bank details
-
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు.. కొట్టేసిన సొమ్మును తమ వద్దకు చేర్చుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుతున్నారు. తమ చేతికి నేరం అంటుకోకుండా కమీషన్ల ఆశజూపి అమాయకులనే చివరకు బలి చేస్తున్నారు. ‘మ్యూల్’బ్యాంకు ఖాతాలతో మొత్తంగా ముంచేస్తున్నారు. ఒకటి కాదు...రెండు కాదు..దేశవ్యాప్తంగా ఐదు లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) 2024లో మొత్తం 1.14 లక్షల సైబర్ నేరాలు నమోదు చేయగా..ఈ కేసులలో ప్రతి కేసులో కనీసం ఐదు మ్యూల్ బ్యాంకు ఖాతాలు వినియోగించినట్టు తెలిపారు. aఅమాయకుల నుంచి వివిధ మోసపూరిత విధానాల్లో కొల్లగొట్టిన సొమ్మును పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్లు వీటిని వెంటవెంటనే పలు బ్యాంకు ఖాతాల్లోకి (మ్యూల్ ఖాతాల్లోకి) బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు కొట్టేసిన సొమ్ము ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి చిన్నచిన్న మొత్తాలుగా చేసి బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు వందల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు అధికారులు ఆ సొమ్మును గుర్తించడం..తిరిగి ఫ్రీజ్ చేయడం సవాల్‌గా మారుతోంది. ఇలా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన సొమ్మును చివరగా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు కొన్ని బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తర్వాత వెంటనే వాటిని నగదు రూపంలో విత్‌డ్రా చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మధ్యవర్తుల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతున్నారు. ఇటీవలే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ తరహా ముఠాలోని 21 మందిని 2024 డిసెంబర్ 24న అరెస్టు చేశారు. బ్యాంకుల సమన్వయంతోనే కట్టడి సాధ్యం.. మ్యూల్ బ్యాంకు ఖాతాల బెడద తగ్గించడంలో బ్యాంకు అధికారులది కీలకపాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తే అలాంటి బ్యాంకు ఖాతాలకు రెడ్‌ప్లాగ్ పెట్టుకుని, వెనువెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేస్తే ఫలితం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక బ్యాంకు ఖాతాదారుడి అకౌంట్లో అకస్మాత్తుగా లక్షల రూపాయలు జమ అవుతుండటం..అదేరీతిలో లక్షల్లో డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్టు గుర్తిస్తే అలాంటివి మ్యూల్ బ్యాంకు ఖాతాలుగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సమన్వయం లోపిస్తోంది. బ్యాంకుల సాధారణ ప్రక్రియలో భాగంగా ఇలాంటి రెడ్‌ఫ్లాగ్ ఖాతాల (అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన ఖాతాలు) వివరాలు ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు చేరవేస్తాయి. కొన్ని నెలల తర్వాత సంబంధిత పోలీసులకు ఆ సమాచారం చేరుతుంది. ఈలోగా సైబర్ నేరగాళ్లు నిధులను విదేశాలకు మళ్లించడం పూర్తి చేస్తుండటంతో ఆ సమాచారం పోలీసులకు నిరుపయోగంగా మారుతోంది. మ్యూల్ బ్యాంకు ఖాతా అంటే..? ఒకరి వివరాలతో ఉన్న బ్యాంకు ఖాతాను నేరపూరిత లావాదేవీలకు ఇతరులు వినియోగిస్తే (నిజమైన ఖాతాదారుడికి తెలిసి ఇది జరగవచ్చు.. తెలియకుండా కూడా జరగొచ్చు) ఇలాంటి బ్యాంకు ఖాతాను మ్యూల్ బ్యాంక్ అకౌంట్‌గా చెబుతారు. కొందరు నెలవారీ కమీషన్లకు ఆశపడి తమ అధికారిక ధ్రువపత్రాలు ఉపయోగించి తెరచిన బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకు ఖాతాల్లో ఎవరి నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. అవి మళ్లీ ఎక్కడికి బదిలీ అవుతున్నాయన్న వివరాలు ఖాతాదారుడికి తెలిసే అవకాశం కూడా ఉండదు. మ్యూల్ బ్యాంకు ఖాతాలు ఇలా తెరిపిస్తారు.. సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి అమాయకులకు వల వేస్తారు. వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా ఒప్పిస్తారు. ఆ తర్వాత నిజమైన బ్యాంకు ఖాతాదారుడి నుంచి బ్యాంకు పాస్‌బుక్, డెబిట్ కార్డులు, పాస్వర్డ్లు మోసగాళ్లు తమ ఏజెంట్ల ద్వారా ఆ బ్యాంకు ఖాతాలు పూర్తిగా తమ ఆ«దీనంలోకి తీసుకుంటారు. సైబర్ మోసాల్లో కొల్లగొట్టే సొమ్మును ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం..తర్వాత ఇతర ఖాతాల్లోకి మళ్లించడం వంటి లావాదేవీలు చేస్తుంటారు. ఖాతాదారులకు సూచనలు.. ఇతరులు నెలవారీ కమీషన్ ఇస్తామంటే ఆశపడి మీ బ్యాంకు ఖాతాను ఇతరులకు ఇవ్వొద్దు. మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడుతుంది. మీరు మళ్లీ కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పేరిట ఉన్న మ్యూల్ బ్యాంక్ ఖాతా నేరస్తులు అక్రమ నిధుల బదిలీకి, లేదా మనీలాండరింగ్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉన్నందున చట్టపరంగా అసలు ఖాతాదారులకు శిక్ష తప్పదు. ప్రధానంగా మ్యూల్ బ్యాంకు ఖాతాల బాధితులు వీరే..సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగులు ఈ ఉచ్చులో చిక్కుతున్నారు. వివరాలు ఇస్తే నెలకు కొంత కమీషన్ వస్తుందని ఆశపడి నిరుద్యోగ యువత వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి మ్యూల్ ఖాతాలుగా వాడేందుకు ఇస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని, నేరస్తులు కమీషన్లు ఆశజూపి రైతులను ఈ ఉచ్చులో దింపుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం..జిమ్ ట్రైనర్లు, టైలర్లు, ప్రైవేటు కాంట్రాక్టర్లు, హోటల్స్ నిర్వాహకులు ఇలా పలువురు మ్యూల్ ఖాతాల బాధితులే. -
మాటల్లో దించి.. మాయచేసి..
సాంకేతిక పెరిగేకొద్ది సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్త ఎత్తుగడలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి నగదు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు మాత్రం తమదైన శైలిలో దోచుకుంటున్నారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేయరని, అలాంటి ఫోన్లు వస్తే ఎలాంటి వివరాలు ఇవ్వరాదని సమీపంలోని స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి వాసులు సైబర్ వలకు చిక్కకుండా పోలీసులు, కాలనీ సంక్షేమ సభ్యులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. – బాలానగర్ మచ్చుకుకొన్ని.. లింక్ ఓపెన్ చేయడంతో.. బాలానగర్ ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూడగా ‘మీ బ్యాంక్ అకౌంట్ 24 గంటల్లో డియాక్టివేట్ అవుతుంది’. వెంటనే మీ కేవైసీ డాక్యుమెంట్స్‌ను చేయాలని ఓ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి బ్యాంక్ సీఆర్ఎం నంబర్, పాస్వర్డ్ ఎంట్రీ చేయగా ఆ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.49,999 డెబిట్ అయ్యాయి. నౌకరీ.కామ్ పేరుతో.. 27 ఏప్రిల్ 2021 రాత్రి 11.41 సమయంలో ఓ మహిళలకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి నౌకరీ.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు మంచి ఉద్యోగం ఇస్తాం ఓ లింక్ పంపించాం. ఆన్లైన్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఉంది. అందుకు గాను రూ. 25తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఆ లింక్‌ను తెరిచిన ఆమె వివరాలు అందించి పేమెంట్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. ఆ తర్వాత ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అప్పటికే తమ దగ్గర ఉన్న వివరాలతో సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.16,665 దోచుకున్నారు. ఇట్లు అద్దెకు తీసుకుంటానని.. ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. బాలానగర్ డివిజన్ సాయినగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్టు చేశాడు. అది చూసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంటి అద్దె, అడ్వాన్స్ గురించి యజమాని తెలుపగా మొత్తం రూ. 45 వేలు చెల్లిస్తానని గూగుల్ పేమెంట్ నంబర్ నుండి అకౌంట్‌కు వివరాలు పంపాలని చెప్పడంతో బాధితుడి విరాలు పంపగా క్షణల్లో సైబర్ నేరగాళ్లు మూడు దఫాల్లో రూ. లక్ష తమ ఖాతల్లోకి మార్చుకున్నారు. ఈఎంఐ చెల్లించే క్రమంలో.. ఫిరోజ్‌గూడలో నివసించే ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు ఈఎంఐ లోన్ కట్టేందుకు గూగుల్‌లో వెతుకుతుండగా కస్టమర్ కేర్ అని కనిపించిన ఓ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఈఎంఐ నగదు డెబిట్ కాలేదు.. కారణమేంటని ప్రశ్నించగా మీ నగదు జమ కావాలంటే మీ ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి క్రెడిట్ కార్డు నెంబర్, ఓటీపీనీ చెప్పాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు చేయడంతో అరగంటలో దాదాపుగా రూ. 15 వేలకు పైగా బాధితుడి ఖాతాలోంచి దోచుకున్నారు. ► బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది మార్చి 24వ తేదీన సైబర్ క్రైమ్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కాగా ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకున్నారు. అందులో 7 మంది మహిళలు ఉన్నారు. ► సైబర్ నేరగాళ్లు రూ. 54. 31 లక్షలు దోచుకోగా అందులో నుంచి రూ. 8.75 లక్షలు రికవరీ చేశారు. ► బాధితులు ఎవరైన ఉంటే ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి, లేదా 155260 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ► సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన కొందరైతే.. బంధువులు, స్నేహితులకు తెలిస్తే వారి దగ్గర చులకన అవుతామనే ఆలోచనలతో ఫిర్యాదు చేయడం లేదు. బ్యాంక్ వివరాలు ఇవొద్దు.. సైబర్ నేరాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన రావాలి. కేవైసీ అప్డేట్, బీమా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని మోసం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాగాళ్లను ఎదుర్కొంటున్నాం. ఎవ్వరికీ బ్యాంక్ వివరాలు ఇవొద్దు. బాధితులుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. –ఎండీ. వాహిదుద్దీన్, బాలానగర్ సీఐ చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!
