mid-day meals
-
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలకలం
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థినులు అంటుండగా, ఉపాధ్యాయులు మాత్రం కాదని చెబుతున్నారు. విద్యార్థినులకు ఆదివారం చికెన్, సోమవారం ఉదయం కిచిడీ, మధ్యాహ్నం దోసకాయ, సాయంత్రం వంకాయ కూరలతో భోజనం వడ్డించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 29 మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో జూలూరుపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. మంగళవారం ఉదయం మరో 55 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఇప్పుడు విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ పరిస్థితికి ఫుడ్ పాయిజన్, ఇతర అనారోగ్య సమస్యలు కారణం కావొచ్చని చెప్పారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం శని, ఆదివారాలు సెలవులు రావడంతో కొందరు పిల్లలు ఇంటికి వెళ్లిరాగా, మరికొందరికి తల్లిదండ్రులు ఇళ్ల నుంచి భోజనం తీసుకొచ్చి వడ్డించారని చెబుతున్నారు. కాగా, పాఠశాలలోని వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ 46 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటంతో పాఠశాల యాజమాన్యం దినసరి కూలీలతో వంటలు చేయిస్తోంది. సరైన రీతిలో తయారు కాని భోజనం ఆరగించడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఐటీడీఏ డీడీ రమాదేవి మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 525 మంది విద్యార్థినులు ఉన్నారని, కొందరు జ్వరం, దగ్గు, జలుబు వల్ల బాధపడుతుండటంతో ఈ సమస్య ఎదురై ఉంటుందన్నారు. -
నాణ్యత నల్లపూసే!!
రాజాం: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకుల్లో నాణ్యత కనిపించడం లేదు. మొన్నటివరకూ పురుగులు పట్టిన, కుళ్లిన గుడ్లు వడ్డించగా.. ఇప్పుడు బియ్యంలోనూ నాణ్యత లోపిస్తోంది. ప్రతి నెల మిగులు బియ్యం, పురుగుల బియ్యం, ధాన్యం గింజల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అక్టోబర్‌కు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఇదే తరహా బియ్యాన్ని అందించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో వంట నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క మధ్యాహ్న భోజనంలో నాణ్యత నానాటికీ లోపిస్తుండటంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు అనాసక్తి ప్రభుత్వ పాఠశాలలో ఎండీఎంకు సంబం« దించి విద్యార్థుల్లో ఆసక్తి రోజురోజుకూ సన్నగిల్లుతోంది. పాఠశాలలకు అందిస్తున్న గుడ్లలో నాణ్యత లేకపోవడంతో పాటు పురుగులు పట్టిన వాటిని కూడా సరఫరా చేస్తున్నారు. వీటికి తోడు ప్రస్తుతం బియ్యంలో కూడా నాణ్యత లోపించడంతో పాఠశాలల్లో సగం మంది ఎండీఎం భోజనాలపై అనాసక్తి చూపుతున్నారు. చాలా మంది విద్యార్థులు పురుగులు, ధాన్యం ఉన్న భోజనం చేయలేక ఇంటిముఖం పడుతున్నారు. జిల్లాలో 2.20 లక్షల మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3165 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,356 ప్రభుత్వ ప్రాథమిక, 430 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు, 379 జెడ్పీ హైస్కూల్లు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక స్థాయిలో 1,15, 267 మంది, ఉన్నత స్థాయిలో 1,05,118 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థికి రోజుకు వంద గ్రాముల బియ్యం, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయి విద్యార్థికి రోజుకు 150 గ్రాముల బియ్యాన్ని వండిపెట్టి భోజనం వడ్డించాలి. జిల్లాలో రోజుకు 2.79 టన్నుల బియ్యం వీరి నిమిత్తం వెచ్చిస్తున్నారు. అయితే చాలా మంది ఈ ఎండీఎంపై అనాసక్తిని చూపుతున్నారు. దీంతో చాలా పాఠశాలల్లో ఈ భోజనానికి సంబంధించిన బియ్యం మిగిలిపోతున్నాయి. నాణ్యత లేకుంటే మార్చవచ్చు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి సరఫరా అవుతున్న బియ్యంలో నాణ్యత లేకుంటే వాటిని తిరిగి ఆయా పాఠశాలల పరిధిలోని రేషన్ డిపోలకు, డీలర్లకు, తహసీల్దార్ కార్యాలయాలకు తిరిగి ఇచ్చేయవచ్చు. నాణ్యతతో కూడిన బియ్యాన్ని మాత్రమే ఎండీఎంలో వండాలి. ఆయా పాఠశాలల హెచ్ఎంలు పర్యవేక్షణ చేయాలి. గుడ్లు బాగోలేని అంశంపై దృష్టిసారించాం. నాణ్యత ప్రమాణాలు పాటించాలని పంపిణీదారులకు సూచించాం. – ఐ. వెంకటరావు, డిప్యూటీ ఈఓ, పాలకొండ -
మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల
ఫరిదాబాద్: మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు గతంలో చాలానే వెలుగు చూశాయి. అయితే తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో క్ష పాము పిల్ల (స్నేక్లెట్) రావడం కలకలం సృష్టించింది. హర్యానా ఫరిదాబాద్‌లోని రాజ్కేయా బాలికల సీనియర్ సెకండరీ పాఠశాలలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తాను తింటున్న భోజనంలో చచ్చిన పాముపిల్ల రావడంతో ఒక్కసారిగా హడలిపోయింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు...భోజనం తినడాన్ని ఆపివేశారు. అయితే అప్పటికే కొందరు విద్యార్థినులు భోజనాన్ని తినేశారు. ఈ విషయం తెలియడంతో పలువురు వాంతులు చేసుకున్నారు. భోజనంలో పాముపిల్ల రావడాన్ని గమనించిన స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు ... మిగతా విద్యార్థినులు ఆ ఆహారాన్ని తినకుండా ఆపివేశారు. సాధారణంగా తమకు పెట్టే భోజనం ముతక వాసన వచ్చేదని, అయితే పిల్లపాము రావడం దారుణమని విద్యార్థినిలు పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ బ్రజ్ బాలా వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు, మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఇస్కాన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే ఇదే ఆహారాన్ని సరఫరా చేసి ఇతర పాఠశాలలకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఓ కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. అలాగే ఆ ఆహారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. -
మధ్యాహ్న భోజన బియ్యం పట్టివేత
బల్మూరు(అచ్చంపేట) : విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజన బియ్యాన్ని రాత్రివేళ వంట ఏజెన్సీ నిర్వాహకులు పక్కదారి పట్టిస్తుండగా సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సంఘటన బల్మూరులో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ శివశంకర్ కథనం ప్రకారం.. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వంట ఏజెన్సీ నిర్వాహకుడు మశయ్య రాత్రి 8.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజన బియ్యం సుమారు 15 కిలోలు, మంచినూనె, చింతపండును పాఠశాల గేట్ దూకి తీసుకెళ్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకున్నారు. దీనిపై ఏజెన్సీ నిర్వాహకుడిని నిలదీయడంతో హెచ్ఎం తీసుకురమ్మంటే తాను తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. దీంతో సర్పంచ్, గ్రామస్తులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలలో కొంతకాలంగా జీహెచ్ఎం శ్రీనివాసమూర్తి వంట ఏజెన్సీ వారితో విద్యార్థులకు అందించాల్సిన బియ్యం, సామగ్రి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాడని సర్పంచ్ ఆరోపించారు. దీనిపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేసి హెచ్‌ఎంతోపాటు ఏజెన్సీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై హెచ్ఎం శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా వంట మనిషి బియ్యం తరలించిన విషయంతో తనకు సంబంధం లేదన్నారు. పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన వివాదంతో సర్పంచ్‌తోపాటు ఆయన వర్గీయులు కావాలని ఇబ్బందులకు గురిచేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఏజెన్సీ వారికే సంబంధమని శనివారం తాను విధులకు రాకపోవడంతో బియ్యం మిగిల్చి తీసుకెళ్లి ఉండవచ్చని హెచ్ఎం చెప్పుకొచ్చారు. -
వారంలో మూడుసార్లు గుడ్డు తప్పనిసరి
డీఈఓ రమేష్‌బాబు నర్సాపూర్‌రూరల్: మధ్యాహ్న భోజన పథకంలో వారంలో మూడుసార్లు తప్పనిసరి విద్యార్థులకు గుడ్లు వడ్డించాలని డీఈఓ రమేష్‌బాబు సూచించారు. మధ్యాహ్న భోజనంలో వారంలో మూడుసార్లు గుడ్లుపెట్టని వంట కార్మికులను తొలగిస్తామన్నారు. మూడుసార్లు గుడ్లు అందే విధంగా హెచ్ఎంలు , మండల విద్యాధికారి గమనించాలన్నారు. గుడ్లకు బదులు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వకూడదని సూచించారు. గురువారం నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల-2ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు వేసి బోర్డుపై స్పెల్లింగ్‌తో కూడిన పదాలను రాయించారు. టెన్త్‌క్లాస్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ చేపట్టేందుకు దసరా సెలవుల అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు సంబంధించిన జాబితాను పంపించాలని మరమ్మత్తుల కోసం జెడ్పీసీఈఓకు నివేదిస్తామన్నారు. నర్సాపూర్ రావడం ఆనందంగా ఉంది నర్సాపూర్ ప్రభుత్వ కళాశాలలో తాను చదువుకున్నట్లు డీఈఓ రమేష్‌బాబు తెలిపారు. అప్పట్లో ఇంటర్‌తోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల షిప్టుల పద్దతిన ఉదయం, సాయంత్రం నడిచేవన్నారు. తాను ఇంటర్ ఇదే పాఠశాల, కళాశాలలో చదివినట్లు తెలిపారు. ఇక్కడికి రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పాఠశాల తరగతి గదులన్నీ కలియ తిరిగి తన గతస్ముృతులను గుర్తు చేసుకున్నాడు. -
అందని బిల్లులు
మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులేవి అప్పుల పాలవుతున్న ఏజెన్సీ మహిళలు 3 నెలలుగా బిల్లులు రాక అవస్థలు పాపన్నపేట: మధ్యాహ్న భోజన బిల్లులు పెంచినప్పటికీ వాటి చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో ఏజెన్సీ మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ మూడు నెలల బిల్లులు రాక వంటలు చేసేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. పాపన్నపేట మండలంలో 61 పాఠశాలలున్నాయి. ప్రతి రోజు సుమారు 6 వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. అయితే ఏజెన్సీ మహిళలకు కనీస సౌకర్యాలు లేక ..బిల్లులు సకాలంలో రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సారి వలసలను నివారించాలనే లక్ష్యంతో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనాలు అందజేశారు. వాటికి సంబంధించి ఇటీవలే బిల్లులు వచ్చాయి. అయితే మండలంలో ఇప్పటి వరకు జూన్ నెల నుంచి వంట బిల్లులు రాలేదు. దీంతో కిరాణం సామానుకు కష్టమవుతుందని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాన్ని గ్రహిస్తు గ్రామాల్లోని కిరాణం దుకాణాల యాజమానులు సామానుకు రేట్లు ఎక్కువ వేసి ఉద్దెర ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల దాటగానే బిల్లులు చెల్లించక పోతే వాటికి వడ్డీ కూడా వేస్తున్నారని తెలిపారు. దీంతో తాము చేసిన వంటలకు వచ్చే బిల్లులు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.ముఖ్యంగా తక్కువ విద్యార్థు«లున్న స్కూళ్లలో వంట బిల్లులు సరిపోవడం లేదని చెపుతున్నారు.పొద్దంతా కష్టపడే తమకు జీతాలు మాత్రం రూ.1000 చెల్లించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.50 కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు.నెలకు కనీసం రూ.3000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే సుమారు 45 పాఠశాలల్లో వంట గదులు లేక ఆరుబయట వంటలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలిపారు.వంట గదులు మంజూరైనట్లు చెపుతున్నా ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదని వాపోతున్నారు. ఈ విషయమై ఎంఇఓ మోహన్‌రాజు మాట్లాడుతు జూన్ నెల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.వంట గదులు మంజూరయ్యాయని వాటి నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. -
అప్పుల తిప్పలు
ఐదు నెలలుగా అందని బిల్లులు ఇబ్బందుల్లో ఏజెన్సీ మహిళలు నాణ్యత లోపిస్తున్న భోజనం పట్టించుకోని అధికారులు కోహీర్: ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోయి అవస్థలు పడుతున్నారు. సకాలంలో బిల్లులు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న నిర్వాహకుల కుటుంబాలు పస్తులు ఉండాల్సిన దయనీయస్థితి. మధ్యాహ్న భోజన ఏజనీలు మహిళలే నిర్వహిస్తుండటం గమనార్హం. సకాలంలో బిల్లులు చెల్లింకపోవడంతో మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత లోపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో 33 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 8 ఉన్నత పాఠశాలల్లో సుమారు 5021 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులకు గత ఏప్రిల్ నుంచి దాదాపు రూ.12 లక్షల మేర చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. సకాలంలో బిల్లులు అందక పోవడంతో నిర్వాహకులు నానా ఇబ్బందులకు పడుతున్నారు. కిరాణా దుకాణాల్లో అప్పులు పేరుకుపోయి సొంత ఇంటికి సరుకులు కొనలేని పరిపస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు. నిర్వహణ కష్టంగా ఉందని, అయితే మధ్యలో మానేస్తే బిల్లులు చెల్లించరని భయపడుతున్నామన్నారు. కనీసం కుటుంబ అవసరాలు కూడా వెదుక్కోవలసివస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా నిర్వహణ కోసం అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చినవాళ్లు బకాయి తీర్చమని ఇంటికి పదేపదే వస్తుండటంతో తమ పరువుపోతోందని కన్నీళ్లపర్యంతమయ్యారు. అధికారులకు తమ వేదన విన్నివించుకున్నా ప్రయోజనం లేకుండాపోయిందని వాపోయారు. కనీసం వంటలు వండినందుకు చెల్లించే రూ. వెయ్యి గౌరవ వేతనం కూడా చెల్లించడం లేదని విచారం వ్యక్తం చేశారు. బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిల్లులందక మండలంలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 150 మంది మహిళల ఇక్కట్లు వర్ణనాతీతం. వెంటనే బిల్లులు, గౌరవ వేతనం చెల్లించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నరకం చూస్తున్నాం మధ్యాహ్న భోజనం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో నరకం చూస్తున్నాం. కిరాణా దుకాణ యజమానులు సరుకులు ఇవ్వడంలేదు. ఇప్పటి వరకు సరఫరా చేసిన సరుకుల బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. డుబ్బులేక దుకాణదారులకు ముఖం చూపించలేకపోతున్నాము. డబ్బుల కోసం ఇంటికి మనుషులను పంపిస్తున్నారు. అప్పుల వాళ్లు ఇళ్ల చుట్టూ తిరగడంతో నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. - సువర్ణ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కుంటుంబసభ్యులు కష్టపడుతున్నారు మధ్యాహ్న భోజన బిల్లులు, గౌరవ వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం. చేయని నేరానికి కుటుంబ సభ్యులు సైతం కష్టాల పాలౌతున్నారు. వారి కనీస అవసరాలు తీర్చలేక పోతున్నాం. కొన్ని సార్లు పస్తులుండాల్సి వస్తోంది. అధికారులను ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. - రాజేశ్వరి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు బిల్లులు పెట్టాము మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరి నిమిత్తం పంపిస్తున్నాము. వెంటనే మంజూరు చేయాలని పలుమార్లు లెటర్లు కూడా పెట్టాం. అయినా మంజూరు చేయడం లేదు. మహిళలు కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాం. బిల్లులు అందకపోయినప్పటికీ భోజనాలు మెనూ ప్రకారం వడ్డించమని నిర్వాహకులకు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. - ఎన్. శంకర్, ఎంఈఓ, కోహీర్ మండలం -
హిందూ సంస్థలు పెట్టే భోజనం మాకొద్దు..!
ఉజ్జయినిః మదర్సాల్లో హిందూ సంస్థలనుంచీ వచ్చే మధ్యాహ్న భోజనాన్ని తిరస్కరిస్తున్నారన్న వార్త.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉజ్జయిని లోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న స్థానిక హిందూ సంస్థలు మదర్సాలకు కూడా అందిస్తుండగా... సుమారు 30 మదర్సాలల్లో ఇటీవల ఆ భోజనాన్ని తిప్పి కొడుతున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మదర్సాల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. 2010 సంవత్సరం నుంచీ ఇస్కాన్ సంస్థ స్థానికంగా ఉన్న మొత్తం 315 స్కూళ్ళకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. అయితే ఇటీవల హిందూ సంస్థలనుంచీ వచ్చే భోజనాన్ని స్వీకరించవద్దని, వారు తమ నమ్మకాలను వమ్ము చేస్తున్నారని మదర్సా నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ నుంచి పిల్లలకు అందుతున్న మిడ్ డే మీల్ ను తిప్పికొట్టారు. ఇస్కాన్ నుంచి భోజనం స్కూళ్ళకు పంపే ముందు.. దేవుడికి నైవేద్యం పెడతారన్న అనుమానంతో ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. జూలై 2016 లో ఇస్కాన్ టెండర్ ను సొంతం చేసుకున్న బీఆర్కే ఫుడ్స్, మా పార్వతి ఫుడ్స్ స్థానికంగా ఉన్న సుమారు 315 స్కూళ్ళకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుండగా.. తాజాగా 56 మదర్సాలు ఆ భోజనాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సప్లయర్స్ అందిస్తున్న భోజనాన్ని స్వీకరిస్తే.. మదర్సాలనుంచీ తమ పిల్లలను మానిపించేందుకు సైతం కొందరు తల్లిదండ్రులు సిద్ధమౌతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు మదర్సాల్లోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని వారికి అక్కడే వండి పెట్టాలని, ఇతర సంస్థలనుంచీ స్వీకరించవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మిడ్ డే మీల్ నిరాకరణపై ప్రశ్నించగా.. మదర్సాల్లోని పిల్లలు ప్రత్యేక ఆహారాన్ని కోరుకుంటున్నారని, అందుకే ప్రస్తుతం అందుతున్న భోజనాన్ని నిరాకరిస్తున్నారని మదర్సా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మిడ్ డే మీల్ వివాదంపై పూర్తి విచారణ జరగాల్సి ఉంది. -
మధ్యాహ్న భోజనం వికటించి నలుగురికి అస్వస్థత
మధ్యాహ్న భోజనం వికటించి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నిమ్మలపల్లి మండలం మోదురెడ్డివారిపల్లెలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని కలుషితమైన ఆహారాన్ని తిన్న విద్యార్థులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పుస్తకాలే కంచాలుగా మధ్యాహ్న భోజనం
'టంగ్..' అంటూ లంచ్ బెల్ మోగింది. విద్యార్థులంతా పరుగున వచ్చి వరుసగా కూర్చున్నారు. అప్పటికే సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనం వడ్డింపు మొదలైంది. ఒక్కొక్కరు తమ నోటు పుస్తకాల్లోని మధ్య పిన్నుపేజీని చింపి, నేలపై ఉంచారు. ఆ పేపర్లలోకి అన్నం, పప్పు వచ్చి పడ్డాయి. ఆకలితో ఉన్న ఆ పిల్లలు.. అన్నంలోకి రాళ్లు చేరకుండా జాగ్రత్తగా ఒక్కో ముద్ద కలుపుకొని తిన్నారు. లంచ్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను చెత్తబుట్టలో పారేసి, మరో పేపర్‌తో చెయ్యి, మూతి తుడుచుకున్నారు. ఇది.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా పర్సౌరియా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో నిత్యకృత్యం! మొత్తం 375 మంది విద్యార్థులున్న ఆ స్కూలులో మధ్యాహ్నభోజనం చేసేందుకు పిల్లలకు కంచాలు లేవు. ఇంటి నుంచి తెచ్చుకుందామా అంటే స్కూల్ ఆవరణలో నీళ్లు లేవు! దీంతో వారు నోటు పుస్తకాల పేజీలు, న్యూస్ పేపర్లలో మధ్యాహ్నభోజనం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమంటే గోధుమ పిండి సరఫరా ఆగిపోవడంతో గడిచిన రెండు నెలల నుంచి మధ్యాహ్నం భోజనంలో వాళ్లకు బాగా అలవాటైన రొట్టెలకు బదులు అన్నం, పప్పు అందిస్తున్నారు. ఇది విద్యార్థుల బాధలను మరింత రెట్టింపు చేసింది. అసలు ఇంతటి ఆటవిక పరిస్థితులు ఎలా తలెత్తాయని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎంఎల్. ఆశీర్వర్ను అడిగితే.. 'నేను ఈ స్కూలులో చేరి మూడేళ్లయింది. ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలైంది. పిల్లలు పేపర్లలో భోజనం చేయడం నాకూ బాధగానే ఉంటుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశా. పప్పు భోజనం రోజైతే మరీ సమస్యగా ఉంటుంది. వెంటనే గోధుమ పిండి పంపాలని కూడా అభ్యర్థించా' అని సమాధానమిచ్చారు. ఇదే విషయాన్ని మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్టు అధికారి ప్రద్యుమ్నా చౌర్యా వద్ద ప్రస్తావించగా ఆయన మరోలా స్పందించారు. 'ఆ పాఠశాలలో కంచాలు లేవని ఇదివరకే ఫిర్యాదు అందింది. దీంతో వాటి కొనుగోలు కోసం రూ. 2,400 మంజూరు చేశాం కూడా. ఆ నిధులు ఏమయ్యాయో తేలాలి. తాజా ఘటనపై విచారణ చేయిస్తాం' అని చెప్పారు. 'ఆ స్కూలు విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వం కంచాలు ఇవ్వలేదు. సరే, ఇంట్లో నుంచైనా తీసుకువెళదామంటే నీళ్ల సమస్య. తాగడానికి ఒక్క చుక్క దొరికితేనే గగనం, అలాంటిది కంచాలు కడుక్కోవడానికి ఎక్కడి నుంచి వస్తాయి. అందుకే మరో దారి లేక పిల్లలు ఇలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో భోజనాలు చేస్తున్నారు' అని స్థానిక సామాజిక కార్యకర్త హర్గోవింద్ ప్రజాపతి చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పిల్లలకు కంచాలు, స్కూల్లో తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
మిడ్ డే మీల్స్ వికటించి 20 మంది విద్యార్థులకు అస్వస్థత
నిజామాబాద్: మిడ్ డే మీల్స్ వికటించడంతో 20 మంది విద్యార్థులు ఆస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. చుక్కాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20మంది విద్యార్థులు మిడ్ డే మీల్స్ తిన్నారు. వారు తిన్న ఆహారం వికటించడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు మాచారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారం అందించగా డాక్టర్లు వైద్య సేవలు అందించారు. చికిత్స అనంతరం ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. (మాచారెడ్డి) -
సమస్యలు తుక తుక
సాక్షిప్రతినిధి, నల్లగొండ :ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు తుకతుక ఉడుకుతున్నాయి. ఏటా రూ.70కోట్ల బడ్జెట్ ఉన్న ఈ పథకం విద్యార్థులకు పరీక్ష పెడుతోంది. జిల్లావ్యాప్తంగా 3301 స్కూళ్లలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా 3.28 లక్షల మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు లబ్ధిపొందుతున్నారన్నది అధికారుల లెక్క. ప్రభుత్వం కేటాయించిన రూ.70కోట్ల బడ్జెట్లో రూ.36లక్షలు కేవలం ఆహారం కోసమే వినియోగిస్తున్నారు. అంటే నెలకు రూ.36లక్షల చొప్పున పిల్లల భోజనాల కోసం ఖర్చు చేస్తున్నారు. కానీ భోజన నాణ్యత ప్రమాణాలు అథమస్థాయిలో ఉన్నాయి. ఈ పథకంలో ప్రధానంగా 300 కేలరీలు, 8 నుంచి 12గ్రాముల ప్రొటీనులు ఉన్న ఆహారాన్ని విద్యార్థులకు అందివ్వాలి. ప్రాథమిక పాఠశాలలోని ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.50, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఒకొక్కరికి రోజుకు రూ.6చొప్పున భోజనం కోసం ఖర్చు చేయాల్సి ఉంది. కానీ, దీనికి పూర్తి భిన్నంగా పథకం అమలవుతోంది. ధరలు పెరిగిపోయాయని కోడిగుడ్లు ఇవ్వడం మానేశారు. అరటి పండు ఇవ్వాలన్న సంగతే మరిచారు. చారులా తయారు చేసిన కూరలు, నీళ్లలా కనిపించే చారుతో భోజనాలు పెడుతున్నారు. ఇక, పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యం, తినే అన్నానికి ఏమాత్రం పనికి రావడం లేదు. పురుగులు, మెరిగెలు, నూకలతో పాటు అన్నం ముద్దలు, ముద్దలుగా, బంక బంకగా ఉండడంతో విద్యార్థులు తినలేక చస్తున్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు అవసరమైన గ్యాస్ సౌకర్యం లేక ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. తిప్పర్తి మండలంలో వంటగదులు ఉన్నా గ్యాస్ లేకపోవడంతో చెట్లకిందనే వంట చేస్తున్నారు. నల్లగొండ మండలంలో వంటగదులు, గ్యాస్ రెండూ లేకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. కనగల్ ఆదర్శ పాఠశాలలో మంచినీళ్ల సౌకర్యం లేకపోవడంతో స్కూళ్లో వంటలు వండడం లేదు. మూడు కిలోమీటర్ల దూరంలో వంట చేసి తీసుకొస్తున్నారు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మూత్రశాలల శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకు వద్దనే విద్యార్థులు తమ ప్లేట్లను కడుగుతున్నారు. తిప్పర్తి మండలం పజ్జూరు ప్రాథమిక పాఠశాల, హైస్కూల్లో ఏజెన్సీల మద్య ఘర్షణ నెలకొనడంతో మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయింది. దీంతో ఏజెన్సీలను పక్కన పెట్టి పాఠశాల యాజమాన్య కమిటీకి బాధ్యత అప్పగించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మొత్తం 206 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కాగా వాటిలో 69 పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం, 99 పాఠశాలల్లో వంట గదులు లేవు. దామరచర్ల మండలంలో 39 పాఠశాలల్లో వంట గదులు నిర్మించినా ఇరుగ్గా ఉండడంతోఆరుబయటనే వంటలు చేస్తున్నారు. భోజనం నాణ్యతగా లేకపోగా కొన్ని పాఠశాలల్లో కోడిగుడ్లను ఇవ్వడం మరిచిపోయారు. మిర్యాలగూడ పట్టణంలోని బకల్వాడ ఉన్నత పాఠశాలో స్కూళ్లు పునః ప్రారంభమైన నాటి నుంచి కూడా భోజనంలో కోడిగుడ్లు పెట్టడంలేదు. సూర్యాపేట నియోజకవర్గంలో 154 ప్రాథమిక , 26 ప్రాథమికోన్నత, 33ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. సూర్యాపేట మండలంలో యండ్లపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో వంట చేసేందుకు మహిళా సంఘాలు పోటీ పడటంతో రెండేళ్లుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్ అయ్యింది. పెన్‌పహాడ్ మండలంలో చెట్లకింద, వాటర్ ట్యాంకుల కింద భోజనం వండాల్సి వస్తోందని ఏజెన్సీల వారు వాపోతున్నారు. నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో మినహా ఆ మండలంలో ఒక్క పాఠశాలలో కూడా వంట గదులు లేవు. భువనగిరి నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనానికి వండిపెట్టే బియ్యం నాసిరకంగా ఉండడంతో రుచి లేక చాలా మంది విద్యార్థులు భోజనం చేయడంలేదు. భోజనంలో పురుగులు వస్తుండడంతో విద్యార్థులు పాఠశాలలో భోజనం చేయకుండా ఇంటికెళ్లి తింటున్నారు. నియోజకవర్గంలో ఏ పాఠశాలలో కూడా ప్రభుత్వం అందించిన ప్రకారం మెనూ అమలు కావడంలేదు. వారానికి గుడ్డు, అరటి పండు ఇస్తలేరని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇంటి నుంచే బాటిల్లో నీరు తెచ్చుకుంటున్నారు. 60 పాఠశాలలకు ఇంకా వంటగదులు లేవు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వండిన అన్నం ముద్దగా అవుతోంది. దాదాపు 100 మంది విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఎల్లగిరిలో ఫ్లోరిన్ నీళ్లతో అన్నం వండడంతో పచ్చగా మారింది. తుఫ్రాన్‌పేటలో బియ్యం పురుగుపట్టాయి. గుడ్డు ఎక్కడా పెట్టడం లేదు. సంస్థాన్ నారాయణపురం మండలం ఆరెగూడెం, పుర్లకుంట ప్రాథమిక పాఠశాలల్లో ఏజెన్సీలు ఇంటి వద్దే అన్నం వండి తీసుకొచ్చి పిల్లలకు వడ్డిస్తున్నారు. మర్రిగూడ డలంలోని రాంరెడ్డిపల్లి, అంతంపేట, నామాపురం ఉన్నత పాఠశాలల్లో ఆరుబయటే వంట వండుతున్నారు. నాగార్జున సాగర్ యోజకవర్గంలో మొత్తంగా 340 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో సగం పాఠశాలల్లో కూడా వంట గదులు లేవు. ఆరుబయటే వంట వండుతున్నారు. ఏ పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. గుడ్ల ధర పెరిగిందని వారానికి ఒక్క కోడిగుడ్డు మాత్రమే ఇస్తున్నారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయని నీళ్ల చారు. ముద్దన్నమే పెడుతున్నారు. మెజార్టీ పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచే నీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని స్కూళ్లలో వండిపెడుతున్న అన్నం బంకతో ముద్దలు ముద్దలుగా ఉండడంతో విద్యార్థులు తినలేకపోతున్నారు. నీళ్ల చారు, రెండు రకాల కూరగాయలు మాత్రమే వండి పెడుతున్నారు. కేతేపల్లి మండలంలో వంటగదులు మరమ్మతులకు నోచుకోక, శిథిలావస్థకు చేరుకున్నాయి. చిట్యాల మండలంలో నిర్మించిన వంట గదులను వంట సామగ్రి నిల్వకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఉరుమడ్లలో వాటర్‌ట్యాంకు కిందనే వంట చేస్తున్నారు. కట్టంగూర్ మండలంలో వంట గదులు నిరుపయోగంగా మారాయి. గదులు చిన్నవిగా ఉండడంతో ఆరుబయటే వంటలు చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 303 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 228 పాఠశాలలకు వంట గదులు నిర్మించారు. 76 చోట్ల గదుల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవని వదిలేశారు. నిర్మించిన వంట గదులు చిన్నవిగా అసౌకర్యంగా ఉండడంతో ఆరు బయటనే వంటలు చేస్తున్నారు. కూరగాయలు, కోడి గుడ్లకు ధరలు బాగా పెరగడంతో వారానికి ఒకసారి మాత్రమే కోడి గుడ్డు అందిస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 247 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 135 పాఠశాలలకు వంట గదులు లేవు. ఆరుబయటనే వంట చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నాసిర కంగా ఉంది. గడిచిన విద్యాసంవత్సరం 2013-14 కు గాను 9,10 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు అందజేయాల్సిన బిల్లులు, ఏడు నెలలుగా మంజూరు కాలేదు. 8వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన బిల్లులను ప్రతినెలాఅందజేయకుండా రెండు నెలలకొకసారి చెల్లిస్తున్నారు. కోదాడ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బియ్యం నాణ్యంగా లేక భోజనం సక్రమంగా ఉండడం లేదని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు, కోడిగుడ్ల ధరలు పెరిగిపోవడంతో నిర్వాహణ తమకు భారం అవుతుందని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ఆలేరు నియోజకవర్గంలో మధ్యాహ్న భోజనం అమలు సక్రమంగా జరగడంలేదు. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజ పేట, బొమ్మలరామారం, తుర్కపల్లి, గుండాల, ఆత్మకూరు మండలాల్లో వంటగదుల సమస్య తీవ్రంగా ఉంది. 268 పాఠశాలలకు గాను 100 పాఠశాలల్లో వంటగదులు లేవు. మధ్యాహ్న భోజనానికి వండిపెట్టే బియ్యం నాసిరకంగా ఉండడంతో రుచిలేక చాలామంది విద్యార్థులు భోజనం చేయడం లేదు. వారానికి గుడ్డు, అరటి పండు ఇవ్వడం లేదు. ఇక పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. అంతేకాక అపరిశుభ్ర పరిసరాలలో భోజన ం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కొన్నిచోట్ల వంట గదులు నిర్మించినా అవి సరిపోవడం లేదు. -
పాపం పిల్లాడు..
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ఆడుతూపాడుతూ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించిన ఆ బాలుడికి అవే ఆఖరు ఘడియలయ్యాయి. మిత్రులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారిని ఆటో రూపంలో మృత్యువు కబళించి, ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. స్థానిక కొవ్వూరునగర్‌లోని సంజీవరెడ్డి బంగ్లా సమీపంలో ఈ విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సంజీవరెడ్డి బంగ్లా సమీపంలో నివసిస్తున్న రవీంద్రారెడ్డి, కృష్ణవేణి దంపతులకు హేమంత్, కోదండరామిరెడ్ది(7) ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కోదండరామిరెడ్డి సమీపంలోని విశ్వ భారతి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం నుంచి మిత్రులందరినీ కలసి చాక్లెట్లు పంచుతూ ఆనందంగా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలాడు. మధ్యాహ్నం భోజనం చేసి తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించగానే.. తాను మిత్రులతో కలసి ఆడుకుని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంటికి సమీపంలో మరమ్మతుకు గురై నిలిపి ఉంచిన ఆటోలో మిత్రులతో కలసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆటో యజమాని వచ్చి దానినిస్టార్ట్ చేసేందుకు యత్నించాడు. అది స్టార్ట్ కాకపోవడంతో ఆటోను వెనుక నుంచి నెట్టాల్సిందిగా పిల్లలకు సూచించగా వారు దానిని బలంగా నెట్టారు. అప్పటికే రివర్స్ గేర్‌లో ఉన్న ఆటో స్టార్ట్ అయి బలంగా వెనక్కు రావడంతో, దాని వెనుకనే ఆటోను తోస్తున్న కోదండరామిరెడ్డి దాని కింద పడి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. స్థానికుల సహాయంలో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ బాలుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, తక్షణం ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్య సిబ్బంది సూచించారు. దీంతో గాయాలపాలై విలవిల్లాడుతున్న బిడ్డను తీసుకుని ఆ దంపతులు సాయినగర్‌లో పేరెన్నికగన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు లేరంటూ వారు చికిత్సకు నిరాకరించారు. అక్కడి నుంచి ఐరన్ బ్రిడ్జి సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా, ఇక్కడ చిన్న పిల్లల వైద్యుడు లేరని చెప్పారు. కోర్టు రోడ్డులోని ప్రముఖ ఆస్పత్రికి వెళ్లగా ఇంత చిన్న పిల్లలకు తాము వైద్యం చెయ్యలేమని చెప్పారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో బాలుడు కన్నుమూశాడు. ‘సామీ.. చికిత్స చేయండి.. మా పిల్లాడిని కాపాడండి..’ అని బాలుడి తల్లిదండ్రులు మొత్తం నాలుగు ఆస్పత్రుల్లోనూ కన్నీటితో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై జనం మండిపడ్డారు. వైద్యులు ప్రాణాలు తీస్తున్నారు.. : గాయాలతో విలవిలలాడుతున్న తన బిడ్డను ప్రభుత్వ వైద్యులే పొట్టన పెట్టుకున్నారని మృతుడి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డను బతికించుకుందామని ప్రభుత్వాస్పత్రికి వెళితే కనీస చికిత్స కూడా చేయకుండా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లమన్నారని, కొంత వైద్యం చేసి ఉంటే తమ బిడ్డ బతికుండే వాడని, సుమారు గంటన్నర పాటు చేతుల మీద ప్రాణాలతో బిడ్డ కొట్టుమిట్టాడుతుంటే కాపాడుకోలేక పోయామని రోదించారు. ఇంత మంది వైద్యులు ఉండీ ఏం ప్రయోజనమని ఆ బాలుడి అత్త పద్మావతి కంట తడితో శాపనార్థాలు పెట్టింది. -
మధ్యాహ్న భోజనం వికటించి...
చెన్నూరు, న్యూస్‌లైన్: మధ్యాహ్న భోజనం విషాహారమైంది. అన్నంలో బల్లి పడటాన్ని గమనించకుండా విద్యార్థులకు వడ్డించడంతో వాటిని తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరుగా విద్యార్థులు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. విద్యార్థులందరినీ సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటన జరిగిందెలాగంటే... చెన్నూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉంటున్నారు. రోజులాగే శనివారం మధ్యాహ్నం కూడా ఏజెన్సీ నిర్వాహకులు పిల్లలకు భోజనం వడ్డించారు. వాటిని తిన్న వారిలో తొలుత భరత్ అనే పదో తరగతి విద్యార్థి తన పళ్లెంలో బల్లి ఉందంటూ ఉపాధ్యాయులతో పాటు వంట చేసేవారికి చూపించాడు. అంతలోనే మరో ఇద్దరు విద్యార్థులు వచ్చి తమకు కడపులో వికారంగా ఉందని చెప్పారు. దీంతో ఇన్చార్జ్ ఎంఈఓ, హెడ్మాస్టర్ వెంకటలక్షుమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయు లు కలసి విద్యార్థులను వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఇబ్రహీం, వైద్యాధికా రి రాఘవ వెంటనే విద్యార్థులను పరీ క్షించారు. పిల్లలకు ఎటువంటి ప్రమా దం లేదని నిర్ధరించారు. అయితే భరత్ అనే విద్యార్థి ఎక్కువగా భయపడటంతో అతనికి ప్లూయిడ్స్ ఎక్కించారు. మిగిలిన 16 మందికి మందులు, ఓఆర్ఎస్ ద్రావణం, బ్రెడ్ ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న అధికారులు సమాచారం అందిన వెంటనే స్థానిక తహశీల్దారు శాంతమ్మ, డీటీ వెంకటసుబ్బయ్య సహా చెన్నూరు సర్పంచ్ రాజేశ్వరి పాఠశాలకు చేరుకున్నారు. ఆ తరువాత పీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అప్పటికే విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులతో ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లకేమైందంటూ డాక్టర్లు, అధికారులను పదేపదే అడిగారు. పిల్లలకు ఏం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సంఘటన ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ, తహ శీల్దార్ తెలిపారు. -
కాంగ్రెస్-ములాయంల మద్య ఢిల్