Back ground music
-
ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.. యూట్యూబ్ మ్యూజిక్ సరికొత్త ఆఫర్
సంగీత ప్రియులకు శుభవార్త ! ఇంతకాలం పెయిడ్ సర్వీసుగా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్‌ని ఇకపై కస్టమర్లకు ఫ్రీగా అందివ్వాలని గూగుల్ నిర్ణయించింది. ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తే అచ్చంగా రేడియో తరహాలో ఇకపై సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. యూట్యూబ్‌తో ఇబ్బంది నచ్చిన పాటలు వినాలంటే అనేక యాప్ అందుబాటులో ఉన్నా ప్రధానంగా ఎక్కువ మంది ఉపయోగించేంది యూట్యూబ్. అయితే ఈ యాప్ ప్రధానంగా వీడియో ఆధారితమైనది కావడంతో కచ్చితంగా వీడియోను చూడాల్సి వస్తుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ త్వరగా డ్రైయిన్ అయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు గూగుల్ సంస్థ యూట్యూబ్ మ్యూజిన్‌కి అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మ్యూజిక్ ఫ్రీ యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో స్క్రీన్‌ను ఆఫ్ చేసి పాటలు వినొచ్చు ఇతర యాప్‌లు కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇది పూర్తిగా పెయిడ్ సర్వీస్‌గా అందుబాటులో ఉంది. దీంతో చాలా మందికి ఆ యాప్ చేరుకకాలేకపోయింది. అయితే తాజాగా ఈ సర్వీసును ఫ్రీగా అందించాలని గూగుల్ నిర్ణయించింది. ఎటువంటి రుసుము చెల్లించకుండానే సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. మొదట అక్కడే యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ని నవంబరు 3 నుంచి ఫ్రీ సర్వీసుగా అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది. మొదట కెనడాలో ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని.. ఆ తర్వాత దశల వారీగా ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తామని ప్రకటించింది. అయితే ఫ్రీ సర్వీసులో యాడ్స వస్తాయని తెలిపింది. యాడ్స వద్దనుకున్నవారు పెయిడ్ సర్వీసును ఎంచుకొచ్చని సూచించింది. ఎప్పుడంటే ఇండియాలో కొన్ని హై ఎండ్‌మొబైల్ ఫోన్లలో బండిల్ ఆఫర్‌గా యూట్యూబ్ మ్యూజిక్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇండియాలో ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతాన్ని ఎంజాయ్ చేయోచ్చు. చదవండి : Windows 11: వచ్చిందోచ్.. మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుందా? -
బ్యాక్‌గ్రౌండ్ ఫ్లో
వెండితెరపై దృశ్యం నిండుగా కనిపించాలంటే.. దాని వెనుకున్న శబ్దం అంత ఎఫెక్టివ్‌గా వినిపించాలి. కథను నడిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బేర్మంటే సినిమా బోర్ కొడుతుంది. హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ.. ఇలా ఏ తరహా సన్నివేశంలోనైనా ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే శక్తి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కు ఉంది. అందుకే సెట్స్‌లో ప్యాకప్ అయిన సినిమాకు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రాణం పోస్తుంది. సినిమాలకు ఆడియో మిక్సింగ్‌లో నాలుగు క్రాఫ్ట్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఒకే చోట నుంచి కంట్రోల్ చేసే ఫ్లో సౌండ్ సిస్టమ్‌ను కనిపెట్టారు కేఎమ్ఆర్ శేషు. ఒకే ఒక్కడితో.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో మ్యూజిక్ పాత్ర అత్యంత కీలకం. వేర్వేరు స్టూడియోల్లో ప్రాణం పోసుకునే నేపథ్య సంగీతానికి 200 మంది టెక్నీషియన్లు అవసరం. ఈ పనంతా మ్యూజిక్ డెరైక్టర్ ఒక్కడే ఒంటి చేత్తో చేసే వెసులుబాటును అందిస్తోంది శేషు రూపొందించిన ఫ్లో సౌండ్ సిస్టమ్. డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మ తన చిత్రం ఐస్‌క్రీమ్‌తో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలాంటి ప్రక్రియ ఇండియాలో వాడటం తొలిసారి. తర్వాత అనుక్షణం, ఐస్‌క్రీమ్ 2 చిత్రాలతో పాటు మరో రెండు బాలీవుడ్ మూవీల్లో కూడా ఇదే సిస్టమ్‌ను ఉపయోగించారు. ‘ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడమే కాదు ఆడియో కూడా ఫుల్ క్వాలిటీతో ఉంటుంది. ఐస్‌క్రీమ్ 2 మూవీకి వచ్చిన రివ్యూలే ఇందుకు నిదర్శనం’ అని చెబుతారు శేషు. సౌండ్ సగమే.. త్రీడీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ అందించడంలో ఈ సిస్టం ప్రధాన ప్రాత పోషిస్తుందంటారు శేషు. ‘యాంటీ పైరసీ, డేటా సెక్యూరిటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సిస్టమ్‌ను డెవలప్ చేశాను. ఫ్లో సౌండ్ సిస్టమ్ వల్ల సినిమా పైరసీ చేసినా ప్రయోజనం ఉండదు. పైరసీ చేసిన సినిమాల్లో సౌండ్ సగమే వినిపిస్తుంది. 15 ఏళ్ల అనుభవం, పరిశోధనల ద్వారా ఈ సిస్టమ్‌ను రూపొందించగలిగాను. ఈ సిస్టమ్‌పై పేటెంట్ హక్కులు కూడా పొందాను’ అని తెలిపారు శేషు.