bank employees union
-
All India bank strike: 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏఐబీఈఏ ఈ నెల 19న (రేపు) సమ్మెకు పిలుపునిచ్చింది. అధికారులు ఇందులో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరింగ్ వంటి లావాదేవీలపై కొంత ప్రభావం ఉండవచ్చని అంచనా. సమ్మె జరిగితే పరిస్థితుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైన పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించాయి. కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయడం వల్ల కస్టమర్ల ప్రైవసీకి, వారి సొమ్ముకు రిస్కులు పొంచి ఉండటంతో పాటు కింది స్థాయిలో రిక్రూట్మెంట్ తగ్గిపోతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, సమ్మెలు జరపడం మినహా తమ ఆందోళనను వ్యక్తపర్చేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి. ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించడం ఇందుకు కారణం. తొమ్మిది బ్యాంకు యూనియన్లకు నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఐబీఏతో చర్చలు జూలై 1 నుంచి మొదలు కానున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని ఉద్యోగ సంఘాలు బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి. పింఛన్ దారులందరికీ పెన్షన్‌ను నవీకరించడం, సవరించడంతోపాటు జాతీయ పెన్షన్ పథకాన్ని తొలగించడం, బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి డిమాండ్ల జాబితాలో ఉన్నాయి. -
బ్యాంకుల వరుస సెలవులు, క్లారిటీ
సాక్షి,ముంబై: సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు మూతపడనున్నాయనే పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. బ్యాంకులకు ఆరో రోజులు సెలవు అనే వదంతుల్లో ఏమాత్రం నిజంలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చింది. అటు జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు స్పందించారు. వాట్సాప్, తదితర గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతున్న మెసేజ్‌లను తోసిపుచ్చారు. దీనికి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు చెప్పారు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోనుందన్న వస్తున్న వార్తల్లోనూ ఏమాత్రం నిజంలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వరసగా 3రోజులకు మించి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి బ్యాంకులు ఆరు రోజులపాటు మూతపడనున్నాయనే వార్తల్లో నిజం లేదని సంఘం ఉపాధ్యక్షుడు అశ్వానీ రాణా వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 4, 5 తేదీల్లో సమ్మె చేపట్టనుంది కేవలం రిజర్వు బ్యాంక్ ఉద్యోగులు మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సమ్మెమూలంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అలాగే జన్మాష్టమి ఐచ్ఛిక సెలవేనని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులకు మాత్రమే సెప్టెంబర్ 3న సెలవు అని రాణా తెలిపారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయన్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సోమవారం సెలవు ప్రకటించాయి. కాగా సెప్టెంబర్ 2 ఆదివారం సెలవు, సెప్టెంబర్ 3 జన్మాష్టమి. ఆ తరువాత 4, 5 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారనీ, దీంతోపాటు 8, 9 తేదీలు రెండవ శనివారం, ఆదివారం కావడంతో వరస సెలవులంటూ మెసేజ్‌లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు, జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. Government rubbishes rumours on social media that "banks will be closed for 6 days in the first week of September 2018". Says banks will remain open all days except Sunday in most states. pic.twitter.com/n7errYGCXu — PIB India (@PIB_India) August 31, 2018 -
నల్లకుబేరులకు నగదు ఎలా చేరుతుందంటే!
-
నల్లకుబేరులకు నగదు ఎలా చేరుతుందంటే!
హైదరాబాద్: నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద బుధవారం బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలకు ఆర్బీఐ సరిపడా నగదు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ బ్యాంకుల ద్వారానే నల్లకుబేరులకు కోట్లలో నగదు చేరుతోందని ఆయన ఆరోపించారు. పట్టుబడిన నల్లకుబేరుల ద్వారా నిందితులను విచారించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పారు.