గూగుల్ సంబంధిత పేమెంట్ యాప్ జీపే(గూగుల్ పే) వివాదంలో చిక్కుకుంది. అనుమతులు లేకుండా యూజర్ ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని కలిగి సేకరిస్తోందని, తద్వారా యూజర్ భద్రతకు ముప్పు వాటిల్లడంతో పాటు అవకతవకలకు ఆస్కారం ఉందంటూ ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్‌పై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, బుధవారం యూఐడీఏఐ, ఆర్బీఐలను నిలదీసింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై నవంబర్ 8లోపు స్పందించాలంటూ గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. గూగుల్ పే టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు, ఆధార్ వివరాల సేకరణ నిబంధనలు ఉన్నాయని.. ఇది అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారమని అభిజిత్ మిశ్రా అనే ఫైనాన్షియల్ ఎకనమిస్ట్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీగా ఆధార, బ్యాకింగ్ సమాచారాన్ని సేకరించడం, యాక్సెస్ పర్మిషన్ లాంటి అధికారాలు ఉండవు. ఇక ఆర్బీఐ ఆథరైజేషన్ లేకుండానే లావాదేవీలు నడిపిస్తోందని మరో పిల్ దాఖలు చేశారు. అయితే ఇది పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ కాదని, థర్డీ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అని గతంలోనే కోర్టుకు ఆర్బీఐ, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ తెలిపాయి. చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల ఆఫర్, స్పందించిన గూగుల్ పే -
మీ ఐఫోన్ చోరీకి గురైందా..! ఇక అంతే సంగతులు..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లకు ఆదరణ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు సాటి లేదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. ఒకవేళ ఐఫోన్‌ను పొగొట్టుకున్నా, దొంగిలించిన తిరిగి మొబైల్‌ను ‘ ఫైండ్ మై లాస్ల్ డివైజ్’తో పొందవచ్చును. అంతేకాకుండా మీ ఫోన్లోని డేటాను పూర్తిగా తొలగించవచ్చు. మొబైల్ పోయినా..మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారా..! ఐతే మీరు పొరపడినట్లే..! దొంగిలించిన ఐఫోన్లను నేరస్థులు బ్లాక్ మార్కెట్లో విక్రయించడంతో పాటు, నేరస్థులు ఒక అడుగు ముందుకేసి దొంగిలించిన ఐఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్నే కాకుండా, బ్యాంకు అకౌంట్ వివరాలను తెలుసుకుంటున్నారని బ్రెజిల్ పోలీసులు గుర్తించారు. ఫోన్ల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలను యాక్సెస్ చేస్తూ, సదరు వ్యక్తుల ఐఫోన్ల నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు. బ్రెజిల్ పోలీసుల ప్రకారం నేరస్తులు దొంగిలించిన ఫోన్లలోని సిమ్‌లను వేరే మొబైల్ వేసి సదరు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను, సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేస్తోన్నట్లు నిర్థారించారు. చివరగా సదరు వ్యక్తుల ఫోన్ నంబర్లను తెలుసుకొని ఐఫోన్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను రిసేట్ చేస్తున్నట్లు గుర్తించారు. పాస్‌వర్డ్‌లను క్లౌడ్‌లో సేవ్ చేయకపోవడం మంచింది..! దొంగిలించిన ఐఫోన్ల నుంచి సదరు వ్యక్తుల ఐక్లౌడ్‌లో ఉన్న పాస్‌వర్డ్‌లతో వారి బ్యాంకు ఖాతాలను, సోషల్‌మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్‌లను నేరస్తులు సులువుగా తెలుసుకుంటున్నారని గుర్తించారు. కాగా మొబైల్ ఫోన్లలో బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను క్లౌడ్‌లో సేవ్ చేసుకోకపోవడం మంచిదనీ టెక్ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేవలం ఐఫోన్లలోనే ఇలాంటి ఘటనలు జరిగాయంటే పొరపడినట్లే..! అన్ని స్మార్ట్ఫోన్ల నుంచి సదరు వ్యక్తుల సమాచారాన్ని నేరస్తులు పొందుతున్నారని బ్రెజిల్ పోలీసులు పేర్కొన్నారు. -
వీడనున్న ‘స్విస్’ లోగుట్టు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు నేటి నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది. స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ఫైనాన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్ మారియో ఈనెల 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్‌లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది. -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
సాక్షి, ఖమ్మంక్రైం : సైబర్ క్రైం–క్రిమినల్స్ ఇతివృత్తంతో ఇటీవల విడుదలైన ‘అభిమన్యుడు’ సినిమాను చూశారా..? సైబర్ నేరాలు జరిగే తీరును ఇది కళ్లకు కట్టినట్లు చూపింది. విద్యావంతులైనా, మేధావులైనా, గొప్పోళ్లయినా.. ఎవరైనా సరే, సైబర్ నేరగాళ్లకు చిక్కి ఎలా మోసపోతారో ఆ సినిమా వివరించింది. ‘‘అది సినిమా..! అలా ఎలా మోసం చేస్తారు? అది సాధ్యమా..?’’ అనుకున్న వాళ్లు కూడా ఉండి ఉంటారు. బయట జరుగుతున్న సైబర్ మోసాలే ఆ సినిమాకు ఇతివృత్తంగా మారాయని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే, ఆ సినిమాలో మాదిరిగానే, రెండేళ్ల నుంచి బ్యాంక్ ఖాతాదారుల నెత్తిన టోపీ పెట్టిన–పెడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లే దొంగలు... ఐదుగురితో కూడిన సైబర్ నేరగాళ ముఠాను అరెస్ట్ చేసినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ (సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఆయన శుక్రవారం సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఉల్లింటి సలీం మాలిక్ అలియాస్ సలీం, నారాయణపల్లి అబ్దుల్, ముద్దనూరు మండలం కొలవలి గ్రామస్తుడు బట్టు రామాంజనేయులు అలియాస్ రాంజీ, మైలవరం మండలానికి చెందిన దండి వేణుగోపాల్ అలియాస్ వేణు, ఇదే మండలంలోని వేపరాళ్ల గ్రామస్తుడు బడిగించాల మనోహర్ కలిసి న్యూఢిల్లీలో రెండేళ్ల క్రితం ‘ఏఏఏ’, ‘న్యూహోమ్’, ‘ఫాస్ట్ అండ్ ఈజీ’ అనే కాల్ సెంటర్లలో టెలీకాలర్స్‌గా పనిచేశారు. అక్కడ వీరి పనేమిటంటే... రోజుకు 100 నుంచి 120 మంది బ్యాంక్ ఖాతాదారులకు ఫోన్ చేయడం. ‘మేము ఫలానా బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఈ ఏటీఎం కార్డు అప్డేట్ చేయాలి. ఆధార్ కార్డు లింక్ చేయాలి’ అని చెప్పడం. ఖాతాదారుల ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్ సేకరించడం. వాటిని తమ కాల్ సెంటర్ యజమానికి ఇవ్వడం. తమ యజమానులు చేస్తున్నది ఆన్లైన్ మోసమన్న విషయం వీరికి తెలుసు. సదరు సంస్థ నుంచి వీరికి దండిగానే డబ్బు ముట్టడంతో వీరు విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. మద్యానికి, బెట్టింగ్‌లకు బానిసలయ్యారు. దీంతో డబ్బు సరిపోలేదు. ‘ఎవరి తరఫునో ఎందుకు..? మనమే డైరెక్టుగా జనాలను మోసగించి డబ్బు గడించొచ్చు కదా..’ అనుకున్నారు. ఈ ఐదుగురూ తమ సంస్థల నుంచి బయటపడ్డారు. ముఠాగా ఏర్పడ్డారు. గడించిన అనుభవంతో, రెండేళ్ల క్రితం సైబర్ నేరాలకు దిగారు. ప్రతి మూడు–నాలుగు నెలలోకాసారి సైబర్ నేరాల పద్ధతులు మార్చసాగారు. ఇలా మొదలైంది.. వీరు 2017 ఆగస్టులో నేరాలు మొదలుపెట్టారు. పూర్వం, తమ సంస్థ నుంచి ఎలాగైతే ఫోన్ చేసి వివరాలు సేకరించేవారే, అచ్చం అలాగే చేయసాగారు. ఖాతాదారులకు ఫోన్ చేసి ఏటీఎం, సీవీవీ నంబర్, ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) తెలుసుకునే వారు. వాటి ద్వారా సదరు ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులను తమ అకౌంట్లలోకి మళ్లించేవారు. ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేవారు. ఇలా విలాసవంతమైన జీవితం గడపసాగారు. ఆ సంవత్సరం డిసెంబర్ వరకు ఇలాగే చేశారు. జనవరి 2018లో రూటు మార్చారు. తాము సేకరించిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసేవారు. పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీల పేర్లు చెప్పి, వాటి కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించేవాళ్లు. ‘లక్కీ డ్రాలో మీ నంబర్ ఎంపికైంది. 25వేల నుంచి 30వేల రూపాయల విలువైన ఫోన్/వస్తువు మీకు కేవలం మూడువేల నుంచి నాలుగువేల రూపాయలకే వస్తుంది. మీ పూర్తి అడ్రస్ చెబితే పంపిస్తాం. డబ్బును మా అకౌంట్లో వేయాలి’ అని, అకౌంట్ నంబర్ ఇచ్చేవాళ్లు. ఏవేవో పనికిరాని వస్తువులను ప్యాక్ చేసి వీపీపీ/సీఓడీ పద్ధతిలో పార్శిల్ పంపేవారు. సదరు చిరునామాదారులు వాటిని చూసుకుని, వాటిని పంపిన సంస్థకు వెంటనే ఫోన్ చేసేవారు. తమ డబ్బు తిరిగిచ్చేయాలని అడిగేవారు. అప్పుడు ఆ సైబర్ మోసగాళ్లు.. ‘సరే, మీ డబ్బును వాపస్ చేస్తాం. మీ ఏటీఎం కార్డ్, సీవీవీ నంబర్ చెప్పండి. కొద్దిసేపటి తరువాత ఓటీపీ నంబర్ మెసేజ్ వస్తుంది. దానిని చూసి చెప్పగానే మీకు డబ్బు వచ్చేస్తుంది’ అని నమ్మించేవారు. సదరు చిరునామాదారులు చెప్పిన ఓటీపీ నంబర్ ఆధారంగా ఈ మోసగాళ్లు తమ మొబైల్ వాలెట్‌లోకి (చిరునామాదారుడి ఖాతాలోని) డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. ఆ తరువాత బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకునేవారు. 2018 మార్చిలో వీరు మరోసారి రూటు మార్చారు. ఈసారి ఇంకో పద్ధతిలో మోసగించడం మొదలెట్టారు. వివిధ రకాల షాషింగ్ వెబ్సైట్లలో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకునేవారు. దానిని ఏదో ఒక ఫేస్బుక్ అకౌంట్‌కు ఫేక్ లింక్ పంపి, దానిని హ్యాక్ చేసేవారు. ఆ ఫేస్బుక్ ఖాతాదారు ఐడీ, పాస్వర్డ్ తస్కరించేవారు. అతని/ఆమె పేరుతో దగ్గరి మిత్రులతో చాట్ చేసేవారు. ‘ఏటీఎం కార్డు ఫొటో పెడితే డబ్బులు వస్తాయి’ అని నమ్మించేవారు. ఏటీఎం పిక్ ద్వారా కార్డు, సీవీవీ నెంబర్ తెలుసుకునేవారు. ఆ తరువాత ‘వేరే ఫ్రెండ్‌ను ఇన్వైట్ చేస్తే (ఆహ్వానిస్తే) డబ్బులు వస్తాయి’ అని చెప్పి ఓటీపీ నంబర్ కూడా చాటింగ్‌లోనే మెసేజ్ చేయాలని చెప్పేవారు. అలా బ్యాంక్ ఖాతా నుంచి నగదును ఈ నేరగాళ్లు తమ మనీ వాలెట్‌లోకి, అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసుకునేవారు. ఇలా మే నెల వరకు మోసగించారు. ఇలా చిక్కారు... ఇలా వీరి సైబర్ దందా రెండేళ్లపాటు నిరాటంకంగా సాగింది. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ముగ్గురు ఖాతాదారుల నుంచి డబ్బును ఓటీపీ ద్వారా తస్కరించారు. బాధితులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివే... ఖమ్మం వన్ టౌన్లో రెండు, సత్తుపల్లిలో రెండు, వైరాలో ఒకటి సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. వీటిపై సీపీ తఫ్సీర్ ఇక్బాల్ దృష్టి సారించారు. ఆయన మార్గదర్శకత్వంలో ఖమ్మం ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఖమ్మం త్రీ టౌన్ సీఐ వెంకన్నబాబు, సైబర్ క్రైమ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రత్యేక పోలీస్ బృందం తీవ్రంగానే కసరత్తు చేసింది. వెతకగా.. వెతకగా... తీగ దొరికింది. దానిని పట్టుకుని లాగితే.. డొంకంతా కదిలింది. సైబర్ నేరగాళ్ల వివరాలు తెలిశాయి. ఈ ముఠాను వైఎస్సార్ జిల్లాలో, ఢిల్లీలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముఠా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బ్యాంక్ ఖాతాదారుల నుంచి దాదాపుగా రూ.4లక్షలకు పైగా కాజేసినట్టు తేలింది. నేరగాళ్ల మనీ వాలెట్ల నుంచి రూ.1,07,000ను బాధితుల అకౌంట్లలోకి తిరిగి జమ చేయించారు. ఈ నేరగాళ్ల నుంచి రూ.1.39లక్షల విలువైన పది సెల్ఫోన్లు, రూ.1.04లక్షల నగదు, 15 సిమ్ కార్డులు స్వాధీనపర్చుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. -
ఫోన్ చేశారు..డబ్బు లాగేశారు
రొంపిచర్ల: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఎకౌంట్లోని నగదు మాయం చేసిన ఘటన రొంపిచర్లలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం... రొంపిచర్లకు చెందిన అంగలూరి ఏడుకొండలుకు మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫోన్ (95700 24985) వచ్చింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీ ఎకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉందని ఓ వ్యక్తి మాట్లాడాడు. బ్యాంకు ఎకౌంట్ నంబరు, ఆధార్ నంబరు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లు చెప్పాలని కోరాడు. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.42,400 దుండగుడు తన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అనంతరం ఏడుకొండలు ఫోన్‌కు డబ్బులు విత్‌డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో కంగారుపడిన అతను బ్యాంకుకు వెళ్లి పాస్‌బుక్‌లో ఎంట్రీలు నమోదు చేయించుకున్నాడు. అందులో డబ్బులు ఎనిమిది విడతలుగా వేరే ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయినట్లు వచ్చింది. తాను కష్టపడి కూలి నాలీ చేసుకున్న డబ్బును ఫోన్ కాల్‌తో లాగేసుకోవడంతో లబోదిబోమన్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
సిమ్ బ్లాక్ చేయించి డబ్బు కాజేస్తారు!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకుల కాల్‌సెంటర్ల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఆన్లైన్లో అందినకాడికి కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పని వినియోగదారుల్ని ‘4జీ’తో బురిడీ కొట్టిస్తున్నారు. వినియోగిస్తున్న సిమ్‌కార్డుల్ని వారితోనే బ్లాక్ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. దాదాపు రూ.లక్ష కోల్పోయిన ఓ నగరవాసి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ‘నయా’వంచన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రకంగా దోచారు... బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి ఖాతాలు ఖాళీ చేసే నేరాలు దాదాపు రెండేళ్లుగా జోరుగా సాగుతున్నాయి. జుమ్తార, ఢిల్లీ కేంద్రాలుగా వ్యవస్థీకృతంగా ‘ఈ–నేరాలు’ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆయా ప్రాంతాల్లో దీని కోసం ప్రత్యేకంగా కాల్సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాదారులకు ఫోన్లు చేయిస్తుంటారు. తాము ఫలానా బ్యాంక్ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకునే నేరగాళ్లు క్రెడిట్/డెబిట్ కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామనో, ఆధార్ సీడింగ్ అనో చెప్పి వినియోగదారుల నుంచి కార్డ్, పిన్ నెంబర్లతో పాటు ఓటీపీ సైతం తీసుకుంటున్నారు. ఆపై ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వారి ఖాతాల్లో ఉన్న నగదు స్వాహా చేయడం, ఈ–కామర్స్ సైట్స్‌లో ఖరీదు చేయడం చేసి మోసం చేస్తున్నారు. కస్టమర్లకు ‘కొంత’ అవగాహన రావడంతో... ఈ తరహా సైబర్ నేరాలు, నేరగాళ్లు చేసే మోసాలపై వినియోగదారులకు కొంతమేర అవగాహన ఏర్పడింది. దీంతో బ్యాంకుల పేరుతో కాల్స్ చేస్తున్న కేటుగాళ్లకు అన్ని వివరాలూ చెప్తున్నప్పటికీ... ఓటీపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అనుమానిస్తున్నారు. దీంతో ఆ నెంబర్ చెప్పకుండా ఫోన్లు కట్ చేస్తున్నారు. ఈ రకంగా ‘నష్టపోతున్నామని’ గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఇటీవల ‘4జీ’ ఎత్తులు వేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ‘3జీ’ నుంచి ‘4జీ’కి అప్‌గ్రేడ్ కావడంతో అనేక సెల్‌ఫోన్ సర్వీసు ప్రొవైడర్లు సైతం అందుకు తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్ వినియోగదారులు వాడుతున్నవి ‘3జీ’ సిమ్‌కార్డులు కావడంతో ‘4జీ’కి తగ్గట్టు అప్‌గ్రేడ్ చేసిన సిమ్‌కార్డుల్ని అందిస్తూ మార్పిడికి అవకాశం కల్పిస్తున్నారు. సిమ్‌కార్డుల్ని సైతం తీసుకుంటున్నారు... ఇలా కొత్త సిమ్ పొందాలనుకున్న వినియోగదారులు ఆయా సెల్‌ఫోన్ కంపెనీల ఔట్లెట్స్ నుంచి కొత్త సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. అప్పటికే వినియోగిస్తున్న సిమ్ నుంచి కొత్త సిమ్‌పై ఉన్న నెంబర్‌ను నిర్దేశిత నెంబర్లకు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మాత్రమే కొత్త సిమ్ యాక్టివేట్ కావడంతో పాటు పాత సిమ్ బ్లాక్ అవుతుంది. సరిగ్గా ఇదే విధానాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఓటీపీ మినహా మిగతా వివరాలను వినియోగదారుల నుంచి సంగ్రహిచిన తర్వాత వారి పేర్లతో ‘4జీ’ సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. సర్వీసు ప్రొవైడర్ పంపిస్తున్నట్లు ఈ సిమ్‌కార్డు నెంబర్‌ను వినియోగదారుడికి ఎస్సెమ్మెస్ రూపంలో పంపి.. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ సంఖ్యను ఫలానా నెంబర్‌కు పంపాలని కోరుతున్నారు. అనుమానం రాకుండా ‘పని’ పూర్తి... సదరు ఎస్సెమ్మెస్ సర్వీసు ప్రొవైడర్ నుంచే వచ్చిందని భావిస్తున్న వినియోగదారులు సదరు సిమ్ నెంబర్‌ను కాల్‌సెంటర్‌కు ఎస్సెమ్మెస్ చేస్తున్నారు. దీంతో కొద్దిసేపటికే ఈ సిమ్ బ్లాక్ కావడంతో పాటు నేరగాళ్ల దగ్గర ఉన్న ‘4జీ’ సిమ్ యాక్టివేట్ అవుతోంది. అప్పటికే సదరు వినియోగదారుడికి సంబంధించిన కార్డ్, పిన్ వివరాలు వారి వద్ద ఉండటంతో వాటితో ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారు. ‘4జీ’ యాక్టివేషన్ కారణంగా ఓటీపీ సైతం వారికే చేరుతోంది. ఇలా వినియోగదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా కొల్లగొట్టేస్తున్నారు. కస్టమర్‌కు ఈ విషయం తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఈ తరహాలో టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతాలో ఉన్న దాదాపు రూ.లక్ష కాజేశారు. ఇటీవల ఈ విధంగా నష్టపోయిన ఐదుగురు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తతే ఉత్తమం ‘ఇలాంటి నేరాల బారినపడకుండా ఉండలంటే సెల్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండమే ఉత్తమం. ఇటీవల సిమ్ బ్లాక్ అనే సమస్య ఉత్పన్నం కావట్లేదు. అలా ఎవరి సిమ్‌కార్డ్ అయినా బ్లాక్ అయితే తక్షణం అప్రమత్తం కావాలి. ఫలానా నెంబర్‌ను కాల్ సెంటర్‌కు పంపండి అంటూ వచ్చే ఎస్సెమ్మెస్‌లనూ అనుమానించాల్సిందే. సదరు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించకుండా ఇలాంటివి పంపరాదు. మోసపోయిన వారు ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి’. – కేసీఎస్ రఘువీర్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