Banana farmers
-
‘సిగటోక’ చిత్తవ్వాలిక.. నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: అరటి పంటలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (సీడీపీ)ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్బీకే స్థాయిలో ఆగస్టు 2వ తేదీ నుంచి రైతులకు అవగాహన ఉద్యమం చేపట్టబోతోంది. రాష్టంలో 2.45 లక్షల ఎకరాల్లో అరటి పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణం వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గ్రాండ్ నైన్ (జీ–9 పొట్టి పచ్చ అరటి), టిష్యూ కల్చర్ రకాలు సాగవుతుంటే.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్పూరం, చక్కరకేళి వంటి రకాలు సాగవుతుంటాయి. రాయలసీమలో సాగయ్యే రకాలకే విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఈ ఏడాది కనీసం 65 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 48 వేల టన్నులు ఎగుమతి చేయగా.. ఈ ఏడాది 55 వేల టన్నుల అరటిని ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆందోళన కలిగిస్తున్న సిగటోక తెగులు గతంలో గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే అరటి రకాలకు సోకే సిగటోక (ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, పొగాకు తెగులు) ఇప్పుడు రాయలసీమలోనూ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్లుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ తెగులు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మొక్క దశలో ఉన్న జీ–9, టిష్యూ కల్చర్ అరటి రకాలకు ఈ తెగులు సోకుతోంది. వాతావరణంలో తేమ 90 శాతం కన్నా అధికంగా ఉండి, ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీలు వరకు ఉన్నప్పుడు, అరటి ఆకులు 6 నుంచి 10 గంటల పాటు తడిగా ఉన్నప్పుడు ఈ తెగులు సోకుతుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల సోకే ఈ తెగులు వల్ల ఆకులపై తొలుత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజుల్లోనే అవి బూడిద రంగులోకి.. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గోధుమ రంగులోకి మారి ఒక దానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఇలా జరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పచ్చదనం లేక కాయసైజు, నాణ్యత తగ్గిపోవడంతోపాటు గెలలు పక్వానికి రాకముందే పండిపోతాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఆగస్టు 2వ తేదీ నుంచి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నెల రోజుల పాటు అరటి పండించే ప్రతి గ్రామంలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ తెగులు సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సోకితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతుకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ.. అరటి తోటలో కలుపు లేకుండా.. నీరు నిలబడకుండా చూసుకోవాలి. సిఫార్సు చేసిన దూరంలో అంటే జీ–9 రకాన్ని 1.8 ఇన్‌టూ 1.8 మీటర్ల దూరంలోనూ, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి, కర్పూర చక్కెరకేళి వంటి రకాలను 2 ఇన్‌టూ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. తల్లి మొక్క చుట్టూ వచ్చే పిలకలను, మొక్క చుట్టూ ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. ట్రైకోడెర్మావిరిడి లేదా సూడోమోనాస్ లేదా బాసిల్లస్ వంటి జీవ శిలీంధ్రాలను వేపనూనెతో కలిపి పాదులు, చెట్టు ఆకులు మొత్తం తడిసేలా 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. నివారణా చర్యలు సిగటోక తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొపికోనజోల్ (1 ఎంఎల్), మినరల్ ఆయిల్ (10 ఎంఎల్)ను లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, ఉధృతి అధికంగా ఉంటే 5–7 సార్లు చేయాలి. గెలలు కోయడానికి 45 రోజుల ముందుగా ఎలాంటి మందులను పిచికారీ చేయకూడదు. మొదటి పిచికారీలో ప్రోపికోనజోల్ (1ఎంఎల్–లీటర్ నీటికి)ను, రెండో పిచికారీలో కార్బండిజమ్, మాంకోజబ్ (1 గ్రాము/లీటర్ నీటికి), మూడో పిచికారిలో ట్రైప్లోక్సిస్ట్రోబిన్, టేబ్యుకోనజోల్ మిశ్రమ మందు (1.4 గ్రా./లీటర్ నీటికి), నాలుగో పిచికారీలో డైపాన్కొనజోల్ (1ఎం.ఎల్/లీటర్ నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇదీ చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి -
అరటి సాగు.. రైతన్నలకు కాసుల వర్షం
రాజంపేట టౌన్: అరటి సాగు అనగానే రైతులకు, ప్రజలకు ఠక్కున గుర్తుకు వచ్చేది అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు. అనాదిగా ఈ నియోజకవర్గాల్లోని రైతులు అధికంగా అరటి సాగుచేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రస్తుతం ఉన్న ధరలు ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం టన్ను (బాక్సుల్లో ఎగుమతి చేసేవి ) 18వేల రూపాయలకు పైగా ధర పలుకుతుంది. ఈ విధానంలో ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు ఖర్చులు పోను పది లక్షల రూపాయల వరకు లాభాలను అర్జిస్తున్నారు. అలాగే గెలలతో ఎగుమతి చేసే అరటి 16వేల రూపాయిలకు పైగా ధర పలుకుతోంది. ఈ విధానంలో అరటిని ఎగుమతి చేసే రైతులు హెక్టారుకు తొమ్మిది లక్షల రూపాయలకు పైగా లాభాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉంటే 2017వ సంవత్సరంలో ఇలాంటి ధరలే పలికాయి. అనంతరం ఇంతటి ధర ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేక పోవడంతో రైతులకు లాభాలు అంతంత మాత్రమే ఉండేవి. హెక్టారుకు డెబ్బై టన్నుల దిగుబడి ఈ ఏడాది అరటి దిగుబడి కూడా ఆశాజనకంగా ఉంది. హెక్టారుకు దాదాపు 70 టన్నుల దిగుబడి వచ్చింది. ఫలితంగా రైతులు ఘననీయంగానే ఆదాయం పొందుతున్నారు. ఒక హెక్టారు అరటి పంట సాగు చేసేందుకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఇందువల్ల టన్ను 18 వేలకు విక్రయించే వారికి ఖర్చులు పోను పది లక్షలకు పైగా, 16వేలకు విక్రయించే రైతులకు తొమ్మిది లక్షలకు పైగా మిగులుతుంది. ప్రస్తుతం పచ్చఅరటి, అమృతపాణి, కర్పూర చక్కర కేలి, సుగంధాల రకాల అరటిని రైతులు కోస్తున్నారు. ధర పెరుగుదల ఎందుకంటే..... అరటి పిలకలను పూడ్చిన తర్వాత ఏడాదికి పంట చేతికి వస్తుంది. గత ఏడాది మే నెలలో వేసిన పంట ఇప్పుడు చేతికి వచ్చింది. అయితే గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో సంభవించిన భారీ వరదలకు అనేక మందికి చెందిన అరటి తోటలు వరల ధాటికి కొట్టుకు పోయాయి. ఫలితంగా పంట భారీగా తగ్గింది. ప్రస్తుతం అమాంతంగా పెరిగిన ధరలకు పంట తక్కువగా ఉండటమేనని రైతులు అంటున్నారు. అస్సలు ఊహించలేదు ప్రస్తుతం అరటి పంటకు ఉన్న ధరను అసలు ఊహించలేదు. నేను పదకొండు ఎకరాల్లో అరటి సాగుచేశాను. వరదలకు నా పంట దెబ్బతినలేదు. ప్రస్తుతం ఉన్న ధరకు నాకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆదాయం వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. – ముక్కా చెంగల్‌రెడ్డి, రైతు, కొర్లకుంట, ఓబులవారిపల్లె మండలం ఐదు రాష్ట్రాలకు ఎగుమతి రాజంపేట, రైల్వేకోడూరు నియోజవర్గాల్లోని రైతులు పండించే అరటి నాణ్యత ఉంటుంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. వ్యాపారులు పంట కోతకు రావడానికి రెండు నెలల ముందు నుంచే రైతులకు అడ్వాన్సులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతారు. ఈ నియోజకవర్గాలకు చెందిన రైతులు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తమ పంటను ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం చాలామంది రైతులకు చెందిన పంట కోతకు రావడంతో పల్లెసీమల నుంచి జోరుగా అరటి రవాణా సాగుతుంది. -
లాక్‌డౌన్‌తో అరటి రైతులు కష్టాల్లో పడ్డారు
-
వైఎస్ జగన్‌కు కష్టాలు చెప్పుకున్న అరటి రైతులు
-
ఆదుకుంటుందనే నమ్మకంలేదు
♦ సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ అకాల వర్షాలతో నిలువునా నష్టపోయిన అరటి రైతులు ♦ పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటన ♦ అరటి రైతుల దుస్థితి చూసి చలించిపోయిన జననేత సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి. పంట ఏపుగా ఉంది. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఫలసాయం దక్కుతుందని అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా వడగండ్ల వాన రావడం, గంటలో అరటి తోటలు నేలపాలు కావడం జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో మానవత్వంతో రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం రైతులకు లేదు. పంటనష్ట పరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, తుదకు పంటల బీమా సొమ్ము సైతం ఇవ్వకపోవడమే’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కళింగర పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. నేలమట్టమైన అరటితోటల రైతన్నల ఆవేదనను చూసిన ప్రతిపక్ష నేత చలించిపోయారు. నల్లపురెడ్డిపల్లెలో పంటలు పరిశీలిస్తున్న తరుణంలో ఆదినారాయణ అనే రైతు బోరున విలపిస్తూ తన ఆవేదనను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చే పరిహారం తోటలు చదును చేసుకునేందుకు కూడా సరిపోదని తెలిపారు. అకాల వర్షాలు వల్ల అరటి రైతులకు పంట నష్టం సంభవిస్తే కనీసం రూ.50వేలకు పైబడి పరిహారం అందేలా విధివిధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నిలువునా నష్టపోయిన రైతులను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని జగన్ కోరారు. అధికారులు అంచనాలు రూపొందించడం మినహా పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతోనే రైతులకు విపత్తుల పరిహారం అందలేదని ఆరోపించారు. ఇదే విషయమై కలెక్టర్, ముఖ్యమంత్రికి లేఖలు రాయనున్నట్లు తెలిపారు. అవసరమైతే రైతుల పక్షాన ధర్నా సైతం నిర్వహిస్తానని జగన్ చెప్పారు. పర్యటనలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్బాష, కడప మేయర్ కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతన్న వెన్ను విరిచిన గాలివాన
-
అరటి రైతులను ఆదుకుంటాం
మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకా పులివెందుల/రూరల్ : నియోజకవర్గంలోని అరటి రైతులను ఆదుకుంటామని మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం అరటి కాయల వ్యాపారులు, రైతులతో విడివిడిగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పులి వెందుల ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్షల రూపాయ లు పెట్టుబడులు పెట్టి అరటి పంటను సాగు చేస్తున్నారన్నారు. ఢిల్లీ, హర్యానా, జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలలో అకాల వర్షాల కారణంగా ధరలు తగ్గిపోయాయన్నారు. దీంతోపాటు కాయలు ఎక్కువ లారీలు మార్కెట్‌కు వస్తుండటంతో ధర లు తగ్గిన విషయం వాస్తవమేనన్నారు. ట్రాన్స్పోర్ట్ ధరల తగ్గింపు పులివెందుల నుంచి ఢిల్లీకి అరటి కాయలను తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లతో చర్చించి ధరల తగ్గింపునకు చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రైతులకు వివరించారు. పులివెందులనుంచి 16 టన్నులు ట్రాన్స్పోర్ట్కు రూ.55వేలు ఉండగా.. ప్రస్తుతం ఆపరేటర్లు రూ.60వేలనుంచి రూ.65వేలకు పెంచారన్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ ధరను రూ.10వేలు తగ్గించి తీసుకోవడంతో ట న్నుపై రైతుకు రూ.600 పెరిగే అవకాశం ఉందన్నారు. కావున ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు రూ.10వేలు తగ్గించి తీసుకోవాలని మాజీ మంత్రి వై ఎస్ వివేకా సూచించగా.. అందుకు ఆపరేటర్లు సైతం అంగీకరించారు. నేటి నుంచి టన్నుకు రూ.8,500నుంచి రూ.9వేలతో కొనుగోలు అరటి కాయలు టన్ను బుధవారం నుం చి రూ.8,500నుంచి రూ.9వేలతో ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేసేలా వ్యాపారులు, రైతులతో వైఎస్ వివేకానందరెడ్డి చర్చించారు. అనంతరం రైతుల సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. వారం, 10రోజులలో ధరలు మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు.