వారంలో మూడుసార్లు గుడ్డు తప్పనిసరి | Three times a week is necessary for egg | Sakshi
Sakshi News home page

వారంలో మూడుసార్లు గుడ్డు తప్పనిసరి

Published Thu, Sep 29 2016 8:17 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

మాట్లాడుతున్న డీఈఓ రమేష్‌బాబు - Sakshi

మాట్లాడుతున్న డీఈఓ రమేష్‌బాబు

డీఈఓ రమేష్‌బాబు

నర్సాపూర్‌రూరల్‌: మధ్యాహ్న భోజన పథకంలో వారంలో మూడుసార్లు తప్పనిసరి విద్యార్థులకు గుడ్లు వడ్డించాలని డీఈఓ రమేష్‌బాబు సూచించారు. మధ్యాహ్న భోజనంలో వారంలో మూడుసార్లు గుడ్లుపెట్టని వంట కార్మికులను తొలగిస్తామన్నారు. మూడుసార్లు గుడ్లు అందే విధంగా  హెచ్‌ఎంలు , మండల విద్యాధికారి గమనించాలన్నారు. గుడ్లకు బదులు పండ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు ఇవ్వకూడదని సూచించారు.

గురువారం నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల  ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల-2ను ఆయన  సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన  మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.  10వ తరగతి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు వేసి బోర్డుపై స్పెల్లింగ్‌తో కూడిన పదాలను రాయించారు. 

టెన్త్‌క్లాస్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. టెన్త్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ చేపట్టేందుకు దసరా సెలవుల అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు  సంబంధించిన జాబితాను పంపించాలని మరమ్మత్తుల కోసం జెడ్పీసీఈఓకు నివేదిస్తామన్నారు.    

నర్సాపూర్‌ రావడం ఆనందంగా ఉంది
నర్సాపూర్‌ ప్రభుత్వ కళాశాలలో తాను చదువుకున్నట్లు డీఈఓ రమేష్‌బాబు తెలిపారు. అప్పట్లో ఇంటర్‌తోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల షిప్టుల పద్దతిన ఉదయం, సాయంత్రం నడిచేవన్నారు. తాను  ఇంటర్‌ ఇదే పాఠశాల, కళాశాలలో చదివినట్లు తెలిపారు. ఇక్కడికి రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పాఠశాల తరగతి గదులన్నీ కలియ తిరిగి తన గతస్ముృతులను గుర్తు చేసుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement