bangladesh women
-
హైదరాబాద్: ఉపాధి ఆశ చూపి వ్యభిచారంలోకి..!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ యువతులను నగరానికి తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాలో ఆరుగురిని యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్, ఉప్పల్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, 7 సెల్‌ఫోన్స్, 5 సిమ్ కార్డులు, 7 నకిలీ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార ముఠా నుంచి నుంచి ఓ బాలికతో పాటు మహిళను కాపాడారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్ భగవత్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సతీష్ రజక్(25) ముంబైలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తను బంగ్లాదేశ్‌కు చెందిన బ్రిష్టిఖాతున్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అక్రమంగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చి అక్కడ నకిలీ ఆధార్ కార్డు తీసుకుని ముంబైకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన దీపక్ చంద్, మావత్ ప్రకాష్(30), మహారాష్ట్రకు చెందిన సురేష్ బలుసోనన్నే(36,) అస్లాం చంద్ పటేల్, అరుణ్ రామచంద్ర జాదవ్(56), పశ్బిమ బెంగాల్‌కు చెందిన ప్రియాంక కలిసి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీపక్ చంద్, సతీష్ రజక్‌లు వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతులును ఉపాధి పేరుతో ఆకర్షించి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్లో యువతులు, మహిళల అర్ధనగ్న ఫొటోలు అప్లోడ్ చేసి.. కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. దేశంలో క్లయింట్లకు కావాల్సిన చోటికి యువతులను పంపిస్తున్నారు. విమాన, రైలు, బస్సు, నెట్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ డబ్బు దండుకుంటున్నారు. సతీష్ రజక్, భార్య బ్రిష్టిలు హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఉంటూ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను, బాలికలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. బంగ్లాదేశ్ చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం తన బంధువైన బ్రిష్టిని సంప్రదించగా ఇండియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆమె తన సోదరితో కలిసి అక్రమంగా జూన్ 27న బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రాగా, అక్కడ నుంచి రజక్, బ్రిష్టిలు ఉప్పల్ తీసుకొచ్చారు. వారిద్దరినీ బలవంతంగా వ్యభిచారంలో దింపడంతో వారు ఈనెల 11న అక్కడి నుంచి తప్పించుకుని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి బంగ్లాదేశ్ మహిళలతో పాటు 15 ఏళ్ల బాలికను రక్షించారు. దీపక్ చంద్‌కు బంగ్లాదేశ్ మహిళలను అక్రమంగా రవాణా చేసేవారితో మంచి పరిచయాలు ఉన్నాయని, వారు మహిళలను అక్రమంగా భారత దేశ సరిహద్దులు దాటించి పశ్బిమ బెంగాల్‌కు పంపుతారని, వారికి నకిలీ ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు తాను ఏర్పాటు చేస్తానని పోలీసుల విచారణలో సతీష్‌రజక్ కు తెలిపాడు. గత ఐదేళ్లుగా వీరు నగరంలోని సంపన్నులు నివాసం ఉండే ప్రాంతాల్లో బ్యూటీపార్లర్లు నిర్వహించేవారు. అమ్మాయిలను మసాజ్ గరల్స్‌గా ఏర్పాటు చేసి వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. మహిళలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, శిక్షలు అమలవుతాయని రాచకొండ సీపీ హెచ్చరించారు. పట్టుబడ్డవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ముఠాలోని ప్రకాష్, ప్రియాంక పరారీలో ఉన్నారని, వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకన్న నాయక్, మాల్కాజిగిరి ఏసీపీ నరేష్‌రెడ్డి, ఏహెచ్‌టీయూ సీఐ నవీన్‌కుమార్, ఉప్పల్ సీఐ గోవింద్‌రెడ్డి, బాలకృష్ణ, సుధాకర్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్ ప్రేమ.. బంగ్లాదేశ్ యువతి అరెస్ట్
సాక్షి, చెన్నై : ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువకుడిని వివాహం చేసుకోవడానికి పాస్‌పోర్టు లేకుండా భారతదేశంలోకి వచ్చి చెన్నైలో నివాసముంటున్న బంగ్లాదేశ్ యువతిని పోలీసులు అరె స్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నివాసముంటున్న శశిషేక్ (28)కు ఫేస్బుక్ ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన పాపియో ఖోష్(22) అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో పాపియో ఖోష్ పాస్‌పోర్టు లేకుండా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి వ చ్చింది. అనంతరం ఇద్దరూ తమిళనాడు చేరుకుని ఈ నెల 12న కోవై జిల్లా పొల్లాచ్చిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. చెన్నై మీంజూర్‌లో నివాసం ఉంటున్నారు. తన కుమార్తె కనిపంచడం లేదని బంగ్లాదేశ్ పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. బంగ్లాదేశ్, భారత పోలీసులు జరిపిన విచారణలో యువతి మీంజూరులో ఉన్నట్లు సీబీసీఐడీ పోలీసులకు సమాచారం అందింది. కాంచీపురం పోలీసులు పాపియో ఖోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీంజూరు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తిరువళ్లూరు జిల్లా ఎస్పీ అరవిందన్, డీఎస్పీ కల్పనాదత్ స్వయంగా విచారణ చేశారు. పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి చొరబడినట్లు తేలడంతో యువతిని పొన్నేరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. (కీచక ఇన్స్పెక్టర్.. మైనర్‌ను వ్యభిచారకూపంలోకి ఆపై..) -
శ్రీలంక విజయం
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నమెంట్లో శ్రీలంక మరో విజయాన్ని సాధించింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక మహిళలు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందారు.బంగ్లాదేశ్ విసిరిన 94 పరుగుల లక్ష్యాన్ని లంక ఇంకా ఓవర్ మిగిలి ఉండగా ఛేదించింది.లంక క్రీడాకారిణుల్లో యశోద మెండిస్(24), జయాంగణి (39) రాణించి గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులే చేసింది. సంజిదా ఇస్లామ్(35), షైలా షర్మిన్(25) లు ఆకట్టుకున్నారు. -
54 పరుగులకే కూల్చేశారు..
బ్యాంకాక్: ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఆరంభపు ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత మహిళలు చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ మహిళల్ని 54 పరుగులకే కూల్చేసి 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.భారత క్రీడాకారిణుల్లో మిథాలీ రాజ్(49) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా, స్మృతీ మందనా(41) ఆకట్టుకుంది. ఈ జోడి తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి తీసుకెళ్లింది. కాగా, ఆ తరువాత హర్మన్ ప్రీత్ కౌర్(19) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది. అయితే ఆపై 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 13 పరుగుకే మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది.కాగా, సల్మా ఖాతున్(17), షాలియా షర్మిన్(18) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో బంగ్లాదేశ్ 50 పరుగుల మార్కును దాటింది. వీరిద్దరూ అవుటైన తరువాత బంగ్లా కథ మళ్లీ మొదటికొచ్చింది. కనీసం క్రీజ్‌లో నిలుచునే ప్రయత్నం చేయకుండానే బంగ్లా క్రీడాకారిణులు క్యూకట్టేశారు. భారత మహిళల్లో పూనమ్ యాదవ్ మూడు వికెట్లు, గోస్వామి, అనుజా పాటిల్ తలో రెండు వికెట్లు సాధించారు. మన్షీ జోషి, ఏక్తా బిస్త్‌లకు చెరో వికెట్ దక్కింది. -
వ్యభిచారం కేసులో బంగ్లాదేశీ యువతులు అరెస్ట్
రంగారెడ్డి: బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులు వ్యభిచారం చేస్తూ గురువారం ఎస్ఓటీ పోలీసులకు పట్టుబట్టారు. వారితో మరో యువకుడ్ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.18వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్ యువతులు దొంగ పాస్‌పోర్టు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (వనస్థలిపురం)