బ్యాక్‌గ్రౌండ్ ఫ్లో | backgroud flow | Sakshi
Sakshi News home page

బ్యాక్‌గ్రౌండ్ ఫ్లో

Published Sun, Nov 30 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

బ్యాక్‌గ్రౌండ్ ఫ్లో

బ్యాక్‌గ్రౌండ్ ఫ్లో

వెండితెరపై దృశ్యం నిండుగా కనిపించాలంటే.. దాని వెనుకున్న శబ్దం అంత ఎఫెక్టివ్‌గా వినిపించాలి. కథను నడిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బేర్‌మంటే సినిమా బోర్ కొడుతుంది. హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ.. ఇలా ఏ తరహా సన్నివేశంలోనైనా ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే శక్తి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు ఉంది. అందుకే సెట్స్‌లో ప్యాకప్ అయిన సినిమాకు.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రాణం పోస్తుంది. సినిమాలకు ఆడియో మిక్సింగ్‌లో నాలుగు క్రాఫ్ట్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఒకే చోట నుంచి కంట్రోల్ చేసే ఫ్లో సౌండ్ సిస్టమ్‌ను కనిపెట్టారు కేఎమ్‌ఆర్ శేషు.
 
ఒకే ఒక్కడితో..
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో మ్యూజిక్ పాత్ర అత్యంత కీలకం. వేర్వేరు స్టూడియోల్లో ప్రాణం పోసుకునే నేపథ్య సంగీతానికి 200 మంది టెక్నీషియన్లు అవసరం. ఈ పనంతా మ్యూజిక్ డెరైక్టర్ ఒక్కడే ఒంటి చేత్తో చేసే వెసులుబాటును అందిస్తోంది శేషు రూపొందించిన ఫ్లో సౌండ్ సిస్టమ్. డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మ తన చిత్రం ఐస్‌క్రీమ్‌తో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలాంటి ప్రక్రియ ఇండియాలో వాడటం తొలిసారి. తర్వాత అనుక్షణం, ఐస్‌క్రీమ్ 2 చిత్రాలతో పాటు మరో రెండు బాలీవుడ్ మూవీల్లో కూడా ఇదే సిస్టమ్‌ను ఉపయోగించారు. ‘ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడమే కాదు ఆడియో కూడా ఫుల్ క్వాలిటీతో ఉంటుంది. ఐస్‌క్రీమ్ 2 మూవీకి వచ్చిన రివ్యూలే ఇందుకు నిదర్శనం’ అని చెబుతారు శేషు.
 
సౌండ్ సగమే..
త్రీడీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ అందించడంలో ఈ సిస్టం ప్రధాన ప్రాత పోషిస్తుందంటారు శేషు. ‘యాంటీ పైరసీ, డేటా సెక్యూరిటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సిస్టమ్‌ను డెవలప్ చేశాను. ఫ్లో సౌండ్ సిస్టమ్ వల్ల సినిమా పైరసీ చేసినా ప్రయోజనం ఉండదు. పైరసీ చేసిన సినిమాల్లో సౌండ్ సగమే వినిపిస్తుంది. 15 ఏళ్ల అనుభవం, పరిశోధనల ద్వారా ఈ సిస్టమ్‌ను రూపొందించగలిగాను. ఈ సిస్టమ్‌పై పేటెంట్ హక్కులు కూడా పొందాను’ అని తెలిపారు శేషు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement