పీడకలలు రాకుండా ఉండాలంటే...
ఎలాంటి ఆర్థిక సమస్యలూ, ఆరోగ్య సమస్యలూ లేకున్నా, ఒక్కోసారి ఏ అర్ధరాత్రి వేళలోనో గాఢనిద్రలో వచ్చే పీడకలలకు ఉలిక్కిపడి హఠాత్తుగా మేలుకుంటారు. ఇక ఆ తర్వాత నిద్రపట్టడమే గగనమవుతుంది. పీడకలలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే...
♦ మీకు అనుకూల నక్షత్రం చూసుకుని, ఏదైనా మంగళవారం రోజున మొదలుపెట్టి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించండి. ప్రతిరోజూ నిత్య పూజలో భాగంగా ఈ పఠనం సాగించండి.
♦ మహామృత్యుంజయ యంత్రాన్ని తాయెత్తులో భద్రపరచి, దానిని ఏదైనా శనివారం రోజున నల్లదారంతో మెడలో ధరించండి.
♦ ఉదయం, సాయంత్రం ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి. ప్రతిరోజూ నిత్యపూజలో భాగంగా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించండి.
♦ పీడకలలకు పెద్దలే ఉలిక్కిపడతారు. పిల్లలకు ఇలాంటి అనుభవం ఎదురైతే మరింతగా భయాందోళనలు చెందుతారు. అలాంటప్పుడు పిల్లల తల వద్ద చిన్న పటిక ముక్కను ఉంచి వారిని నిద్రపుచ్చండి. వారు నిద్రలోకి జారుకుంటుండగా ఆంజనేయ దండకాన్ని పఠించండి.
♦ పిల్లలు పీడకలలో ఇబ్బంది పడుతుంటే, ఏదైనా మంగళవారం రోజున ఆంజనేయుడి ఆలయంలో అర్చన జరిపించండి. సంజీవని పర్వతం మోస్తున్నట్లుగా ఉండే ఆంజనేయుని వెండి లాకెట్‌ను పిల్లల మెడలో వేయండి.
– పన్యాల జగ న్నాథదాసు