మధ్యాహ్న భోజనం వికటించి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు.
మధ్యాహ్న భోజనం వికటించి నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నిమ్మలపల్లి మండలం మోదురెడ్డివారిపల్లెలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని కలుషితమైన ఆహారాన్ని తిన్న విద్యార్థులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.