bank account numbers
-
ఒకే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నంబర్
భిండ్: ఒకే పేరున్న ఇద్దరికి ఒకే ఖాతా నంబర్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వాకమిది. ఆ ఇద్దరిలో ఒకరు డబ్బులు డిపాజిట్ చేస్తుండగా, మరొకరు వాటిని విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. చివరికి విషయం కనుక్కొని ప్రశ్నించగా.. ‘మోదీజీ(ప్రధాని మోదీ)నే నా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడనుకున్నా’అని విత్ డ్రా చేసుకున్న వ్యక్తి జవాబివ్వడంతో బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హుకుమ్ సింగ్ అనే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్‌ను ఎస్బీఐ ఆలంపూర్ బ్రాంచ్ కేటాయించింది. రురాయి గ్రామానికి చెందిన హుకుంసింగ్.. స్థలం కొనుక్కునేందుకు డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో రెగ్యులర్‌గా అకౌంట్లో డబ్బులు వేసేవాడు. వాటిని రవుని గ్రామానికి చెందిన హుకుంసింగ్ విత్ డ్రా చేసుకుని వాడుకునేవాడు. అలా దాదాపు రూ. 89 వేల రూపాయలను విత్ డ్రా చేసుకున్నాడు. డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకుందామని బ్యాంక్‌కు వెళ్లిన హుకుంసింగ్‌కు తన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు విత్ డ్రా అయిన విషయం తెలిసింది. మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయమై విత్ డ్రా చేసిన హుకుంసింగ్‌ను ప్రశ్నిస్తే.. ‘మోదీజీ ఇస్తున్నాడనుకున్నా. అందుకే వాడుకున్నా’అని జవాబిచ్చాడు. -
నమ్మించి.. ముంచేస్తారు
సాక్షి, తణుకు(పశ్చిమ గోదావరి): ‘హలో నేను బ్యాంకు అధికారిని.. ముంబై నుంచి మాట్లాడుతున్నాను.. మీ బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పండి... వివరాలు సరిపోల్చుకోవాలి...’ అంటూ ఫోన్ రాగానే బ్యాంకు నుంచే కదా అని తణుకు పట్టణానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఠక్కున అక్కౌంట్ నంబర్ చెప్పారు. ఇంకేముందు క్షణాల వ్యవధిలో తన సెల్‌ఫోన్ నంబర్ రెండు దఫాలుగా రూ.20 వేలు చొప్పున నగదు మాయమైనట్టు మెసేజ్ వచ్చింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లిన మహిళ అక్కడే ఉన్న వ్యక్తిని నగదు డ్రా చేయమని అడిగింది. ఆమె ఏటీఎం కార్డు తీసుకుని ఏటీఎంలో చెక్ చేసి డబ్బులు లేవని చెప్పి ఆమెకు ‘మోటారు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి రద్దీగా ఉండే ప్రాంతానికి వచ్చి బండిపై నుంచి అదుపుతప్పి పడిపోతున్నట్లుగా నటిస్తాడు. ఇదే సమయంలో సమీపంలోని ఎవరైనా ఇతనికి సాయం చేయడానికి వస్తారు. ఇదే అదనుగా చూసుకుని అప్పటికే అక్కడ కాపుగాసిన వ్యక్తి సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి జేబులోని పర్సు లేదా సెల్‌ఫోన్ అపహరిస్తాడు. ఈ తంతంగం అంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి ఇక్కడ దొంగతనాలు జరుగుతాయి.. నేరాలు ఇలా జరుగుతున్నాయ్ మొదట ఖాతాదారుడికి ఫోన్ కాల్ వస్తుంది.. సమాధానం ఇవ్వబోతే ముంబై నుంచో చెన్నై నుంచో బ్యాంకు ఉన్నతాధికారిని మాట్లాడుతున్నానని... మీ అకౌంట్ నంబర్ ఇవ్వాలని... మా వద్ద దురదృష్టవశాత్తూ నంబర్ పాడైందని చెబుతున్నారు. ఇది నిజమని నమ్మిన ఖాతాదారుడు వెంటనే ఆ నంబర్ చెబుతున్నారు. కాసేపటికే సెల్‌ఫోన్‌కు బ్యాంకు నుంచి వచ్చినట్లు మెసేజ్ వస్తుంది. అందులో ఏటీఎం నాలుగు అంకెల పిన్ నంబరు ఇవ్వమని కోరుతున్నారు. బ్యాంకు అధికారే కదాని ఇస్తున్నారు. పది నిమిషాల్లో డబ్బు డ్రా చేసినట్లు తిరిగి మెసేజ్ వస్తోంది. దీంతో నెత్తీనోరు బాదుకోవడం ఖాతాదారుడి వంతు అవుతోంది. ఆధార్ నంబరును బ్యాంకు అనుసంధానం చేయాలంటూ ఏటీఎం పిన్ నంబరు తెలుసుకుని తణుకు పట్టణానికి చెందిన రెడీమేడ్ దస్తుల వ్యాపారి మోటారాంచౌదరి బ్యాంకు ఖాతా నంబర్ తెలుసుకుని ఇదే తరహాలో రూ.16 వేలు కాజేసిన సంఘటన గతంలో చోటుచేసుకుంది. కొవ్వూరుకు చెందిన దోర్భల ప్రభాకరశర్మకు ఇదే తరహాలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్ అనుసంధానం అంటూ ఏటీఎం పిన్ నెంబరు తెలుసుకుని సుమారు రూ.15 వేలు నగదు కాజేశారు. ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన వ్యక్తి గోవాకు వెళ్లేందుకు ముందుగా హోటల్ గదిని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఇందుకు రూ.40 వేలు ఆన్లైన్ ద్వారా యాజమాన్యానికి చెల్లించారు. అయితే కొద్దిసేపటికే మరో హోటల్లో గది బుక్ అయినట్లు మెసేజ్ రావడంతోపాటు మరో రూ.40 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కాలంలో సైబర్ నేరాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ చోరీలు ఎక్కువగా జరగడానికి ఖాతాదారుల అమాయకత్వం, అవగాహన లేకపోవడమే కారణం. ఏ బ్యాంకు అధికారులైనా మనం ఫిర్యాదు చేయకుండా మనకు సంబంధించిన లావాదేవీల గురించి మనతో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ఖాతాకు సంబంధించిన నంబర్, పేరు, చిరునామా తదితర వివరాలన్నీ ఆయా బ్యాంకువారి వద్దే ఉంటాయి. ఇలాంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఫోన్ చేస్తే బ్యాంకు ఖాతా నంబర్లు చెప్పడం మంచిది కాదు. మన ఖాతా నంబర్ ఎవరికైనా ఇచ్చే ముందు స్థానిక బ్యాంకు వారిని కూడా సంప్రదించడం మంచిది. –డీఎస్ చైతన్యకృష్ణ, సీఐ, తణుకు -
విద్యార్థులకు షాక్
సాక్షి, గుంటూరు: ఎట్టకేలకు కళాశాల, హాస్టల్ ఫీజులు మంజూరయ్యాయని మురిసిపోతున్న విద్యార్థులకు పెద్దషాక్ తగిలింది. సంక్షేమ శాఖ అధికారులు పంపిన బ్యాంక్ అకౌంట్ నంబర్లు సక్రమంగా లేవని నిధులు విడుదలకు నోచుకోక ఖజానాలో మూలుగుతున్నాయి. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్లో ఇదొకటి. 2012-13 విద్యా సంవత్సరానికి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ కోరుతూ వివిధ సంక్షేమ శాఖల ద్వారా 62వేల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది. ఈ విధానంలో కిందటి ఏడాది జిల్లా ఖజానా శాఖ నుంచి రూ.120 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. మరో రూ.12 కోట్లు విడుదల కావాల్సి ఉందని సంక్షేమ శాఖల అధికారు లు రెండు నెలల క్రితమే వెల్లడించారు. ఈ ఏడాది రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులకు కళాశాలల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది అందాల్సిన ట్యూషన్ ఫీజులకే దిక్కులేదని, ప్రస్తుత ఏడాది కూడా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి చదువులు చెప్పలేమని యాజమాన్యాలు చేతు లెత్తేస్తున్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన బకాయిలు వచ్చాయని, అయితే అకౌంట్ నంబర్లలో తేడా వచ్చి జిల్లా ఖజానాలో వున్నాయని తెలిసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో నోడల్ ఏజెన్సీ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతు న్నాయనే భావన అంతటా వ్యక్తమవుతోంది.