బాల్‌బ్యాడ్మింటన్ జిల్లాజట్ల ఎంపిక
భువనగిరి టౌన్ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా అండర్–19 క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.దయాకర్‌రెడ్డి సమక్షంలో బాల్‌బ్యాడ్మింటన్ జిల్లా బాలికలు, బాలుర జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శాగంటి శ్రీనివాస్, పీడీలు జి.సోమనర్సయ్య, సాంబశివరావు, అప్పారావు, టి.మల్లయ్య, శ్రీనివాసులు, వీరయ్య, తదితరులు ఉన్నారు.
బాలుర జట్టుకు ఎంపికైన విద్యార్థులు
ఎం.శ్రీను, వంశీకృష్ణ (నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.నవీన్(భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.సందీప్( చౌటుప్పుల్ మేధా కశాశాల), జి.నరేష్, పి.శంకర్(టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ రాజాపేట).
బాలికల జట్టుకు.. : బి.కావేరి(నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల), బి.లావణ్య, కె.మమత, కె.లతశ్రీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ తుంగత్తురి) ఎంపికయ్యారు.