badminton singles
-
ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విజేత తన్వీ పత్రి
ఆద్యంతం నిలకడగా ఆడిన భారత టీనేజ్ షట్లర్ తన్వీ పత్రి ఆసియా అండర్–15 బ్యాడ్మింటన్ బాలికల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. చైనాలోని చెంగ్డూ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ఒడిశాకు చెందిన 13 ఏళ్ల తన్వీ వరుస గేముల్లో గెలిచింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన తన్వీ తుది పోరులో 22–20, 21–11తో రెండో సీడ్ థి థు హుయెన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచిన క్రమంలో తన్వీ టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ గెలుపుతో ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా తన్వీ గుర్తింపు పొందింది.2017లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ, 2019లో గుజరాత్ అమ్మాయి తస్నీమ్ మీర్ ఈ ఘనత సాధించారు. ఇదే టోర్నీలో బాలుర అండర్–17 సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ ప్లేయర్ జ్ఞాన దత్తు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించాడు. -
Singapore Open 2022: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూసుకుపోతుంది. శనివారం (జులై 16) జరిగిన సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ 38వ ర్యాంకర్ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెట్ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిల్స్ (సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్) సాధించిన సింధు.. సింగపూర్ ఓపెన్ గెలిచి తొలి సూపర్ 500 టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కెరీర్లో దాదాపు అన్ని సూపర్ 500 టైటిల్స్ సాధించిన సింధు సింగపూర్ ఓపెన్ మాత్రం గెలవలేకపోయింది. దీంతో సింధు ఈసారి ఎలాగైనా ఈ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుత టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సహచర షట్లర్ సైనా నెహ్వాల్ ప్రొఫెషనల్‌గా మారకముందే 2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది. చదవండి: Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు -
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారత షట్లర్‌కు సాధ్యంకాని ఫీట్ నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సెమీస్ లో జపాన్ ప్లేయర్ ఒకుహారపై 21-19, 21-10 తేడాతో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు వరుస గేమ్ లను గెలుచుకుని మ్యాచ్ నెగ్గింది. సింధు అద్భుత ఆటతీరుతో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తనకు అధికంగా పాయింట్లు సాధించిపెట్టే స్మాష్ షాట్లతో సింధు చెలరేగి పాయింట్లు సాధించింది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు, ఒకుహార నువ్వానేనా అనేలా పోటీపడి మరీ పాయింట్లు సాధించారు. అయితే సింధు స్మాష్ లతో విరుచుకుపడి తొలి గేమ్ ను 30 నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. రెండో గేమ్ లో సింధు జోరును ఒకుహార అడ్డుకోలేకపోయింది. ఓ దశలో 10-10 స్కోరుతో ఉన్న సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ అక్కడి నుంచి ప్రత్యర్థికి మరో పాయింట్ ఇవ్వకుండా మట్టికరిపించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ తో స్వర్ణ పతకం పోరులో తలపడనుంది. కంగ్రాట్స్ సింధు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ప్రవేశించిన పీవీ సింధుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. సెమీఫైనల్ పోరులో సింధు అత్యుత్తమ ఆటతీరు కనబరిచారని వైఎస్ జగన్ తన ట్వీట్ లో కొనియాడారు. కరోలినా మారిన్‌తో జరిగే ఫైనల్ పోరులో సింధు స్వర్ణం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. Congratulations @Pvsindhu1. Amazing performance. Go for gold. #Rio2016 — YS Jagan Mohan Reddy (@ysjagan) 18 August 2016