Banking Regulation Bill
-
వేగంగా బ్యాంకుల ప్రైవేటీకరణ..కేంద్రం మరో కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింటిని ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ రానున్న రోజుల్లో కేబినెట్ అనుమతి కోరే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949కు సవరణలు ప్రతిపాదిస్తోంది. వీటితోపాటు ఇతర నిబంధనలను సైతం మార్పు చేసే యోచనలో ఉంది. ఉద్యోగులకు వీఆర్ఎస్ : కాగా ఏయే పీఎస్‌బీలను ప్రైవేటీకరించేది ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ రెండు బ్యాంకుల్లో వాటా విక్రయానికి వీలుగా 20 శాతం విదేశీ పెట్టుబడుల పరిమితిని తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా ఈ రెండు బ్యాంకుల ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయ స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని సైతం ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి ముసాయిదా కేబినెట్ నోట్‌పై అంతర్మంత్రిత్వ చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. బ్యాంకుల ప్రైవేటైజేషన్ సంబంధ సూచనలను పరిగణణలోకి తీసుకుని తుది ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: బ్యాంకుల ప్రైవేటీకరణే పరిష్కారమా? -
వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు
డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలే లక్ష్యంగా ముందుకు కదులుతున్న కేంద్రం, ఈ దిశలో తాజాగా బ్యాంకింగ్‌పై దృష్టి సారించింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో (జూలై 17 నుంచి ఆగస్టు 11) బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సబ్సిడరీ బ్యాంక్స్) యాక్ట్, 1959, సంబంధిత ఇతర చట్టాల రద్దు ప్రతిపాదనలతో ఈ సమగ్ర బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీనితోపాటు నియంత్రణలో ఉండని డిపాజిట్ల స్కీమ్‌లు రద్దు బిల్లు, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ బిల్లులపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తునట్లు ఒక ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. డిపాజిటర్లను మోసం చేసే ఎవరికైనా 10 సంవత్సరాల వరకూ జరిమానా, భారీ జైలు శిక్షలు పడేలా చట్టాలు రూపొందుతున్నాయి. బ్యాంకింగ్ మొండి బకాయిల సమస్య పరిష్కారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆర్డినెన్స్జారీసహా పలు చర్యలను కేంద్రం తీసుకున్న సంగతి తెలిసిందే.