Bandarupalli
-
మీరు సోంబేర్లు.. మీకు పోరాట పటిమ లేదు!
రేణిగుంట(తిరుపతి జిల్లా): ‘మీరు సోంబేర్లు.. మీకు పోరాటపటిమ లేదు’ అంటూ వన్నెకుల క్షత్రియులపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు మండలం కోబాక వరకు నారా లోకేశ్ పాదయాత్ర చేశారు. మార్గంమధ్యలో బండారుపల్లి సమీపంలో వన్నెకుల క్షత్రియుల సంఘం నేతలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. లోకేశ్ మాట్లాడుతూ ‘మీరు సోంబేర్లు అబ్బా.. మీకు పోరాటపటిమ లేదు. గట్టిగా నిలదీసి సాధించుకునే మనస్తత్వం లేదు. మేం అధికారంలోకి వస్తే మీకు సామాజికంగా, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే బాధ్యతను తీసుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను నిర్మూలిస్తామని.. 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్ చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ సహా అన్ని పథకాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కోతలు విధిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో సైతం ఏనాడూ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్‌లో లేవన్నారు. అంతకుముందు శ్రీకాళహస్తిలో ముస్లిం, మైనార్టీ నాయకులతో లోకేశ్ సమావేశమయ్యారు. సమావేశంలో టీడీపీ నేతలు బొజ్జల సుధీర్‌రెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి, సత్రవాడ మునిరామయ్య పాల్గొన్నారు. పాదయాత్రకు ప్రజా స్పందన కరువు.. లోకేశ్ పాదయాత్రకు శ్రీకాళహస్తి మండలంలో ప్రజా స్పందన కరువైంది. కొద్ది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్ప స్థానికులు కనిపించలేదు. వార్తల్లో నిలిచేందుకు లోకేశ్ ఇష్టారీతిన నిబంధనలను ఉల్లంఘించారు. తొండమాన్‌పురం వద్ద పోలీసులతో లోకేశ్ వాగ్వాదానికి దిగారు. -
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
ములుగు : నీటితొట్టిలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని బండారుపల్లిలో గురువారం సాయంత్రం జరిగింది. బండారుపల్లికి చెందిన బాలుగు సుమలత, శ్రీనివాస్ దంపతులకు 16 నెలల కుమారుడు సిద్ధు ఉన్నాడు. గురువారం శ్రీనివాస్ బయటికి వెళ్లగా, సుమలత ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. సాయంత్రం 5 గంటల సమయంలో సిద్ధూ ఆడుకుంటూ బయటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి ముందున్న నీటితొట్టిలో ప్రమాదవశాత్తు జారిపడి ఊపిరాడక చనిపోయాడు. సిద్ధూ అలజడి లేకపోవడంతో తల్లి సుమలత ఇంట్లో పరిశీలించింది. కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూడగా అప్పటికే నీటితొట్టిలోపడి ప్రాణాలు వది లి నీటిపై తేలియాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారి సాయంతో బాలుడిని బయటకు తీశారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సిద్ధు అకస్మాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా సిద్ధుకంటే పెద్దవాడైన అక్షిత్(6) అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లేశ్‌యాదవ్ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగుకు సివిల్ ఆస్పత్రికి తరలించారు. పసిబాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బస్సును ఢీకొన్న ఆటో
శ్రీకాళహస్తి: పట్టణంలోని హౌసింగ్ బో ర్డు సమీపంలో శనివారం రాత్రి బస్సును ఆటో ఢీకొనడంతో ఐదుగురు తీవ్రం గా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు ఆటో ప్రయాణికులను ఎక్కించుకుని శ్రీకాళహస్తి నుంచి తొండవునాడు మీదుగా ఏర్పేడు వుండలంలోని బండారుపల్లి గ్రావూనికి బయలుదేరింది. హౌ సింగ్ బోర్డు వద్ద తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న బస్సును ఢీకొంది. శ్రీకాళహస్తి వుండలంలోని టీఎంవీకండ్రిగకు చెందిన జయుంతి(39), పుల్లారెడ్డికండ్రిగకు చెందిన అవుు్మలు(51), రాజయ్యు(55), ఏర్పేడు వుండలానికి చెందిన చెంగల్రాయుల్(45), పట్టణంలోని ప్రాజెక్టు వీధికి చెందిన ఆటో డ్రైవర్ సాధమ్ హుస్సేన్ (34) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 ద్వారా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథవు చికిత్స అనంతరం వారిని వైద్యులు తిరుపతి రూయూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
5 ఏళ్ల బాలికపై టెన్త్ విద్యార్థి అత్యాచారం!
వరంగల్: పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అయిదు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ములుగు మండలం బండారుపల్లి గ్రామం శివారులో ఈ దారుణం జరిగింది. బండారుపల్లి గ్రామ శివారులోని ఇటుక బట్టీల వద్ద విద్యార్థి మహేష్ ఆ బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.