–పర్పస్ హెల్త్ వర్కర్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంది. అయితే తన ప్రియురాలు కష్టపడడాన్ని ఆంగ్రేజ్ సింగ్ తట్టుకోలేకపోయాడు. ‘నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను. ఆ కష్టమేదో నేను పడతాను’ అంటూ రంగంలోకి దిగాడు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు కష్టపడ్డాడో లేదో తెలియదుగానీ మీసాలు, గెడ్డాలు గీయించి, పెదాలకు లిపిస్టిక్ పూసి, సల్వర్ కమిజ్ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే కనబడడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే బయోమెట్రిక్ దగ్గర ఫింగర్‌ప్రింట్స్ ఫెయిల్ కావడంతో ఆంగ్రేజ్ సింగ్ పట్టుబడ్డాడు. దీంతో సోషల్ మీడియాలో ఆంగ్రేజ్సింగ్పై మీమ్సే మీమ్స్. అయ్యో పాపం అబ్మాయి! -
ఉద్యోగ సమాచారం
విశాఖ పోర్ట ట్రస్ట్‌లో ఖాళీలు విశాఖపట్నం పోర్ట ట్రస్ట్.. మెరైన్ ఇంజనీర్ (ఖాళీలు-7), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.vizagport.comచూడొచ్చు. వెస్ట్ బంగా హెల్త్ రిక్రూట్మెంట్ బోర్ డలో 3135 పోస్టులు వెస్ట్ బంగా హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ.. కాంట్రాక్టు ప్రాతిపదికన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 3135. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.wbhrb.in చూడొచ్చు. రైట్స్‌లో ఇంజనీర్లు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైట్స్ లిమిటెడ్.. కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ప్రాజెక్టుల్లో రెసిడెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ రెసిడెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 56. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు www.rites.com చూడొచ్చు. కోల్‌కతా పోర్ట ట్రస్ట్‌లో వివిధ ఉద్యోగాలు కోల్‌కతా పోర్ట ట్రస్ట్.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 40. దరఖాస్తుకు చివరి తేది జనవరి 5. వివరాలకు www.kolkataporttrust.gov.in చూడొచ్చు. ఎన్ఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీలు నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్).. హ్యూమన్ రిసోర్స, మార్కెటింగ్, ల్యాబ్ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 25. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 19. వివరాలకు www.nationalfertilizers.comచూడొచ్చు. బాబా ఫరీద్ హెల్త్ సెన్సైస్ వర్సిటీలో... పంజాబ్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. ప్రొఫెసర్ (ఖాళీలు-2), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-4), అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఖాళీలు-6), రేడియో థెరపీ టెక్నీషియన్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 10. వివరాలకు www.bfuhs.ac.inచూడొచ్చు. ఐసీఎస్ఐలో వివిధ పోస్టులు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ).. వివిధ విభాగాల్లో డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్, రీసెర్చ అసోసియేట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 10. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 4. వివరాలకు www.icsi.edu చూడొచ్చు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
గెలుపెవరిదో వారి పాలనే చెబుతుంది!
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
వన సంపదకు పెద్ద ఆపద!
ఇజ్రాయెల్‌పై కొత్త ఒత్తిళ్లు
18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు
ఈ పాపం ఎవరిది?
ప్రజాభవన్‌లో బాంబు కలకలం
తప్పక చదవండి
Advertisement