మద్యం అమ్మకాలు నిషేధించిన సింగపూర్
సింగపూర్: అల్లర్లు జరిగిన ప్రాంతంలో మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని సింగపూర్ నిషేధించింది. రోడ్డు ప్రమాదంలో భారతీయుడు మృతి చెందడంతో ఆదివారం రాత్రి హాంషేర్ పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్‌కోర్స్‌లో అల్లర్లు చెలరేగాయి. దీంతో అక్కడ ఈ వారాంతంలో మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని నిషేధిస్తున్నట్టు హోం వ్యవహారాల శాఖ సెకండ్ మినిస్టర్ ఎస్ ఈశ్వరన్ ప్రకటించారు.
అయితే ఈ నిషేధం ఏ సమయం నుంచి అమలవుతుంది, ఏ ప్రాంతం వరకు ఉంటుందనేది పోలీసులు నిర్ధారిస్తారని ఆయన పేర్కొన్నారు. అల్లర్లకు కారణం ఏమిటనేది ఎప్పుడే ఇప్పడు చెప్పలేమన్నారు. మద్యం మత్తులో ఆందోళనకారులు అల్లరకు దిగారని ప్రభుత్వం అనుమానిస్తోంది.
హాంషేర్ పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్‌కోర్స్‌లో ప్రైవేటు బస్సు ఢీకొట్టడడంతో భారత్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు, తమిళనాడువాసి కురవేలు(33) మృతి చెందడడంతో 400 మంది ఆందోళనకు దిగారు. ఆగ్రహించిన స్థానిక భారతీయులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై దాడి చేయడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. 10 మంది పోలీసులతోసహా 18 మందికి ఈ ఘటనలో గాయాలయ్యాయి. 16 వాహనాలు ధ్వంసమయ్యాయి.