Bangaru Talli
-
‘బంగారు తల్లి’ ఎక్కడ!
ఇంతవరకూ లబ్ధిదారులకు బాండ్లు అందని వైనం ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో లేని సమాచారం రాయవరం/అంబాజీపేట : పుట్టుక నుంచి పట్టా పుచ్చుకునే వర కూ అండగా ఉంటామం టూ ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం దిశానిర్దేశం లేకుండా ఉంది. తెలుపు రేషన్‌కార్డు కలిగిన బడుగు, బలహీనవర్గాల కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డకు ఆసరాగా ఉండేం దుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు బాండ్లు అందలేదు. పథకం ప్రవేశపెట్టిన తీరు ఈ పథకాన్ని 2013 మే ఒకటిన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పుట్టిన చిన్నారులను గుర్తించేందుకు సర్వే చేపట్టి, వివరాలను ఆన్లైన్ చేశారు. బిడ్డకు తొలిదశలో రూ.2,500 ఇవ్వాలని నిర్దేశించారు. తొలి పుట్టిన రోజు మొదలు.. డిగ్రీ పూర్తి చేసే వరకు దశలవారీగా నగదును వారి ఖాతాలో జమచేస్తారు. డిగ్రీ చేతికి రాగానే ప్రభుత్వం లక్ష రూపాయలను జమ చేస్తుంది. పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. తొలి కాన్పులో అమ్మాయి పుట్టి, రెండో కాన్పులో ఇద్దరు అమ్మాయిలు జన్మించినా పథకాన్ని వర్తింపజేయాలి. శాఖ మార్పుతో సందిగ్ధం ఐకేపీ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గతేడాది ్రఏపిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు పథకం బాధ్యతలు అప్పగిస్తూ జీఓ జారీ అయింది. దీంతో లబ్ధిదారులు దరఖాస్తులతో రెండు శాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. తమకు సంబంధం లేదని ఐకేపీ అధికారులు అంటుండగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. అందని బాండ్లు జిల్లాలో ఈ పథకానికి సంబంధించి బాండ్లు ఇప్పటివరకు అందలేదు. రాయవరం మండలంలో 2013 మే నుంచి 2015 ఏప్రిల్ వరకు 469 మంది రిజిస్ట్రేషన్ చేయించారు. 24 మంది ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేకపోయారు. దీంతో 445 మందిలో కేవలం 33 మందికి మాత్రమే బాండ్లు వచ్చాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మొత్తం 1,800 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. దీనిపై ఏపీఎం రవిరాజాను వివరణ కోరగా, రాయవరం మండలంలో లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయాల్సి ఉందన్నారు. త్వరలో జమ కాగలవని పేర్కొన్నారు. -
‘బంగారు తల్లీ’..ఎక్కడున్నావ్?
పిఠాపురం:బాలికా సంరక్షణ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన ‘బంగారుతల్లి’ పథకం జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు. 2013 మే ఒకటి నుంచి ఆడపిల్ల పుడితే ‘బంగారుతల్లి’ పేరిట ఆర్థిక సహాయం అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఆస్పత్రిలో ప్రసవం, ఇతర ఖర్చులకు రూ.2,500, తరువాత టీకాలకు రూ.వెయ్యి, అంగన్వాడీ చదువులకు ఏడాదికి రూ.1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే 6, 7, 8 తరగతులకు ఏడాదికి రూ.2500, తొమ్మిది, పది తరగతులకు ఏడాదికి రూ.3వేలు, ఇంటర్మీడియెట్‌కు ఏడాదికి రూ.3500, గ్రాడ్యుయేషన్‌కు ఏడాదికి రూ.4వేలు దశలవారీగా అందించాలని నిర్దేశించారు. అలాగే బాలికకు 18 సంవత్సరాల అనంతరం ఇంటర్మీడియెట్ తరువాత రూ.55 వేలు, గ్రాడ్యుయేషన్ తరువాత రూ.లక్ష కలిపి ఒక్కో లబ్ధిదారుకు రూ.1.55 లక్షల ఆర్థిక సహాయం అందే విధంగా పథకాన్ని రూపొందించారు. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో ప్రారంభంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. కానీ దరఖాస్తు స్వీకరణే తప్ప ఎటువంటి నిధులూ ఇవ్వలేదు. దీంతో దరఖాస్తులు వేలల్లో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నగారా మోగడంతో పథకం అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికలు పూర్తయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఖాతాలకు జమ కాని సొమ్ములు వాస్తవానికి రెండేళ్లుగా పథకం అమలు పూర్తిగా నిలిచిపోయిందనే చెప్పాలి. 2013 నవంబరు నుంచి మాత్రమే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. జిల్లా గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో సుమారు 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా 4 వేలమందిని ఎంపిక చేశారు. వీరికోసం మొదటి విడతగా రూ.1.10 కోట్లు విడుదల చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. అలాగే జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 1200 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 350 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ అధికార పార్టీ నేతలతో అధికారులు అప్పట్లో బాండ్లు పంపిణీ చేయించారు. సాధారణంగా ఈ పథకం లబ్ధిదారుల పిల్లల సంరక్షణ కోసం మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. అయితే బాండ్లు పంపిణీ చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్కరి ఖాతాలోనూ డబ్బు జమ -
‘బంగారుతల్లి’కి బాటలేసిన నరహరి
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంటే గుండెలపై కుంపటిలా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న సమాజం.. ఇవన్నీ చూసి చలించి పోయారాయన. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు పేదవర్గాలు పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన ఆ అధికారి.. ప్రభుత్వ పరంగా ఆడబిడ్డల పెళ్లికి ఏ విధంగా సాయపడాలనే తపన పడ్డారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి జీవనస్థితిగతులను అధ్యయనం చేసి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకానికి రూపకల్పన చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలులోకి తేగా, మరో పది రాష్ట్రాలు ఆ పథకాన్ని అనుసరించాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకానికి ‘లాడ్లీ లక్ష్మీయోజన’ పథకమే ప్రేరణ. ఆ అధికారే పరికిపండ్ల నరహరి. 2001 బ్యాచ్‌కు చెందిన సివిల్ సర్వెంట్. రామగుండం మండలం బసంత్‌నగర్‌కు చెందిన నరహరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సిరిసిల్లలో ఆదివారం ‘పద్మ పీఠం ఆత్మీయ సత్కారం’ అందుకుంటున్నారు. సిరిసిల్ల: బసంత్‌నగర్‌లో టైలర్‌గా పని చేసే పరికిపండ్ల సత్యనారాయణ-సరోజన దంపతుల మూడో సంతానం నరహరి. 1992లో ఐఎంఎస్ఎస్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న నరహరి మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు పొంది కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. హైదరాబాద్ వాసవి కళాశాలలో ఇంజినీరింగ్ పట్టా సాధించారు. 1998లో అడ్వాన్స్ రీసర్చ్ విభాగంలో సైంటిస్ట్‌గా పని చేస్తూ 1999లో సివిల్స్ రాశారు. మొదటి ప్రయత్నం ఫలించలేదు. అయినా నిరాశ చెందకుండా ఉద్యో గం చేస్తూనే గంటల తరబడి చదువుతూ సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. 2001లో రెండో ప్రయత్నంలో 78 ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకొని 2002మేలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తొలిపోస్టింగ్ పొందారు. 2003-04లో గ్వాలియర్ అసిస్టెంట్ కలెక్టర్‌గా, 2004-05లో ఇండోర్ ఎస్డీవో(రెవెన్యూ), ఇండోర్ మున్సిపల్ కమిషనర్‌గా 2006లో పనిచేశారు. అనంతరం ఐసీడీఎస్ రాష్ట్ర కమిషనర్ గా 2007 వరకు భోపాల్‌లో విధులు నిర్వహించారు. చింద్వారా జెడ్పీ సీఈవోగా పని చేసిన తర్వాత 2007లో సియోని కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2009-11లో సింగ్రాలి కలెక్టర్‌గా పని చేసిన ఆయన 2011లో గ్వాలియర్ కలెక్టర్‌గా విధుల్లో చేరి కొనసాగుతున్నారు. లాడ్లీ లక్ష్మీయోజనకు శ్రీకారం.. కలెక్టర్‌గా, ఐసీడీఎస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు పేదలు ఆడపిల్లల పెళ్లికి పడుతున్న కష్టాలను చూసి నరహరి చలించిపోయారు. కూతురు పెళ్లి కోసం ఒక కుటుంబం పడే ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన నరహరి పేదవర్గాలకు ప్రభుత్వ సాయం అందించాలనే