Babu Sarkar
-
అర్జునా... ఫల్గుణా... పార్థా... కిరీటీ!
పిడుగులు పడే సమయంలో మన పూర్వీకులు అర్జునుడి పేరును తలుచుకునేవారు. ఆయనకున్న పది పేర్లనూ గటగటా చదివేస్తే ఆ పిడుగుల్ని అర్జునుడు ఆకాశంలోనే బంధిస్తాడని ఓ నమ్మకం. ప్రకృతి కురిపించే పిడుగుల భయం పోగొట్టడానికి ప్రజలకు ఈ అర్జున నామస్మరణ ఉపకరించింది. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే పిడుగులు కురిపిస్తే... ఎవరి నామ స్మరణ చేయాలి? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంటలోని నరుడే అర్జునుడు. కనుక ఇప్పుడు కూడా నరుడే మనకు దిక్కు! పిడుగులు కురిపించే ప్రభుత్వాలను ఎదిరించే శక్తి ప్రజలకే ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా జనం మీద వరసగా పిడుగుల్ని కురిపిస్తున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది. రెండింటి మధ్య కొంచెం తేడా ఉన్నది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్ తరహాను ఆశ్రయిస్తుంటే, ఏపీలో ఉన్న బాబు సర్కార్ కార్పెట్ బాంబింగ్ నమూనాను ఎంచుకున్నది. నిన్నటి తాజా ఉదంతాలు ఈ తరహా ఆపరేషన్‌కు గట్టి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చేమో! జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మన తెలుగు నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేయడం టార్గెటెడ్ సర్జికల్ స్ట్రయిక్గానే చాలామంది భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో ఓ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.కార్పెట్ బాంబింగ్పాతికేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన ‘విజన్–2020’కి కొనసాగింపే ‘స్వర్ణాంధ్ర–2047’. అంతేకాకుండా గతేడాది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘వికసిత భారత్– 2047’ పత్రానికి అనుబంధ పత్రంగా ఇది తయారైంది. ప్రపంచ బ్యాంకు ప్రవచించే అభివృద్ధి నమూనాకు నకళ్లు కావడమే ఈ పత్రాలన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం. ఈ నమూనా ఫలితంగా సాధించిన ఆర్థికాభివృద్ధి సమాజంలో అసమానతలను కనీవినీ ఎరుగనంత స్థాయిలో పెంచిందనేది ఒక వాస్తవం! ఆర్థికవృద్ధి లెక్కల్లో కనిపించింది. బహుళ అంతస్థుల భవంతుల్లో కనిపించింది. పెరుగుతున్న విమానయానాల్లో కనిపించింది. అదే సంద ర్భంలో చితికిపోతున్న బతుకుల్లో కూడా కనిపించింది. వేలాది మంది రైతులూ, చేతివృత్తిదారుల బలవన్మరణాలకు సాక్షి సంత కాలు పెట్టిన ఉరితాళ్లలో కూడా కనిపించింది.భారతీయ వ్యవసాయ రంగాన్ని, చేతివృత్తులను దారుణంగా దెబ్బతీసిన బ్రిటిష్ హయాంతో పోల్చినా కూడా ‘విజన్–2020’ తొలి ఐదారు సంవత్సరాల్లో ఈ రంగాల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. మెజారిటీ ప్రజల ఆదాయా లను పెంచే చర్యలు తీసుకోకుండా వస్తు, సేవల లభ్యతను పెంచడాన్ని ప్రోత్సహించే ఆర్ఢిక విధానాలను అనుసరించడమే ఈ నియో లిబరల్ – ప్రపంచ బ్యాంకు ఆర్థిక మోడల్. దీన్నే ‘సప్లై సైడ్ ఆఫ్ ఎకనామిక్స్’ అంటారు. దీని కారణంగా గడచిన మూడు దశాబ్దాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగి పోయాయి. ఈ రకమైన ఆర్థిక ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వ యిజర్ అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. నిఫ్టీలో లిస్టయ్యే టాప్ 500 కంపెనీల ఆదాయం గత పదిహేనేళ్లుగా పెరుగుతూనే ఉన్నది. కానీ ఆ సంస్థలు సిబ్బందిపైన చేసే ఖర్చు మాత్రం తగ్గిపోతున్నది. ఈ ధోరణి వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి పోతుందనీ, ఫలితంగా పారిశ్రామికవేత్తలు కూడా నష్టపోవలసి వస్తుందనీ ఆయన చెప్పారు. ఈ ఆర్థిక మోడల్ పరిధిలోనే కొద్దిపాటి సర్దుబాటు చేసుకోవాలని పెట్టుబడిదారులకు ఆయన హితవు చెబుతున్నారు. ఇది ఎంతమంది చెవికెక్కుతుందో చూడాలి. జగన్మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో డీబీటీ ద్వారా జనం చేతిలో డబ్బు పెట్టడం సత్ఫలి తాలనిచ్చింది. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో దేశమంతటా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోగా ఏపీలో పెరుగుదల నమోదైంది. ఈ రకంగా డిమాండ్ సైడ్‌ను సిద్ధం చేయకుండా ప్రపంచ బ్యాంకు నమూనాను గుడ్డిగా అనుసరిస్తే కొద్దిమంది సంపద పోగేసుకుంటారే తప్ప ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తథ్యం.చంద్రబాబు కొత్తగా ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర–2047’ పత్రంలో కూడా విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమం ఒకటి కూడా లేదు. వట్టి పడికట్టు పదజాలం మాత్రమే ఉన్నది. ‘సూపర్ సిక్స్’ మేనిఫెస్టో కంటే మిన్నగా అరచేతిలో వైకుంఠాన్ని చంద్రబాబు సర్కార్ ఈ పత్రం ద్వారా చూపెట్టింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రాసుకున్నారు. ఇది సువిశాలమైన బ్రెజిల్ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. రెండు మెగా పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికే జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభించారని మాత్రం చెప్పలేదు. ఏఐ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామనే ఊకదంపుడు సరేసరి! రైతుల ఆదాయాలు పెంచుతూ, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా చెప్పారు. పనిలో పనిగా అప్పటికి నూరు శాతం అక్షరాస్యతను సాధిస్తామని కూడా చెప్పారు. ఈ నాలుగైదేళ్లలో నూరు శాతం అక్షరాస్యతను సాధించి, 2047 నాటికి నూరు శాతం డిజిటల్ లిటరసీని సాధిస్తే తప్ప ఈ డాక్యు మెంట్లోని గొప్పలు సాధ్యం కావు.పేదవర్గాల ప్రజలు నూటికి నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించగల విద్యావిధానానికి తాను వ్యతిరేకం కనుకనే అక్షరాస్యత రంగంలో తాబేలు నడకను ఎంచుకుని, మిగతా అంశాల్లో ఆకాశానికి నిచ్చెనలు వేశారనుకోవాలి. దేశంలో అత్యధిక ప్రజానీకం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లోని వారిలో కొనుగోలు శక్తి పెరగకుండా వీరు చెప్పుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వం అమలుచేసిన ‘రైతు భరోసా’ను ఎగరగొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. కనీస మద్దతు ధర గురించి ఊసే లేదు. ఇవేమీ లేకుండా రైతుల ఆదాయాలు ఏ రకంగా పెరగగలవో వివరించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. టెక్నా లజీని విరివిగా వినియోగించడం వలన ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ వైరుధ్ధ్యాన్ని ఎలా అధిగమించగలమన్న వివరణ జోలికి పోలేదు.‘నేను ’95 మోడల్ చంద్రబాబున’ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ మోడల్! పారిశ్రామికవేత్తలకూ, పెట్టుబడిదారులకూ వనరులన్నీ కట్టబెట్టాలి. ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. సామాన్య ప్రజలకు మాత్రం ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. సబ్సిడీలు ఇవ్వకూడదు. ఇది ప్రపంచ బ్యాంకు విధానం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) అనే మూడు సూత్రాలు దీని వేద మంత్రాలు. ప్రజల్లో చైతన్యం పెరుగు తున్నకొద్దీ సామాజిక పెన్షన్ల లాంటి ఒకటి రెండు విషయాల్లో కొద్దిగా మినహాయింపులు ఇచ్చారు. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఏ ఒక్కదాన్నీ అమలుచేయకపోవడానికి కారణం ఆర్థిక పరిమితులు కాదు. ఆయన అవలంబించే ఆర్థిక సిద్ధాంతం అసలు కారణం. తెచ్చే అప్పులు అమరావతి కోసం, అంత ర్జాతీయ కాంట్రాక్టర్ల కోసం, అందులో కమిషన్ల కోసం ఖర్చు పెడతారే తప్ప సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఖర్చుపెట్టరు. ‘స్వర్ణాంధ్ర–2047’ పేద ప్రజలపై జరగబోయే కార్పెట్ బాంబింగ్ లాంటిది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రారంభమైంది. ఇకముందు అన్ని రంగాలకూ విస్తరించ నున్నది.రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్!ఏడాది కింద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. హామీ ఇచ్చిన రైతు రుణమాఫీలో మూడింట రెండొంతుల మేరకు పూర్తి చేయగలిగారు. ఇంకా ఒక వంతు మిగిలే ఉన్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇక మిగిలిన గ్యారెంటీలన్నీ గ్యారెంటీగా అటకెక్కినట్టే! పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లయితేనేమీ, కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్లయితేనేమి 50 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు. అయినప్పటికీ ఏడాది పూర్తయ్యేసరికి కేసీఆర్ ప్రభుత్వమే మేలన్న అభిప్రాయం జనంలో ఏర్పడుతున్నదనే వార్తలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలుండవచ్చు. ప్రధాన కారణాల్లో ఒకటి ఎంపిక చేసుకున్న టార్గెట్లపై చేస్తున్న సర్జికల్ స్ట్రయిక్స్. ఇది కాకతాళీయమో, వ్యూహాత్మకమో తెలియదు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతున్నది.నిన్నటి అల్లు అర్జున్ అరెస్ట్ సంగతే చూద్దాం. సంధ్య టాకీస్ దగ్గర జరిగిన దుర్ఘటనపై బాధపడని వారుండరు. ఖండించని వారుండరు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నదో నిర్ధారణకు రాకుండానే ఎకాయెకిన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, అదీ బెయిల్ దొరక్కుండా వారాంతంలో చేయడం, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక్క రాత్రయినా సరే జైల్లో ఉంచాలన్న పంతం ఈ మొత్తం వ్యవహారంలో కనిపించింది. అనేక సందర్భాల్లో సెలబ్రిటీలు అనేవాళ్లు తప్పుచేసి దొరికి పోవడం జరిగింది. అటువంటి వాళ్లు కూడా జైలుకెళ్లిన సంద ర్భాలు తక్కువ. అల్లు అర్జున్ పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నద నేందుకు తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. ఉన్నా నిర్ధారణ కాలేదు. ఎందుకని అంతగా టార్గెట్ చేశారో తెలియదు. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్‌కు సానుభూతి మాత్రం పెరిగింది.చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సిందే! సెలబ్రిటీలు అయినంతమాత్రాన నేరం చేసిన వారికి మినహాయింపులు ఉండకూడదు. అట్లాగే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారు టార్గెట్ కాకూడదు. చట్టం తన పనిని తాను ఎటువంటి వివక్ష లేకుండా చేసుకొనిపోవాలి. అసలెందుకు తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ టార్గెట్ కావలసి వచ్చింది. అందుకు బయ టకు కనబడే కారణాలైతే ఏవీ కనిపించడం లేదు. ఉంటేగింటే ఏపీ ప్రభుత్వానికి ఓ ఆవగింజంత కారణం ఉండాలి. ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడైన రవిచంద్ర కిశోర్‌రెడ్డికి మద్దతుగా అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ప్రచారం చేయలేదు గానీ, ఆ సమయంలో వెళ్లడం, ఆ మిత్రుడు వైసీపీ అభ్యర్థి కావడం వల్ల కూటమి పార్టీలకు కంటగింపు కలిగించి ఉండ వచ్చు.ఆ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వీళ్లు, ఈ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వాళ్లు పనిచేసేంత సాపత్యం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నదా? లేకపోయినా అటువంటి ఊహాగానాలు చేయడానికి అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం అవకాశం కల్పించింది. అక్రమ నిర్మాణాలు కూల్చే పేరుతో ‘హైడ్రా’ను రంగంలోకి దించడం ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారింది. ఆ కూల్చివేతల్లో కూడా అక్కినేని నాగార్జున వంటి కొందరిని టార్గెట్ చేయడం, మిగతా వాళ్లను వది లేయడం ప్రశ్నార్థకంగా మారింది. ‘హైడ్రా’ భయంతో హైద రాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నగదు చలామణీ మందగించడం వలన ఇతర వ్యాపార రంగాలపై, చుట్టుపక్కల జిల్లాలపై దాని ప్రభావం పడింది. అవసరాలకు భూము లమ్ముకుందామనుకున్న రైతులు కొనే నాధుడు కనిపించక అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాల తాట తీయవలసిందే! ఇకముందు జరగకుండా గట్టి హెచ్చరికలు పంపవలసిందే! కానీ, ఈ మంచి కార్యక్రమాన్ని దుందుడుకుగా ప్రారంభించడం, కొందరినే టార్గెట్ చేయడం వ్యవస్థలో దుష్ఫలితాలకూ, ప్రభుత్వంపై నెగెటివ్ ఇమేజ్‌కూ కారణమైంది. ఇటు వంటి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఏడాది కాలంలో ఒక డజన్ దాకా ఉదాహరించవచ్చు. ఈ ధోరణి వదులుకొని, చేసిన పనులు చెప్పుకునే పాజిటివ్ మార్గంలో వెళ్తేనే ప్రభుత్వానికీ, ప్రజలకూ క్షేమకరం!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'
సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. పక్కాగా లీజున్నా దౌర్జన్యం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్ యార్డు వద్ద సర్వే నంబర్ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్డీఏ కమిషనర్‌కు వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఫోన్ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు. నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణంగుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్‌ప్రసాద్.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వీళ్లకు పద్మాలివ్వండి
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు..హోంశాఖకు చేరిన జాబితా - భారతరత్నకు ఎన్టీఆర్‌ను ప్రతిపాదించని బాబు సర్కార్ సాక్షి, న్యూఢిల్లీ: ఈనాడు పత్రికాధిపతి సీహెచ్.రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే భారతరత్న పురస్కారం విషయంలో ఎన్టీఆర్‌కు మళ్లీ మొండి చేయి చూపింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు అవకాశం ఉన్నా ఆ అవార్డుకు ఆయన పేరును కేంద్రానికి సిఫార్సు చేయలేదు. రాష్ట్రం నుంచి 30 మంది పేర్లతో పద్మ అవార్డుల జాబితా వచ్చిందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. పద్మ విభూషణ్ అవార్డుకు రామోజీరావుతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్.నాగేశ్వర రెడ్డి పేరును కూడా రాష్ర్ట ప్రభుత్వం సిఫార్సు చేసిందని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పద్మ విభూషణ్‌కు ఇద్దరి పేర్లను, పద్మ భూషణ్‌కు ఐదుగురి పేర్లను, పద్మ శ్రీ అవార్డులకు 23 మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర హోంశాఖ వర్గాల వివరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు సిఫార్సు చేసిన పేర్లు ఈ విధంగా ఉన్నాయి. పద్మవిభూషణ్‌కు..: సీ.హెచ్. రామోజీరావు (జర్నలిస్టు), డాక్టర్ నాగేశ్వర రెడ్డి (గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్). పద్మ భూషణ్‌కు: డాక్టర్ అనంద శంకర్ జయంత్ (కూచిపూడి నృత్యం), డాక్టర్ బాల వి.బాలచందర్ (విద్య), చాగంటి కోటేశ్వరరావు( సాహిత్య, సంస్కృతి), డాక్టర్ ఎం.గోపిచంద్ (సామాజిక సేవ), ఎం. మురళీ మోహన్ (ఎంపీ, ఆర్ట్ అండ్ సామాజిక సేవ). పద్మ శ్రీకి: డి.హారిక (చెస్), కె. శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), ఎం. వెంకటేశ్వర యాజులు (సాహిత్య-విద్య), ముదిగొండ శివప్రసాద్ (సాహిత్యం), ఎ. ప్రకాశరావు (సాహిత్యం), అంబిక (కూచిపూడి నృత్యం), వందేమాతరం శ్రీనివాస్ (గాయకుడు), జి. రమణయ్య (చేనేత), పూజ కపూర్ (మ్యూజిక్), డాక్టర్ జయప్రద రామమూర్తి (ఫ్లూట్), జి.రాజేంద్రప్రసాద్ (సినిమా), కీర్తి శేషులు వేటూరి సుందరరామ్మూర్తి (రచయిత), పసుమర్తి రత్తయ్య శర్మ (కూచిపూడి నృత్యం), యార్లగడ్డ నాయుడమ్మ (వైద్యం), డాక్టర్ విశ్వరూపరెడ్డి (ఈఎన్టి సర్జన్), డాక్టర్ ముక్కామల అప్పర (ఎన్ఆర్ఐ-రేడియాలజీ), డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు (కార్డియాలజీ), డాక్టర్ టి. దశరథరామిరెడ్డి (ఆర్థోపెడిక్), డాక్టర్ సీ.హెచ్. మోహన్ వంశీ (అంకాలజీ), డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు (అంకాలజీ), డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలె (సి.టి. సర్జన్), అక్షయ క్షేత్రం (సామాజిక సేవ), వి. శ్రీదేవి (హార్టికల్చర్)ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. -
జగన్ హెచ్చరికలతో కదిలిన ప్రభుత్వం
33 రైతు కుటుంబాలకు పంపిణీచేసిన పరిహారం రీయింబర్స్ * తొమ్మిది నెలలుగా కలెక్టర్ ప్రతిపాదనలను పట్టించుకోని ప్రభుత్వం * ప్రతిపక్ష నేత హెచ్చరికతో దిగొచ్చిన బాబు సర్కార్ * మిగతా రైతు కుటుంబాలకు పరిహారం అందించేందుకు మార్గం సుగమం * ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే పరిహారం మంజూరు * రూ.5 లక్షలు పరిహారం ఇస్తామంటూ జారీ చేసిన జీవో-62ను బేఖాతరు * రైతు కుటుంబాలను మళ్లీ మోసం చేస్తున్న చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని, తమ ప్రభుత్వం రాగానే రూ.ఐదు లక్షలు చెల్లిస్తామని వైఎస్సార్సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. తొమ్మిది నెలలుగా తొక్కిపట్టిన ఫైలుకు మోక్షం కలిగిస్తూ... ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున 33 రైతు కుటుంబాలకు చెల్లించిన రూ.49.50 లక్షల పరిహారాన్ని రీయింబర్స్మెంట్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించి రూ.1.50 లక్షలే పరిహారం మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు సర్కారు మళ్లీ మోసం.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి వస్తూనే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి మానవీయ కోణంలో పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. బకాయిలు తీర్చడానికి రూ.50 వేలు, రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రూ.లక్షను కేటాయిస్తూ 2004 జూన్ ఒకటిన ఉత్తర్వులు (జీవో 421)ను జారీ చేశారు. శవపరీక్ష నివేదికలతో నిమిత్తం లేకుండా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారాన్ని అందించి ఆదుకున్నారు. పదేళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం రైతుల పరిస్థితి మరింత దిగజారింది. వరుస కరువుల వల్ల ఆర్థికంగా కుంగి కుదేలైపోయారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం అందించాల్సిన అవసరముందని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అప్పులు తీర్చడానికి రూ.1.50 లక్షల.. రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రూ.3.5 లక్షలు మొత్తం రూ.ఐదు లక్షల వంతున పరిహారం అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల వంతున పరిహారాన్ని మంజూరు చేస్తూ ఫిబ్రవరి 19న ఉత్తర్వులు (జీవో 62) జారీ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో వందలాది మంది రైతులు బలవన్మరణం చెందారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 83 మంది కర్షకులు ఆత్మార్పణం చేసుకున్నారు. కానీ వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ సభ్యులుగా ఉన్న కమిటీ అర్హులుగా తేల్చిన రైతు కుటుంబాలకు పరిహారం అందించడానికి కూడా నానా సాకులు చెప్తూ ఆలస్యం చేసింది. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 33 రైతు కుటుంబాలకు చెల్లించిన పరిహారం రీయింబర్స్మెంట్ చేస్తే మిగతా వారికి అందిస్తామని కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను తొమ్మిది నెలలుగా తొక్కిపట్టింది. జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్ర చేస్తోన్న విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. తక్షణమే పరిహారం మంజూరు చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున 33 రైతు కుటుంబాలకు రూ.49.50 లక్షలను పరిహారంగా మంజూరు చేస్తున్నట్లు బుధవారం జీవో-690 జారీ చేసింది. అయితే రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీవోనే బేఖాతరు చేస్తూ రూ.1.50 లక్షలు మాత్రమే మంజూరు చేయడంపై అధికారవర్గాలే మండిపడుతున్నాయి.