Bail extension
-
కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను మరో వారం పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని బుధవారం ఉదయం స్పష్టం చేసింది.లిక్కర్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు ఇదివరకే అనుమతి లభించింది. అందుకే ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ చెల్లదని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అంతకు ముందు.. మంగళవారం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనకు సైతం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ ముందుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ, దిగువ కోర్టులో బెయిల్ వేసేందుకు అనుమతి ఉండడంతో.. సుప్రీం విచారణ చేపట్టమని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై జ్యుడీషియల్ రిమాండ్ కింద ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ తరఫున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. జూన్ 1వరకు బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.కానీ, ఈలోపే ఆరోగ్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని ఆయన మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్లో కోరారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. అయితే.. మంగళవారం విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు గత వారం ఈ అభ్యర్థనను ఎందుకు ప్రస్తావించలేదని ఆప్ నేత తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని వెకేషన్ బెంచ్ ప్రశ్నించింది. ‘ఈ పిటిషన్‌పై సీజేఐ నిర్ణయం తీసుకోవడమే సముచితం. ఆయన వద్దకు దీనిని పంపిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్‌కు ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్న వైద్యుడి సూచనలు రెండు రోజుల క్రితమే అందినందున జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదని సింఘ్వి వెకేషన్ బెంచ్‌కు తెలిపారు. వర్చువల్ విధానంలో అయినా సరే ఆ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తామంటే అభ్యంతరం లేదని సింఘ్వి వాదించారు. ప్రధాన పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉన్నందున బెయిల్ పొడిగింపు అభ్యర్థన లిస్టింగ్‌పై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ జె.కె.మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బెయిల్
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేశారు. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను దోషిగా తేల్చూతు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. అలాగే తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కూడా కొట్టివేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. రాహుల్ గాంధీ ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను అదే రోజు చేపడతామని చెప్పింది. దీంతో తీర్పుపై స్టే వస్తుందనుకున్న రాహుల్‌కు నిరాశే ఎదురైంది. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు తీర్పుపై స్టే విధిస్తే ఆయనపై ఎంపీగా అనర్హత వేటు తాత్కాలికంగా తొలగిపోనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. సూరత్ కోర్టకు రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వెళ్లారు. ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు కూడా రాహుల్‌తో పాటు ఉన్నారు. #WATCH | Gujarat: Congress leader Rahul Gandhi, accompanied by senior Congress leaders and CMs arrives in Surat. pic.twitter.com/jNbFe1KF8u — ANI (@ANI) April 3, 2023 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయనకు సంఘీభావం తెలిపాయి. చదవండి: కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడ్డ నాయకులు.. -
విజయ్ మాల్యాకు బెయిల్ పొడిగింపు
లండన్: దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు యూకే న్యాయస్థానం బెయిల్‌ను పొడిగించింది. ఏప్రిల్ 2 వరకు తాజా బెయిల్ పొడిగింపు వర్తిస్తుందని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. గురువారం సాయంత్రం ఈ కేసులో చివరి వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ డిఫెన్స్ లాయరు.. భారత ప్రభుత్వం కేసును కొట్టేయాలని డిమాండ్ చేయటంతో ఎటూ తేలకుండానే కేసు వాయిదా పడింది. భారత ప్రభుత్వం ఇచ్చిన సాక్ష్యాధారాలు అంగీకారయోగ్యంగా లేవంటూ మాల్యా తరపు న్యాయవాది వాదించారు. అయితే కేసు తర్వాతి విచారణ ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టం కాకపోయినా మూడు వారాల తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 2017లో దేశద్రోహం కేసులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
నిర్దోషినని నిరూపిస్తా
అందుకు తగిన ఆధారాలున్నాయన్న విజయ్ మాల్యా ► నేరస్తుల అప్పగింత కేసులో లండన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు ► రుణాల్ని మళ్లించలేదని వివరణ ► డిసెంబర్ 4 వరకూ బెయిల్ పొడిగింపు.. విచారణ జూలై 6కి వాయిదా లండన్: తనను నిర్దోషిగా పేర్కొంటూ రుణ ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి మొండివాదన కొనసాగించారు. అందుకు తన వద్ద తగినన్ని ఆధారాలున్నాయని, కోర్టులో అవే సమాధానం చెబుతాయంటూ భారత్‌కు సవాలు విసిరే ప్రయత్నం చేశారు. నేరస్తుల అప్పగింత కేసులో మంగళవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు మాల్యా హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తనపై మోపిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఆధారాలు లేకుండా నేరస్తుడిగా నిరూపించలేరంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. భారత్‌లో బ్యాంకులకు రూ.9 వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను నేరస్తుల అప్పగింతలో భాగంగా స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మాల్యా హాజరైన కొద్దిసేపటికే విచారణను కోర్టు జూలై 6కి వాయిదావేసింది. ఈ సందర్భంగా అతని బెయిల్‌ను డిసెంబర్ 4 వరకూ పొడిగించింది. అనంతరం కోర్టు వెలుపల మాల్యా మాట్లాడుతూ.. ‘నేను ఏ కోర్టు నుంచి తప్పించుకుని తిరగడం లేదు. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలున్నాయి. మీడియాకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వను. ఎందుకంటే ఏం చెప్పినా దానిని వక్రీకరిస్తా’రని పేర్కొన్నారు. భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ వాదనలు ఈ కేసులో భారత అధికారుల తరఫున బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) వాదనలు వినిపిస్తోంది. గత నెల్లో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఉమ్మడి బృందం లండన్‌లో సీపీఎస్ అధికారుల్ని కలుసుకుని కేసు పూర్వాపరాలపై చర్చించింది. మంగళవారం జరిగిన కేసు విచారణకు ఢిల్లీ నుంచి సీబీఐ అధికారి కూడా హాజరయ్యారు. నిజానికి ఈ కేసు విచారణ మే 17నే జరగాల్సి ఉండగా.. జూన్ 13కు వాయిదా వేశారు. తుది విచారణలో మాల్యా అప్పగింతకు అనుకూలంగా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిస్తే.. అప్పగింతకు సంబంధించి రెండు నెలల్లోపు బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీచేయాలి. అయితే తీర్పుపై మాల్యా పైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చు. ఈ కేసులో ప్రముఖ క్రిమినల్ న్యాయవాది క్లేర్ మాంట్గోమెరీ మాల్యా తరఫున వాదనలు వినిపిస్తుండగా... సీపీఎస్ నేరస్తుల అప్పగింత విభాగం, భారత ప్రభుత్వం తరఫున మరో ప్రముఖ న్యాయవాది మార్క్ సమ్మర్స్ వాదిస్తున్నారు. ప్రాథమిక విచారణ పూర్తయ్యాకే అప్పగింతపై వాదనలు మెజిస్ట్రేట్ కోర్టులో ప్రాథమిక విచారణ పూర్తయ్యాకే నేరస్తుల అప్పగింతపై తుది విచారణ నిర్వహిస్తారు. తుది తీర్పుకు అనుగుణంగా నేరస్తుడ్ని అప్పగించాలా? వద్దా? అన్న అంశాన్ని విదేశాంగ శాఖ నిర్ణయిస్తుంది. అనంతరం మాల్యాను అప్పగించాలంటూ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు మరోసారి భారత్ విజ్ఞప్తి చేయాలి. అప్పుడు అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది.భారత్ ఒత్తిడి మేరకు ఏప్రిల్ 18న లండన్‌లో మాల్యాను అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో అతన్ని హాజరుపర్చగా బెయిల్‌పై విడుదలయ్యారు. మాల్యాపై అనేక నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ అవడంతో 2016లో లండన్ పారిపోయారు. అంత సులువు కాదు: వీకే సింగ్ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని, నేరస్తుల అప్పగింత అంత సులువుకాదని ఆయన పేర్కొన్నారు. అందుకే మ్యాచ్‌కు వెళ్లా తాను భారత జట్టును ఉత్సాహాపరిచేందుకు క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లానని, అయితే మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. ‘తాగిన మత్తులో ఇద్దరు దొంగ అని పిలిచారు. అయితే చాలామంది నన్ను మంచిగా పలకరించార’ని ఓవల్ క్రికెట్ మైదానం బయట ఘటనపై మాల్యా వివరణ ఇచ్చారు. ‘ వేలకోట్ల కోసం కలల్ని మీరు కొనసాగించవచ్చు. అయితే ఆధారాలు లేకుండా ఏమీ నిరూపించలేరు’ అని వ్యాఖానించారు. వేలకోట్ల బ్యాంకు రుణాల్ని తాను ఎక్కడికీ మళ్లించలేదన్నారు. విజయ్ మాల్యా తరఫున కేసు బాధ్యతలు చూస్తున్న జోసెఫ్ హేగ్ అరన్సన్ న్యాయ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. నేరస్తుల అప్పగింతపై భారత ప్రభుత్వం మరోసారి బ్రిటన్‌కు విజ్ఞప్తి చేయవచ్చన్నారు.