లక్ష్యంతో లాడ్లీ లక్ష్మీయోజన పథకానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఆయనే రూపొందించారు. ఏడాది పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి మహిళా సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నరహరి రూపొందించిన పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలు చేసింది. ఈ పథకం మరో పది రాష్ట్రాల్లోనూ అమలు కావడం విశేషం. ఆడపిల్లల పెళ్లి కోసం ఆసరా ఉండే మంచి పథకాన్ని మన జిల్లా బిడ్డ రూపొందించడం గర్వకారణం. బంగారుతల్లి పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయడం విశేషం. రాష్ట్రపతి సత్కారం నరహరి పని చేసేచోట తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ గుర్తింపు సాధించారు. ఐఏఎస్ అధికారిగా ఆఫీసులో కూర్చొని ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పర్యటించి అధికార యంత్రాంగాన్ని కదిలించారు. గ్వాలియర్ కలెక్టర్‌గా వికలాంగులకు చేయూతనిచ్చే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ మన్ననలు పొందారు. పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతలు గుర్తు చేస్తూ యువతరాన్ని భాగస్వాములను చేస్తూ ‘మిగిలి ఉన్న పని’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నరహరి చేపట్టారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ డిసెంబర్ 3న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సులో అవార్డు బహూకరించారు. రాష్ట్రపతి ద్వారా సత్కారం పొందిన నరహరి అంతకుముందే వివిధ హోదాల్లో పని చేస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ స్థాయిలోనూ నరహరికి అవార్డు లభించడం విశేషం. రచయితగా.. కలెక్టర్‌గా నిత్యం బిజీగా ఉండే నరహరి పుస్తకాలు చదవడం, క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడడం హాబీలు. లాడ్లీ లక్ష్మీయోజన పథకాన్ని ముప్పై పేజీల డాక్యుమెంటరీ రాసిన ఆయన సాహిత్యకారుడిగా మరో కోణంలో రచనలు చేస్తున్నారు. సమర్థుడి జీవయాత్ర పేరుతో తన ఆత్మకథను ఆవిష్కరిస్తున్నారు. సమర్థ అధికారిగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే కాకుండా రచయితగా నరహరి ముందుకు సాగుతున్నారు. 2002లో శ్రీభగవద్గీతను వివాహమాడిన నరహరికి పాప శ్రీగౌరీఆలయ, బాబు అక్షర్ ఉన్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో రాము, లక్ష్మణ్, మహేశ్, శ్రీనివాస్ నలుగురు రాష్ట్రంలో వివిధ చోట్ల ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. చెల్లెలు శ్రీదేవి హైదరాబాద్‌లో డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్నారు. భార్య శ్రీభగవత్గీత గ్వాలియర్లోనే ప్రొఫెసర్. జిల్లాలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరహరి చదువులో రాణిస్తూ అత్యున్నత ఐఏఎస్ సాధించి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం జిల్లాకే గర్వకారణం. నేడు సిరిసిల్లలో ఆత్మీయ సత్కారం పద్మపీఠం సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఆదివారం నరహరిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. స్థానిక రాజరాజేశ్వర కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో పద్మపీఠం పురస్కారంతో నిర్వాహకులు కొక్కుల భాస్కర్, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఉపసంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్ సన్మానిస్తున్నారు. నరహరితో పాటు ప్రముఖ చిత్రకారుడు తెలంగాణ రాజముద్ర సృష్టికర్త ఏలె లక్ష్మణ్, సాహిత్యకారుడు, హైదరాబాద్ స్పెషల్ జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, బహుభాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, వస్త్ర పరిశ్రమ విశ్లేషకులు మచ్చ ఆనంద్, మగ్గంపై చిత్రాలు నేసే చేనేతశిల్పి కూరపాటి శ్రీనివాస్, అగ్గిపెట్టెలో చీర, ఉంగరంలో దూరె చీర సృష్టికర్త నల్ల విజయ్‌కుమార్‌లకు ఒకే వేదికపై పురస్కారాలు అందిస్తున్నారు. -
‘ఆడపిల్ల’ పథకమంటే అంత చులకనా..!
విజయనగరం అర్బన్ : ఆడపిల్లల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ పథకం అమలు తీరు అధ్వానంగా తయారైంది. జిల్లాలో ఆది నుంచీ అంతంతమాత్రంగానే అమలవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ పథకం పూర్తిగా మూలకు చేరింది. పథకం పేరును ‘మా ఇంటి మహాలక్ష్మి’గా మార్చుతామన్న ప్రస్తుత ప్రభుత్వం, కనీసం దరఖాస్తులు తీసుకోవడానికి ముందుకురావడం లేదు. సర్వర్లు పనిచేయకపోవడంతో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. బంగారు తల్లి పథకం కోసం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 12 వేల 103 మంది పేర్లు నమోదు అయ్యాయి. వాటిలో తొలివిడతగా కేవలం 7,020 మంది మాత్రమే నగదును బ్యాంక్ ఖాతాలో జమచేశారు. వీరిలో దాదాపు సగం మందికి ఇంకా బాండ్లు రాలేదని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లా వ్యా ప్తంగా 5,083 దరఖాస్తులను స్వీకరించి పెండింగ్‌లో ఉంచారు. నాలుగునెలలు అయినా వాటిపై స్పందన లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2013 మేలో పుట్టిన పాపకు రెండో ఏడాది నిధులు రావా ల్సి ఉంది. అయితే నాలుగునెలలు గడిచినా ఇంకా ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ పథకా న్ని ఉంచుతారోలేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలు నిబంధనలతో అవస్థలు గతంలో ఏ పథకానికి విధించని నిబంధనలను బంగారు తల్లి పథకానికి అమలు చేస్తుండటంతో ఆడ పిల్లల తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. నిబంధనల ప్రకా రం... ఈ పథకం కోసం తల్లుల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాలి. అందుకోసం రెండు గుర్తింపు పత్రాలను బ్యాంక్‌లో అందించాలి. అయితే మహిళల కు పెళ్లికాకముందు ఒక ఇంటి పేరు, పెళ్లి తరువాత మరో ఇంటిపేరు ఉండటంతో వారు బ్యాంక్ ఖాతా ప్రారంభించడం కష్టంగా మారింది. అంతేగాకుండా లబ్ధిదారులు కచ్చితంగా తెల్లరేషన్ కార్డుదారులై ఉండాలి. ఆధార్‌కార్డు కూడా కలిగి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల కాలంలో తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో తెల్లకార్డులేని కారణంగా అర్హులైనవారు కూడా బంగారు తల్లి పథకాన్ని పొందలేకపోతున్నారు. అన్నీ ఉన్నప్పటికీ ఐకేపీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణం, అదే విధంగా జనన ధ్రువీ కరణపత్రాల మంజూరులోకూడా పలు సమస్యలు ఎదురవుతుండడంతో మరికొంత మంది ఈపథకానికి దూరమవుతున్నారు. ప్రతి ఆడపిల్లకూ బంగారు భవిష్యత్ అం దించాలనే ఉద్దేశ్యంతో గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 2013 జూన్ 19వ తేదీన బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. 2013 మే ఒకటో తేదీ నుంచి జన్మించిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తించేలా చర్యలు చేపట్టారు. లబ్ధిదారులు తెల్లకార్డుదారులైన ఉండాలి. ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తిచేసేంత వరకూ (21 సంవత్సరాలు వచ్చేంత వరకూ) ఏటా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. శిశువు పుట్టగానే రూ.2,500 టీకాల నిమిత్తం వెయ్యి రూపాయలు, 1, 2 సంవత్సరాలకు ఏడాదికి వెయ్యి రూపాయలు, 3, 4, 5 సంవత్సరాలకు ఏడాదికి రూ.1,500 అందిస్తారు. బాలికను పాఠశాలకు పంపితే 5వ తరగతి వరకు ప్రతి ఏడాది 2వేల రూపాయలు అందిస్తారు. 6,7,8 తరగతుల్లో ప్రతి ఏడాది రూ.2,500, అదేవిధంగా 9,10 తరగతుల్లో ప్రతి ఏడాది రూ.3 వేలు, ఇంటర్ వరకు చదివిస్తే ఏడాదికి రూ.3,500 అకౌంట్లో జమచేస్తారు. ఇంటర్ పూర్తి చేస్తే రూ.50 వేలు, డిగ్రీ పూర్తయిన తరువాత లక్ష రూపాయలు అందిస్తారు.అయితే, చెప్పుకునేందుకు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మత్రం ఆశించిన స్థాయిలో పథకం అమలు జరగడం లేదు. -
ఇక నుంచి మా ఇంటి మహాలక్ష్మి.....
హైదరాబాద్ : నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం నిర్దేశించిన బంగారు తల్లి పథకం పేరు మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని ఇక నుంచి 'మా ఇంటి మహాలక్ష్మి' గా పిలుస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని శనివారం శాసనసభలో వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడత చెల్లింపులు జరిగాయని.. ఈ పథకాన్ని సమర్ధంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు తగిన నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో టాయిలెట్ల కొరత, మంచినీటి కొరతను వైఎస్ఆర్ సీపీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి తదితరులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. -
‘బంగారుతల్లి’కి ఎంత కష్టం!
గుంటూరు: ‘బంగారుతల్లి’కి ఎంతో కష్టమొచ్చింది. పుట్టిన ఆడబిడ్డకు ప్రభుత్వం తనవంతు సాయం అందిస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత ఏడాది మే 1న బంగారుతల్లి పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. నెలలు గడిచినా వారి ఖాతాల్లో నగదు జమకావడం లేదు. దీంతో లబ్ధిదారులు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. కానీ పథకం అమలు అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దరఖాస్తు పెట్టిన 21 రోజులకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. కాని నెలలు గడుస్తున్నా దరఖాస్తులు చేసుకున్నవారి ఖాతాల్లో నగదు జమ కావటం లేదు. మండలంలో గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 324 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 94 మందికి మాత్రమే నిధులు జమైనట్లు చెబుతున్నారు. ఒక్కో ఆడపిల్లకు రూ. 2,016 వేలు ఈ పథ కానికి దరఖాస్తు చేసుకున్నవారికి వారి ఖాతాల్లో రూ. 2500 జమ చేస్తారు. అనంతరం బిడ్డ మొదటి, రెండో సంవత్సరానికిగాను ఏడాది రూ. రెండు వేలు, మూడు నుంచి ఐదేళ్లకుగాను ఏడాదికి రూ. 1500లు, ఆరు నుంచి 10 ఏళ్ల వరకు ఏడాదికి రూ. రెండు వేలు, 11 నుంచి 13వ సంవత్సరం వరకు ఏడాదికి రూ. 2500లు, 14 నుంచి 15వ సంవత్సరం వరకు ఏడాదికి రూ. మూడు వేలు, 16 నుంచి 17 వ సంవత్సరం వరకు ఏడాదికి రూ. 3,500లు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఇంటర్ పూర్తికాగానే ఒకేసారి రూ. 50 వేలు అందజేస్తారు. 18 నుంచి 21 సంవత్సరాలకుగాను ఏడాదికి రూ. నాలుగు వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో ఆడపిల్లకు రూ. 2.16 లక్షల చొప్పున సాయం అందజేస్తుంది. అయితే పథకం ఆరంభంలో ఉన్న చొరవ అమలులో లేకపోవడంతో తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలు చేయనప్పుడు దరఖాస్తులు తీసుకోకుండా ఉన్నా సరిపోతుందని మహిళలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దరఖాస్తులకు విముక్తి కలిగించి పథకం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు తల్లులు కోరుతున్నారు. -
బంగారుతల్లికి 52 వేల దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గంటా శ్రీనివాసరావు, బాలరాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగారుతల్లి పథకం కోసం మొత్తం 51,925 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారికి బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ కూడా ఉండాలని, వచ్చే ఏడాది నుంచి ఆధార్ ఉన్నవారే పథకానికి అర్హులని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. పింఛన్ల లబ్ధిదారులను గుర్తించామని, త్వరలో జరిగే రచ్చబండలో వారికి పింఛన్లు అందిస్తామని ఆమె వివరించారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఉల్లిపాయలు సహా కూరగాయల ధరల పెరుగుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతితో సమీక్ష నిర్వహించారు. ధరల తగ్గింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం ఈ సందర్భంగా సీఎస్‌ను ఆదేశించారు. అలాగే సీమాంధ్రలో సకల జనుల సమ్మె, వరదల పరిస్థితిపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు.