Baby snake
-
పప్పుచారులో పాముపిల్ల
కుషాయిగూడ(హైదరాబాద్): ప్రతిరోజూ వేలాదిమంది ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించే ఓ ప్రసిద్ధ కంపెనీ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పాముపిల్ల బయటపడింది. ఈ ఘటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలిపోయారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్లో వండిన ఆహారపదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకు మధ్యాహ్న భోజనం నిమిత్తం ప్రతిరోజూ తరలిస్తుంటారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పుచారులో నుంచి ఓ పాముపిల్ల బయటపడింది. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడ్డారు. భోజనాల అనంతరం విషయం తెలుసుకుని ఉద్యోగులు భయకంపితులయ్యారు. కొంతమంది ఉద్యోగులు సంబంధిత క్యాంటీన్ సిబ్బందిపై మండిపడ్డారు. గతంలో కూడా ఈ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పలుమార్లు ఎలుకలు, బీడీలు, సిగరెట్లు వెలుగు చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ నిర్లక్ష్యంపై స్పందించి, బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. -
బండ కింద 21 పాము పిల్లలు
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని ఒక మామిడితోటలో కాపలాదారు గది వద్ద మంగళవారం 21 పాము పిల్లలు బయటపడ్డాయి. గ్రామ సబ్‌స్టేషన్ దగ్గరలోని మామిడితోట వద్ద కాపలాదారు కోసం నిర్మించిన గది దగ్గర ముందుగా ఒక పాము పిల్ల కనిపించగా తోటకాపలాదారు చింతల వెంకటేశం దానిని చంపేశాడు. గది బయట బండ సందు నుంచి పాముపిల్ల రావడం గమనించిన ఆయన, బంను తొలగించి చూడగా అక్కడ 21 పాము పిల్లలు బయటపడ్డాయి. అనంతరం వాటిని కూడా చంపేశాడు. చదవండి: ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! -
వామ్మో.. ఒకేచోట వంద పాము పిల్లలు
వేలూరు (తమిళనాడు) : గుడియాత్తంలోని ఓ ఇంటి సమీపంలో ఉన్న వంద విషపు పాము పిల్లలు, 80కి పైగా పాము గుడ్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా ఇందిరానగర్‌కు చెందిన జానకిరామన్ గురువారం ఉదయం తన ఇంటి వెనుక వైపునకు వెళ్లాడు. ఒకేచోట వందకు పైగా పాము పిల్లలు ఒకదానిపై ఒకటి పడుకుని ఉన్నాయి. పక్కనే దాదాపు 80 పాము గుడ్లు ఉన్నాయి. వాటిలో నుంచి ఒక్కో పాము పిల్ల బయటకు వస్తుండడాన్ని గమనించి కేకలు వేశాడు. స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆసక్తిగా చూశారు. గుడియాత్తం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఫారెస్ట్ అధికారి మేఘనాథన్, అసిస్టెంట్ అధికారి మూర్తి, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుమారు వంద పాము పిల్లలను, పాము గుడ్లను తీసుకెళ్లి అడవిలో వదిలి పెట్టారు. స్వాధీనం చేసుకున్న పాము పిల్లలు ఏ రకమైనవని తెలియడం లేదని, అయితే విషపూరితమైనవిగా భావిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఒకే పాము ఇన్ని గుడ్లు పెట్టి ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. -
మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల
ఫరిదాబాద్: మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు గతంలో చాలానే వెలుగు చూశాయి. అయితే తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో క్ష పాము పిల్ల (స్నేక్లెట్) రావడం కలకలం సృష్టించింది. హర్యానా ఫరిదాబాద్‌లోని రాజ్కేయా బాలికల సీనియర్ సెకండరీ పాఠశాలలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తాను తింటున్న భోజనంలో చచ్చిన పాముపిల్ల రావడంతో ఒక్కసారిగా హడలిపోయింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు...భోజనం తినడాన్ని ఆపివేశారు. అయితే అప్పటికే కొందరు విద్యార్థినులు భోజనాన్ని తినేశారు. ఈ విషయం తెలియడంతో పలువురు వాంతులు చేసుకున్నారు. భోజనంలో పాముపిల్ల రావడాన్ని గమనించిన స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు ... మిగతా విద్యార్థినులు ఆ ఆహారాన్ని తినకుండా ఆపివేశారు. సాధారణంగా తమకు పెట్టే భోజనం ముతక వాసన వచ్చేదని, అయితే పిల్లపాము రావడం దారుణమని విద్యార్థినిలు పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ బ్రజ్ బాలా వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు, మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఇస్కాన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే ఇదే ఆహారాన్ని సరఫరా చేసి ఇతర పాఠశాలలకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఓ కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. అలాగే ఆ ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.