Banaras Hindu University campus
-
విద్యార్థినికి వేధింపులు.. క్యాంపస్ రణరంగం!
వారణాసి: లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)ను కుదిపేస్తున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సహచర విద్యార్థినులు చేపట్టిన ఆందోళన.. శనివారం రాత్రి హింసాత్మకంగా మారింది. శనివారం రాత్రి క్యాంపస్ గేటు వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కొందరు దుండగులు ప్రజా ఆస్తులను తగలబెట్టి.. రాళ్లు విసరడంతో రంగంలోకి దిగిన పోలీసులు, పారామిలిటరీ బలగాలు విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను కనికరం లేకుండా చితకబాది.. అక్కడి నుంచి చెల్లాచెదురు చేశారు. బాలికల హాస్టల్లోకి ప్రవేశించి మరీ వారిని కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మీడియా ప్రతినిధులకూ గాయాలయ్యాయి. విద్యార్థినులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడం, తరచూ లైంగిక వేధింపులు ఎదురవుతుండటంతో గత శుక్రవారం నుంచి విద్యార్థినులు ఆందోళనలు చేస్తున్నారు. క్యాంపస్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం వారణాసి పర్యటనకు వచ్చినా.. విద్యార్థినులు తమ ఆందోళనను విరమించలేదు. ప్రధాని యూనివర్సిటీకి వస్తే ఆయన దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని భావించారు. క్యాంపస్‌లో విద్యార్థినులకు భద్రత కల్పించాలని, లైంగిక వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థినులు కోరుతున్నారు. -
వారణాసిలో కేజ్రీపై రాళ్లు
పలు చోట్ల ఘెరావ్ వారణాసి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై వారణాసిలో మళ్లీ దాడి జరిగింది. గురువారం రాత్రి ఆయనపై పదిమందికిపైగా యువకులు రాళ్లు, ఇటుకపెళ్లలు విసిరారు. ‘హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ’ అంటూ నినాదాలు చేశారు. అయితే దాడిలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదు. పోలీసులు దుండగులను చెదరగొట్టారు. వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న కేజ్రీవాల్ బెనారస్ హిందూ వర్సిటీ దగ్గర్లోని కేశవ్ పాన్ షాపు వద్ద ప్రచారం చేస్తుండగా ఈ ఉదంతం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ఈ షాపు.. వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరచనున్న కేశవ్ చౌరాసియాది కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శుక్రవారం కూడా వారణాసిలో కేజ్రీవాల్‌ను, ఆప్ నేతలను నిరసనకారులు ఘెరావ్ చేసి, ‘హర్ హర్ మోడీ’ అని నినదించారు. కేజ్రీవాల్ ప్రచారాన్ని బీజేపీ అడ్డుకుంటోందని, దానిపై చర్యలు తీసుకోవాలని ఆప్ ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనికి బీజేపీ స్పందిస్తూ.. కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని, కావాలంటే ఆయనకు తామే రక్షణ కల్పిస్తామంది. తాను బడా స్వార్థపరులతో ఢీకొం టున్నందున ఇలాంటి నిరసనలు అసాధారణమేమీ కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసనకారులు దారితప్పిన యువకులని, వారు తనతో చర్చకు ముందుకు రావాలన్నారు. కాగా, కేజ్రీవాల్‌కు భద్రతపెంచాలని వారణాసి పోలీసులు నిర్ణయించారు. -
కేజ్రీవాల్‌పై రాళ్ల దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా మరో సారి దాడి జరిగింది. వారణాసి నగరం బెనారస్ హిందూ యూనివర్శిటీ సమీపంలో గురువారం రాత్రి ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై ఆగంతకులు రాళ్ల వర్షం కురిపించారు. అనంతరం ఆగంతకులు హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటన అక్కడికి చేరుకుని రాళ్ల దాడి చేసిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అయితే గత నెల 25న వారణాసిలో కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. అనంతరం ఈ నెల 4న కేజ్రీవాల్‌పై దక్షిణ ఢిల్లీలో ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.