పాక్కు మళ్లీ షాక్.. చైనాకు ఝలక్
కరాచీ: పాకిస్థాన్లో బలూచిస్తాన్ పౌరుల ఉద్యమ పోరు ఉధృతం అవుతోంది. తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ వారు ఆందోళన తీవ్ర తరం చేస్తున్నారు. దీనికి ప్రపంచ దేశాలు మద్దతివ్వాలని అడగడమే కాకుండా తమ ఆకాంక్షను పట్టించుకోకుండా పాక్ తో సంబంధాలు పెట్టుకునే దేశాలకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఆదివారం పలువురు బలూచిస్తాన్ వాసులు చైనాకు వ్యతిరేకంగా క్వెట్టా ప్రాంతంలో ఆందోళనకు దిగారు.
తమ నిరసనలు పట్టించుకోకుండా పాక్ తో ఒప్పందాలకు దిగడం తమ హక్కులను ఉల్లంఘించడమేనంటూ పలువురు బలూచ్ వాసులు పాక్కు, చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బలూచిస్తాన్ లో చైనా జోక్యాన్ని తాము సహించబోమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వెట్టా అనేది చైనా పాక్ కు మధ్య ఉన్న ఎకనామికల్ కారిడార్. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా పాక్ తో చేతులు కలపడాన్ని అంగీకరించబోమంటూ వారు నినదిస్తున్నారు. ఇరు దేశాల నేతల దిష్టిబొమ్మలు తగులబెట్టారు.