ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లకు ఆదరణ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు సాటి లేదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. ఒకవేళ ఐఫోన్‌ను పొగొట్టుకున్నా, దొంగిలించిన తిరిగి మొబైల్‌ను ‘ ఫైండ్ మై లాస్ల్ డివైజ్’తో పొందవచ్చును. అంతేకాకుండా మీ ఫోన్‌లోని డేటాను పూర్తిగా తొలగించవచ్చు.
మొబైల్ పోయినా..మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారా..! ఐతే మీరు పొరపడినట్లే..! దొంగిలించిన ఐఫోన్లను నేరస్థులు బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడంతో పాటు, నేరస్థులు ఒక అడుగు ముందుకేసి దొంగిలించిన ఐఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్నే కాకుండా, బ్యాంకు అకౌంట్ వివరాలను తెలుసుకుంటున్నారని బ్రెజిల్ పోలీసులు గుర్తించారు.
ఫోన్ల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలను యాక్సెస్ చేస్తూ, సదరు వ్యక్తుల ఐఫోన్ల నుంచి డబ్బులను ఊడ్చేస్తున్నారు. బ్రెజిల్ పోలీసుల ప్రకారం నేరస్తులు దొంగిలించిన ఫోన్లలోని సిమ్‌లను వేరే మొబైల్ వేసి సదరు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను, సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేస్తోన్నట్లు నిర్థారించారు. చివరగా సదరు వ్యక్తుల ఫోన్ నంబర్లను తెలుసుకొని ఐఫోన్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను రిసేట్ చేస్తున్నట్లు గుర్తించారు.
పాస్‌వర్డ్‌లను క్లౌడ్‌లో సేవ్ చేయకపోవడం మంచింది..!
దొంగిలించిన ఐఫోన్ల నుంచి సదరు వ్యక్తుల ఐక్లౌడ్‌లో ఉన్న పాస్‌వర్డ్‌లతో వారి బ్యాంకు ఖాతాలను, సోషల్‌మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్‌లను నేరస్తులు సులువుగా తెలుసుకుంటున్నారని గుర్తించారు. కాగా మొబైల్ ఫోన్లలో బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను క్లౌడ్‌లో సేవ్ చేసుకోకపోవడం మంచిదనీ టెక్ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేవలం ఐఫోన్లలోనే ఇలాంటి ఘటనలు జరిగాయంటే పొరపడినట్లే..! అన్ని స్మార్ట్‌ఫోన్ల నుంచి సదరు వ్యక్తుల సమాచారాన్ని నేరస్తులు పొందుతున్నారని బ్రెజిల్ పోలీసులు పేర్కొన్నారు.
మీ ఐఫోన్ చోరీకి గురైందా..! ఇక అంతే సంగతులు..!
Published Thu, Jul 8 2021 7:57 PM | Last Updated on Thu, Jul 8 2021 9:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment