bank officer
-
సిబ్బందిని బండబూతులు తిట్టిన బ్యాంక్ ఉన్నతోద్యోగి.. వీడియో వైరల్
వ్యాపారానికి సంబంధించి ఉద్యోగులకు టార్గెట్లు అన్ని ప్రైవేటు కంపెనీల్లోనూ సాధారణంగా ఉండేవే. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పైత్యం మరీ ఎక్కువగా ఉంటుంది. రిటైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా బ్యాంకులు చేస్తుంటాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించేందుకు ఉద్యోగులకు టార్గెట్లు పెడుతుంటాయి. ఇలా టార్గెట్లను సాధించే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నతోద్యోగి కింది స్థాయి ఉద్యోగులపై నోరు పారేసుకున్నారు. బండబూతులు తిట్టారు. ఆన్లైన్లో జరిగిన మీటింగ్‌లో ఉన్నతోద్యోగి సిబ్బందిని దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. సదరు బ్యాంక్ ఉన్నతోద్యోగి రోజుకు 75 ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించాలని టార్గెట్ ఇచ్చాడని, అది సాధించడంలో విఫలమైన ఉద్యోగిని బెంగాలీ భాషలో తిట్టాడని మరో యూజర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఈ వైరల్ వీడియోపై స్పందించిన బ్యాంక్ యాజమాన్యం సదరు ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ట్విటర్ పెట్టిన వీడియోపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీస్ మేనేజర్ అజయ్ స్పందిస్తూ ఆ ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేశామని, బ్యాంకు నిబంధనల మేరకు పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #HDFC bank’s Manager Mr. Pushpal Roy. Employees were treated in an unprofessional way. I would have given back right there. Not sure why & how employees are tolerating. He is completely demoralised and done blatant attacked on employees. Should be fired ! #toxicworkenvironment pic.twitter.com/m0IrfqXl6b — Sara (@srchetlur) June 5, 2023 -
వేటు మొదలైంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమార్కులపై వేటు మొదలైంది. పెద్ద నోట్ల రద్దును అడ్డం పెట్టుకుని నగదును దొడ్డిదారిన బయటకు పంపించి.. నల్ల కుబేరులకు సహకరించిన బ్యాంకు అధికారులపై చర్యలు మొదలు కావడంతో ఆ వర్గాల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్ 31 వరకూ బ్యాంకుల్లో సీసీ టీవీ ఫుటేజ్‌లను అందించాలని ఆదేశాలు వచ్చాయి. మరోవైపు ప్రధాన బ్యాంకుల్లో ఆడిటింగ్ మొదలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాంచిలపై ఆర్బీఐ, ఐటీతోపాటు సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. తాజాగా తణుకు ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పెద్ద నోట్ట రద్దు అనంతరం నగదు చెల్లింపుల్లో నిబంధనల్ని బేఖాతరు చేయడంతోపాటు కొందరు నల్లకుబేరులకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఆర్బీఐ అధికారులు ఆ బ్యాంకులో విస్తృత సోదాలు నిర్వహించి, అక్రమాలు జరిగినట్టు తేల్చడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో కొత్తనోట్లు బయటపడ్డాయి. పకడ్బందీగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు వచ్చిన ఈ నోట్లు బయటకు ఎలా వెళుతున్నాయనే దానిపై ఇప్పటికే విచారణ మొదలైంది. బ్యాంకు మేనేజర్లకు, సిబ్బందికి 20 నుంచి 30 శాతం కమీషన్ ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు మార్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏలూరులో రూ.24 లక్షలు మార్చుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. తర్వాత ఏలూరు వన్‌టౌన్‌లో సూర్యా అపార్ట్మెంట్లో ఎలబాక బాలకృష్ణ నుంచి రూ.19 లక్షల నగదు చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతని ఇంటిపక్కనే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ డబ్బులు బయటకు వచ్చినట్టు పోలీసులు అనుమానించారు. ఈ కోణంలో ఆర్బీఐæ అధికా రులూ విచారణ జరుపుతున్నట్టు సమాచారం. రోజులు గడుస్తున్నా అవే కష్టాలు పెద్దనోట్ల రద్దుతో కష్టాలు మొదలై 41 రోజులు గడిచాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పేదలు, సామాన్యులు బారులు తీరుతూనే ఉన్నారు. భీమవరం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద బ్యాంకు తెరవక ముందే జనం బారులు తీరి కనిపించారు. చంటి పిల్లలతో తల్లులు, నిలబడే ఓపికలేని వృద్ధులు పడిగాపులు పడుతూ కనిపించారు. భీమడోలు ఎస్బీఐ వద్ద నేటికీ రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం బ్యాంకుల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. నరసాపురంలో ఉదయం నుంచే బ్యాంకుల ఎదుట జనం క్యూ కట్టారు. నరసాపురం పట్టణం, మండలం, మొగల్తూరు మండలంలో ఎక్కడా ఏటీఎంలు పనిచేయలేదు. తాళ్లపూడి మండలంలోని ప్రక్కిలంక స్టేట్ బ్యాంకులో నగదు లేదని బోర్డులు పెట్టారు. ఆంధ్రాబ్యాంకులో నగదు లేదని చెప్పడంతో ఖాతాదారులు నిరాశ చెందారు. టి.నరసాపురం ఆంధ్రాబ్యాంకు వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడలేక ఖాతాదారులు వారి పాదరక్షలను లైన్లో పెట్టి సమీపంలో షాపుల వద్ద వేచి ఉంటున్నారు. టి.నరసాపురం ఆంధ్రాబ్యాంకు, బొర్రంపాలెం సిండికేట్ బ్యాంకుల్లో సోమవారం నగదు చెల్లింపులు జరగలేదు. మక్కినవారిగూడెం ఒక్కొక్క ఖాతాదారుడికి రూ.2 వేల చొప్పున 100 మందికి రూ.2 లక్షలు పంపిణీ చేశారు. -
దొంగే.. దొంగా.. దొంగా అన్నట్టు..!
♦ ప్రభుత్వ భూమి తనఖా పెట్టి రూ.10 కోట్ల రుణం ♦ ఆపై సర్కార్ భూములు కాపాడాలని హడావుడి ♦ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి అధికారులకు విజ్ఞప్తి కూకట్పల్లి: ప్రభుత్వ భూమి తనఖా పెట్టి రూ.10 కోట్లు రుణంగా పొందిన ఓ ఘనుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగే దొంగా..దొంగా అన్నట్లుగా తానే ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపి బ్యాంక్ నుంచి కోట్లు రుణం పొందడమే కాకుండా.. ఆ ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యేతో కలిసి అధికారులను కోరడం గమనార్హం. బాలానగర్ మండల పరిధిలోని శంశీగూడ గ్రామ సర్వేనెం. 57లో 294 ఎకరాలు ఖాస్రా పహాణి ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉంది. అయితే సర్వే నెం.57/3/1 పేరుతో 9 వేల గజాల స్థలాన్ని శంశీగూడకు చెందిన జోగిపేట భాస్కర్ అనే వ్యక్తి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఠి బ్రాంచిలో 30 డిసెంబర్ 2011లో తనఖా పెట్టి రూ. 10 కోట్లు రుణం పొందాడు. అయితే క్షేత్ర స్థాయిలో ఎలాంటి ప్రత్యేక బై నెంబర్లతో పట్టాభూమి లేకపోగా, రెవెన్యూ రికార్డుల ప్రకారం 57/3/1 సర్వే నెంబర్ కూడా లేదని రెవెన్యూ అధికారులంటున్నారు. ద్విచక్ర వాహనానికి రుణం మంజూరుకు కూడా సరైన కాగితాలు లేవనే సాకుతో దరఖాస్తుదారుడిని వెనక్కి పంపే బ్యాంకు అధికారులు ఏకంగా ప్రభుత్వ భూమిని తనఖా పెట్టుకొని రూ. 10 కోట్ల రుణం మంజూరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కార్పొరేటర్ ఫిర్యాదుతో వెలుగులోకి... తాను చేసిన మోసాలు బయటకు పొక్కనీయకుండా వ్యవహారం చక్కబెట్టడంలో నేర్పరి అయిన భాస్కర్ ఏకంగా స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25న స్థానిక కార్పొరేటర్ డి.వెంకటేశ్‌గౌడ్ శంశీగూడ గ్రామంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, బాలానగర్ మండల తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. సదరు వినతి పత్రంలో సర్వేనెం. 57లో బై నెంబర్ల పేరుతో కబ్జాచేయడమే కాకుండా బ్యాంకు నుంచి రుణం పొందిన భాస్కర్ మోసాన్ని బయటపెట్టారు. కాగా, మరుసటి రోజే ఎమ్మెల్యేతో కలిసి భాస్కర్ జాయింట్ కలెక్టర్‌ను కలువడం అనుమానాలకు తావిస్తోంది. ఉలిక్కి పడ్డ బ్యాంక్ అధికారులు ప్రభుత్వ భూమికి పదికోట్ల రుణం మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఐదేళ్లకు ఆలస్యంగా మేల్కొన్నారు. బుధ, గురువారాలలో బాలానగర్ మండల కార్యాలయంలో, శంశీగూడ గ్రామంలో సదరు రుణం మంజూరు చేసిన భూముల వివరాలను కనుక్కొనేందుకు యత్నించారు. రెవెన్యూ రికార్డుల్లో లేకపోగా క్షేత్ర స్థాయిలో చూపించిన ఫొటోలకు, భూములకు పొంతన లేకపోవడంతో ఆందోళనకు గురైనట్లు తెలిసింది. కాగా, ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తూ తన తప్పులు బయటికి రాకుండా చూసుకుంటున్న భాస్కర్‌పై గతంలోనే తహసీల్దార్ వనజాదేవి భూ కబ్జాకేసు నమోదు చేయడం గమనార్హం.