మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల | Haryana: Baby snake found in govt school’s mid-day meal | Sakshi
Sakshi News home page

భోజనంలో పాము పిల్ల వచ్చింది..

Published Fri, May 12 2017 10:16 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Haryana: Baby snake found in govt school’s mid-day meal

ఫరిదాబాద్‌: మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు గతంలో చాలానే వెలుగు చూశాయి. అయితే తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో క్ష పాము పిల్ల (స్నేక్‌లెట్‌) రావడం కలకలం సృష్టించింది. హర్యానా ఫరిదాబాద్‌లోని రాజ్కేయా బాలికల సీనియర్ సెకండరీ పాఠశాలలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఓ విద్యార్థిని తాను తింటున్న భోజనంలో చచ్చిన పాముపిల్ల రావడంతో ఒక్కసారిగా హడలిపోయింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు...భోజనం తినడాన్ని ఆపివేశారు. అయితే అప్పటికే కొందరు విద్యార్థినులు భోజనాన్ని తినేశారు. ఈ విషయం తెలియడంతో పలువురు వాంతులు చేసుకున్నారు.

భోజనంలో పాముపిల్ల రావడాన్ని గమనించిన స్కూల్‌ ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు ... మిగతా విద్యార్థినులు ఆ ఆహారాన్ని తినకుండా ఆపివేశారు. సాధారణంగా తమకు పెట్టే భోజనం ముతక వాసన వచ్చేదని, అయితే పిల్లపాము రావడం దారుణమని విద్యార్థినిలు పేర్కొన్నారు.

స్కూల్‌ ప్రిన్సిపల్‌  బ్రజ్ బాలా వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు, మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఇస్కాన్‌ ఫౌండేషన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే  ఇదే ఆహారాన్ని సరఫరా చేసి ఇతర పాఠశాలలకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఓ కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. అలాగే ఆ ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement