bank account number
-
కొనసాగుతున్న సమగ్ర సర్వే
చిన్నశకరంపేట: రైతు సమగ్రసర్వే పూర్తి సమాచారాన్ని కంప్యూటరీకరించనున్నట్లు చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండలంలోని కామారం తండాలో రైతు సమగ్రసర్వేలో రైతుల వివరాలు సేకరించారు. సర్వేలో రైతు పేరు, భూమి వివరాలు, నేల స్వభావం, పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, బ్యాంకు ఖాతా నంబర్ నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వకు రైతులు సహకరించి పూర్తి వివరాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు పాల్గొన్నారు. టేక్మాల్: మండలంలోని కుసంగి గ్రామంలో వ్యవసాయాధికారులు మంగళవారం రైతు సమగ్ర సర్వేచేపట్టారు. రైతు కుటుంబాల ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పట్టాదారుపాసుపుస్తకం, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏఈఓ సునీల్‌కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. సర్వేలో వీఆర్ఏ రాధాకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మా పెళ్లికి రండి... ఖర్చులు చెల్లించండి!
ధోరణి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడొక చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. మామూలుగానైతే, శుభలేఖలో ‘అందరికీ ఆహ్వానం’ ‘మీ రాక మాకు సంతోషకరం’ ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం... ఇలాంటి వాక్యాలతో పాటు- ‘పెళ్లి ఖర్చులకు మీ వంతుగా సహకారం అందించండి’ ‘హనీమూన్ ఖర్చులకు సహాయం అందించండి’ లాంటి వాక్యాలకు తోడు బ్యాంకు ఎకౌంట్ నంబర్ కూడా ఇస్తున్నారు. విశేషమేమిటంటే, ఇలాంటి పెళ్లిళ్లకు ఎవరూ ముఖం చాటేయడం లేదు. తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. శుభలేఖలో వినోదం ఖర్చులు సమర్పించిన వారు, విందు ఖర్చులు సమర్పించినవారు, బ్యాండు ఖర్చులు సమర్పించినవారు లాంటి కొత్త మాటలు కనిపిస్తున్నాయి. శుభలేఖలో ప్రచురించే ఖర్చుల జాబితాలో తమ పేరును చూసుకోవడానికి చాలామంది తాపత్రయపడుతున్నారు. ‘‘ఇది ఖర్చు అనుకోవడం లేదు. నాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను’’ అంటున్నాడు లెమన్స్ (ఫ్రాన్స్) పట్టణానికి చెంది మైఖేల్ అనే ఉద్యోగి. తన మిత్రుడి పెళ్లికి అయిన విందు ఖర్చును తానే భరించాడు. ఇటీవలే లండన్‌లో పెళ్లి చేసుకున్న జంట కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. పెళ్లి ఖర్చులు పోను అదనంగా కొంత డబ్బు మిగిలింది. ఆ మొత్తాన్ని ఒక అనాథాశ్రమానికి ఇచ్చారు. ఈ పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందిన వారు రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు. పాశ్చాత్య దేశాల్లో ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుంటున్న అయిదుగురిలో నలుగురు ఈ ధోరణినే అనుసరిస్తున్నారు. పెళ్లికి అవసరమైన ఖర్చులు భరించగలిగే స్థోమత ఉన్నప్పటికీ, ప్రముఖుల పెళ్లిళ్ల మాదిరిగా ఆడంబరంగా జరుపుకోవాలనుకునే వారు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘‘ఈ విధానం వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు’’ అంటున్నాడు చార్లెట్ అనే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్. పెళ్లికి తన వంతు డబ్బు ఇచ్చిన డెల్విన్ను ఈ ధోరణి గురించి అడిగినప్పుడు - ‘‘ఇది ఆహ్వానించదగిన పరిణామం. పెళ్లి కోసం అప్పు చేయడం కంటే, సన్నిహితులు తలా ఒక చేయి వేస్తే అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మీయతను చాటుకున్నట్లుగా కూడా ఉంటుంది. వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా ద్వారా సహాయం పొందినవారే రేపు నాకు కూడా సహాయపడతారు కదా’’ అంటున్నాడు.