balasaheb thorat
-
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. సీఎల్పీ నేత థోరట్ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తీరును నిరసిస్తూ సీఎల్పీ నేత బాలా సాహెబ్ థోరట్ తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ పంపారు. నానా పటోలే తనను అవమానాలకు గురి చేస్తున్నారని, తాను బీజేపీలో చేరుబోతున్నాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని థోరట్ ఆరోపించారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ సమావేశాలకు ముందు తనను సంప్రదించడం లేదని తెలిపారు. మహారాష్ట్రలో ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా నానా పటోలే, థోరట్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. థోరట్ బంధువు సత్యజీత్ తాంబేకు టికెట్ కేటాయించకుండా అతని తండ్రి సుధీర్ తాంబేకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో సత్యజీత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు తన కొడుకు పోటీలో ఉండటంతో చివరి నిమిషంలో సుధీర్ తాంబే నామినేషన్ సమర్పించలేదు. దీంతో తండ్రీకొడుకులను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే వీరిద్దరికీ థోరట్ మద్దతుగా నిలిచారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నానా పటోలే ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి థోరట్ను లక్ష్యంగా చేసుకున్నారని సత్యజీత్ తాంబే ఆరోపించారు. వారంతా పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పారు. చదవండి: అదానీ వ్యవహారం: బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్ -
Maharashtra: శివసేనకు కాంగ్రెస్ సెగ!
సాక్షి, ముంబై: రాష్ట్ర విధాన పరిషత్‌లో సంఖ్యాబలం దృష్ట్యా ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలంటూ ఒకపక్క శివసేన డిమాండ్ చేస్తుంటే మరోపక్క ఆ పదవి తమకే కావాలంటూ కాంగ్రెస్ కూడా పట్టుబడుతోంది. దీంతో ఈ పదవిపై చట్టపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కీలకమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరాత్ త్వరలో శివసేన, ఎన్సీపీ నేతలతో చర్చిస్తారని ఇరు పార్టీల నేతలు తెలిపారు. శివసేన నేత ఏక్నాథ్ శిండే 40 మందికిపైగా ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమా ణ స్వీకారం చేశారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తరువాత రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన విధాన్ పరిషత్‌లో తమ పైచేయి చాటుకునేందుకు ప్రతిపక్ష నేత పదవిపై కన్నెసింది. ముఖ్యంగా విధాన పరిషత్‌లో కాంగ్రెస్, ఎన్సీపీతో పోలిస్తే శివ సేనకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది. దీంతో ప్రతిపక్ష నేత పదవి కోసం పట్టుబట్టేందుకు శివసేనకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇరు పార్టీల కంటే శివసేనకు 13 మంది ఎమ్మెల్సీల సంఖ్యా బ లం ఎక్కువ ఉంది. దీంతో విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కానీ ఆ పదవిపై కాంగ్రెస్ కూడా కన్నేయడంతో మహావికాస్ ఆఘాడి నేతల మధ్య విభేదాలు పొడచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: ఉద్ధవ్ ఠాక్రేకు దెబ్బమీద దెబ్బ.. శివసేనకు కదం ‘రాంరాం’ ఇదిలాఉండగా ఇదివరకు ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఏక్నాథ్ శిండే తిరుగుబాటు చేయడంతో రెండుగా చీలిపోయింది. దీంతో శివసేనకు చెందిన ఏక్నాథ్ శిండే ముఖ్యమంత్రి పదవిలో, విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవిలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నేత కూర్చోవడం కొంత అసహనంగా మారనుంది. అంతేగాకుండా అధికారంలో శివసేన, ప్రతిపక్షంలో శివసేన అనే ధోరణిగా మారనుంది. దీంతో కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు నానా పటోలే ప్రతిపక్ష నేత పదవి కాంగ్రెస్‌కే దక్కాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై శివసేన ఎలా స్పందిస్తుంది..? నానా పటోలే ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారనే దానిపై అందరూ దృష్టి సారించారు. -
Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్
Shiv Sena leader Uddhav Thackeray.. మహారాష్ట్రలో పొలిటికల్ వాతావరణం ఇంకా చల్లబడలేదు. బీజేపీ మద్దతుగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉద్ధవ్ థాక్రేకు మరోసారి ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు తెలపడం మహా వికాస్ అఘడి (ఎంవీఏ)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెట్ థోరట్.. శివసేనసై సంచలన విమర్శలు చేశారు. కాగా, బాలాసాహెబ్ ట్విట్టర్ వేదికగా.. శివసేన ఎందుకు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇచ్చే ముందు ఎందుకు ఎంవీఏ కూటమితో చర్చించలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ అప్రజాస్వామిక పద్ధతిలో మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్‌ను కూల్చి, శివసేన ఉనికినే సవాల్ చేసిన బీజేపీ కూటమికి రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. మరో అడుగు ముందుకేసి.. రాష్ట్రపతి ఎన్నిక భిన్న సిద్ధాంతాల మధ్య పోరుగా మారిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం కోసం సాగుతోందని అన్నారు. అంతా వారి ఇష్టమేనా(శివసేన) అని పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. శివసేన వైఖరిపై అటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే విషయంలో ఎంవీఏకు శివసేన ముందస్తు సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా, మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యంతో(ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. राष्ट्रपती पदाची निवडणूक ही वैचारिक लढाई आहे. लोकशाही आणि संविधान रक्षणासाठी सुरू असलेला हा संघर्ष आहे. स्त्री, पुरुष किंवा आदिवासी, बिगर आदिवासी अशी ही लढाई नाही. जे संविधान आणि लोकशाहीच्या संरक्षणाच्या बाजूने आहेत ते सर्व यशवंत सिन्हा यांना पाठिंबा देत आहेत. pic.twitter.com/LSykyJ0b6L — Balasaheb Thorat (@bb_thorat) July 12, 2022 -
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ అప్పుడే..
ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 30న జరిగే అవకాశమున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు దాదాపు 36 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆ వర్గాల అంచనా. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మంత్రివర్గంలో ఆరుగురు సభ్యులున్నారు. ముంబైలోని విధాన్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్న తెలుస్తోంది. విస్తరణలో కాంగ్రెస్ తరఫున మంత్రులయ్యే వారి జాబితా సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ గురువారం వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ ఈ వారంలోనే జరగాల్సి ఉండగా... వచ్చే వారానికి వాయిదాపడేందుకు కారణమేమిటన్న ప్రశ్నకు థోరట్ సమాధానమిస్తూ.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం రాష్ట్రపాలన వ్యవస్థ మొత్తం గతవారం వరకూ నాగ్‌పూర్‌లో ఉందని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి అధికారం దక్కించుకోవడం తెల్సిందే. అధికార పంపిణీలో భాగంగా శివసేనకు 16 మంత్రివర్గ స్థానాలు దక్కనుండగా, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 స్థానాలు లభించనున్నాయి. (చదవండి: కొత్తమలుపులో శివసేన రాజకీయం) -
శివసేనతో ‘చేయి’ కలపం: ఎన్సీపీ
ముంబై: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు శివసేనతో చేతులు కలపబోమని శుక్రవారం కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. తమను విపక్షంలో కూర్చోమన్న ప్రజా తీర్పును శిరసావహిస్తామని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ పేర్కొన్నారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతివ్వాలన్న ఆలోచన కానీ ప్రతిపాదన కానీ లేదని చెప్పారు. ఒకవేళ మద్దతు కోరుతూ శివసేన తమ వద్దకు వస్తే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. శివసేనతో పొత్తు వార్తను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో.. అధికార పంపిణీ విషయంలో మిత్రపక్షం శివసేన 50:50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన ముందుకు తెచ్చింది. బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం.. గురువారం వెలువడిన ఎన్నికల పలితాల్లో బీజేపీ సత్తా చాటినప్పటికీ గతంతో పోలిస్తే ఓటుశాతం తగ్గింది. తమ మిత్రపార్టీతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైనా.. ఓటు షేర్ మాత్రం కోల్పోయింది. 2014లో బీజేపీ పోటీ చేసిన 260 సీట్లలో 122 స్థానాల్లో విజయం సాధించగా, పస్తుతం ఆ సంఖ్య 105కు పడిపోయింది. గతంలో 27.8 శాతంగా ఉన్న బీజేపీ ఓటు షేరు రెండు శాతం కోల్పోయి 25.7తో ఆగిపోయింది. శివసేన ప్రస్తుతం 56 సీట్లు సాధించింది. అయితే ఓటు షేరు మాత్రం 2.9 శాతం కోల్పోయింది. ఎన్సీపీ ఓటు షేరు గతంలో 17.2 శాతం ఉండగా ప్రస్తుతం 16.7శాతానికి తగ్గింది. గతంలో 41 సీట్లు గెలుచుకోగా ఇప్పుడు 54 సీట్లు సాధించింది. కాంగ్రెస్ గతంలో 18 శాతం ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడది 15.9కి పడిపోయింది. అయితే సీట్ల సంఖ్యను మాత్రం 42 నుంచి 44కు పెంచుకుంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన 2.3 శాతం ఓటు షేరును సాధించింది. తొలి ప్రయత్నంలోనే... నాగ్‌పూర్: ఈఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అభ్యర్థులు కూడా సత్తా చూపారు. మొత్తం 12 స్థానాల్లో మొదటిసారి బరిలో దిగిన అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. అందులో కొందరు సీనియర్ నేతలపై విజయం సాధించారు. -
మంత్రిపై సిరా దాడి
సాక్షి ముంబై: అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం అహ్మదనగర్ జిల్లా సంగమ్‌నేర్‌కు వెళ్లిన రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కొందరు వ్యక్తులు సిరా (ఇంక్)చల్లారు. వీరిలో ఒకడైన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరా చల్లినవారందరూ శివసేన కార్యకర్తలేనని తెలిసింది. అయితే వీళ్లు మంత్రిపై ఎందుకు సిరా చల్లారనే విషయం స్పష్టంకాలేదు. సంగమ్నేర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు థోరట్ శనివారం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ధన్‌గార్ వర్గానికి చెందిన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసే థోరట్‌పై సిరా చల్లారు. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ధన్‌గార్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆందోళనకు దిగిన థోరట్ మద్దతుదారులు.. బాలాసాహెబ్ థోరట్‌పై సిరా చల్లారని తెలుసుకున్న ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. సంగమ్నేర్ తాలుకాలో అనేక రోడ్లపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు. మరోవైపు స్థానిక శివసేన కార్యాలయాలపై దాడులు జరిపారు. కార్యాలయాల్లోని అనేక వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో సంగమ్నేర్ తాలూకాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతంగా ఉండండి: థోరట్ సిరా చల్లిన ఘటనపై మంత్రి స్పందిస్తూ ఆందోళనకు దిగిన కార్యకర్తలంతా శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ఘటన అని, ఇంత పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు.