మిడ్ డే మీల్స్ వికటించడంతో 20 మంది విద్యార్థులు ఆస్వస్తతకు గురయ్యారు.
నిజామాబాద్: మిడ్ డే మీల్స్ వికటించడంతో 20 మంది విద్యార్థులు ఆస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. చుక్కాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20మంది విద్యార్థులు మిడ్ డే మీల్స్ తిన్నారు. వారు తిన్న ఆహారం వికటించడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు మాచారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్యులకు సమాచారం అందించగా డాక్టర్లు వైద్య సేవలు అందించారు. చికిత్స అనంతరం ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
(మాచారెడ్డి)