అచ్చం తన పిల్లల్లాగే సాకింది!
కుక్క కనపడితే.. కోతి కిచకిచమంటూ దాన్ని ఉడికిస్తుంది. కోతి కనపడితే కుక్క భౌ... మంటూ ఇంతెత్తున లేస్తుంది. ఈ రెండింటికీ వైరమే తప్ప, స్నేహం అన్నది పొరపాటున కూడా కనపడదు. అలాంటిది ఓ కొండముచ్చు.. కుక్క పిల్లను దగ్గరకు తీసుకుని, అచ్చం తన సొంత పిల్లలా సాకుతూ కనిపించింది.
చిన్నారి కుక్క పిల్లను ఒక చెయ్యి వేసి పట్టుకుంది. దాన్ని దగ్గరకు తీసుకుని ఎత్తుకుని ముద్దాడింది. తన పిల్లలను పట్టుకున్నట్లే ఎత్తుకుని, నలుగురూ అక్కడకు చేరగానే అక్కడి నుంచి కుక్కపిల్లతో సహా తుర్రుమంది. ఈ దృశ్యాలన్నింటినీ 'సాక్షి' తన కెమెరాలో బంధించింది.
ఫొటోలు: కంది భజరంగప్రసాద్, నల్లగొండ