అరటి రైతులను ఆదుకుంటాం | Banana farmers adukuntam | Sakshi
Sakshi News home page

అరటి రైతులను ఆదుకుంటాం

Published Wed, Mar 18 2015 1:55 AM | Last Updated on Tue, May 29 2018 6:20 PM

Banana farmers adukuntam

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకా
 
పులివెందుల/రూరల్ : నియోజకవర్గంలోని అరటి రైతులను ఆదుకుంటామని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం అరటి కాయల వ్యాపారులు, రైతులతో విడివిడిగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పులి వెందుల ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్షల రూపాయ లు పెట్టుబడులు పెట్టి అరటి పంటను సాగు చేస్తున్నారన్నారు. ఢిల్లీ, హర్యానా, జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలలో అకాల వర్షాల కారణంగా ధరలు తగ్గిపోయాయన్నారు. దీంతోపాటు కాయలు ఎక్కువ లారీలు మార్కెట్‌కు వస్తుండటంతో ధర లు తగ్గిన విషయం వాస్తవమేనన్నారు.  
 
ట్రాన్స్‌పోర్ట్ ధరల తగ్గింపు
 పులివెందుల నుంచి ఢిల్లీకి అరటి కాయలను తీసుకెళ్లే ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లతో చర్చించి ధరల తగ్గింపునకు చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రైతులకు వివరించారు. పులివెందులనుంచి 16 టన్నులు ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.55వేలు ఉండగా.. ప్రస్తుతం ఆపరేటర్లు రూ.60వేలనుంచి రూ.65వేలకు పెంచారన్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌పోర్ట్ ధరను రూ.10వేలు తగ్గించి తీసుకోవడంతో ట న్నుపై రైతుకు రూ.600 పెరిగే అవకాశం ఉందన్నారు. కావున ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు రూ.10వేలు తగ్గించి తీసుకోవాలని మాజీ మంత్రి వై ఎస్ వివేకా సూచించగా.. అందుకు ఆపరేటర్లు సైతం అంగీకరించారు.
 
నేటి నుంచి టన్నుకు రూ.8,500నుంచి రూ.9వేలతో కొనుగోలు
అరటి కాయలు టన్ను బుధవారం నుం చి రూ.8,500నుంచి రూ.9వేలతో ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేసేలా వ్యాపారులు, రైతులతో వైఎస్ వివేకానందరెడ్డి చర్చించారు. అనంతరం రైతుల సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. వారం, 10రోజులలో ధరలు మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement