
పాస్‌బుక్ చూపుతున్న బాధితుడు ఏడుకొండలు
రొంపిచర్ల: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఎకౌంట్‌లోని నగదు మాయం చేసిన ఘటన రొంపిచర్లలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం... రొంపిచర్లకు చెందిన అంగలూరి ఏడుకొండలుకు మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫోన్ (95700 24985) వచ్చింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీ ఎకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉందని ఓ వ్యక్తి మాట్లాడాడు. బ్యాంకు ఎకౌంట్ నంబరు, ఆధార్ నంబరు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లు చెప్పాలని కోరాడు. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.42,400 దుండగుడు తన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు.
అనంతరం ఏడుకొండలు ఫోన్‌కు డబ్బులు విత్‌డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. దీంతో కంగారుపడిన అతను బ్యాంకుకు వెళ్లి పాస్‌బుక్‌లో ఎంట్రీలు నమోదు చేయించుకున్నాడు. అందులో డబ్బులు ఎనిమిది విడతలుగా వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అయినట్లు వచ్చింది. తాను కష్టపడి కూలి నాలీ చేసుకున్న డబ్బును ఫోన్ కాల్‌తో లాగేసుకోవడంతో లబోదిబోమన్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment