Bankruptcy policies
-
దివాలా కోడ్ అమలుతో...కార్పొరేట్ ‘రుణ’ ఫ్యూడలిజానికి ముగింపు!
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) అమలుతో కార్పొరేట్ రుణ గ్రహీతల ఫ్యూడలిజం రోజులు ముగిసిపోయినట్లయ్యిందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండస్ట్రీ సంస్థ– సీఐఐ ‘ఐదేళ్ల ఐబీసీ, 2016 : తదుపరి ముందడుగు’ అన్న అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో సుబ్రమణ్యం మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ఐబీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒత్తిడిలో, దివాలాలో ఉన్న ఆస్తులకు సంబంధించి మార్కెట్ ఆధారితమైన అలాగే నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన రిజల్యూషన్ పక్రియ ప్రారంభమైంది. ఐబీసీ కింద దివాలా లేదా స్ట్రెస్ కంపెనీ ముందుకు వచ్చినట్లయితే, క్రెడిటార్ల కమిటీ (సీఓసీ) రం గంలోకి వచ్చేస్తుంది. కంపెనీ వ్యవహారాల నిర్వహణ రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. రిజల్యూషన్ విజయవంతం కాకపోతే, కంపెనీ లిక్విడేషన్ పక్రియకు చేరుకుంటుంది. చదవండి : 3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి ఐబీసీకి ముందు కార్పొరేట్ రుణ గ్రహీతలు తమ నిర్ణయాలే అంతిమమని భావించేవారు. అంతా తాము చెప్పినట్లే జరగాలని, జరుగక తప్పదన్నది వారి అభిప్రాయంగా ఉండేది. అలాంటి రోజులు ప్రస్తుతం పూర్తిగా పోయాయి. మళ్లీ అలాంటి ఫ్యూడలిజం రోజులు వెనక్కు కూడా రాబోవు. ఫ్యూడలిజం ధోరణి ఎంతమాత్రం సరికాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఫ్యూడలిజం ధోరణి దారుణమన్నది నా భావన. ఏ వ్యవస్థలోనైనా ధర్మం అనే భావన ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా ఇది ఇమిడి ఉంటుంది. ఈ దిశలో అడుగులను ఐబీసీ వేగవంతం చేసింది. కేసుల సత్వర పరిష్కారం: రాజేష్ వర్మ సమావేశంలో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై నాటికి దివాలా చట్టం కింద ‘అడ్మీషన్’ స్థాయికి ముందే 17,837 కేసులు పరిష్కారమయినట్లు తెలిపారు. ఈ కేసుల విలువ దాదాపు రూ.5.5 లక్షల కోట్లని వెల్లడించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దివాలా వ్యవహారాలపై నెలకొన్న సానుకూల పరిస్థితిని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒక్క ఏడాది జూలై వరకూ చూస్తే, 4,570 కేసులు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద అడ్మిట్ అయ్యాయని, వీటిలో 657 కేసులు అప్పీల్, రివ్యూ ఇతర కారణాలతో ముగిసిపోయాయని తెలిపారు. 466 కేసుల ఉపసంహరణ జరిగిందని పేర్కొన్నారు. 404 కేసుల ద్వారా విలువకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మేర పరిష్కారమయ్యాయని తెలిపారు. ఐబీసీకి ఆరు సవరణల ద్వారా వివిధ లొసుగులను తొలగించి దీనిని మరింత పటిష్టంగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు. -
అమెరికాలో ఉన్నాడని కచ్చితంగా చెప్పలేం!
వాషింగ్టన్: పీఎన్బీ స్కాంలో నిందితుడు, వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ అమెరికాలో ఉన్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు తమ దృష్టికి వచ్చాయని, నీరవ్ అమెరికాలో ఉన్నారని చెప్పలేమని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. అతని ఆచూకీపై భారత్‌కు సాయంపై ఆయన స్పందిస్తూ.. భారతీయ అధికారులకు న్యాయ సాయానికి సంబంధించిన ప్రశ్నల కోసం న్యాయ శాఖనే సంప్రదించాలన్నారు. నీరవ్ అంశంపై స్పందించేందుకు అమెరికా న్యాయ శాఖ మాత్రం నిరాకరించింది. మరోవైపు, అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేసిన నీరవ్ మోదీపై రుణదాతలు ఒత్తిడి చేయకుం డా న్యూయార్క్‌లోని కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీ దక్షిణ న్యూయార్క్‌లోని దివాలా కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. -
దివాళా కోరు విధానాలు
మిర్యాలగూడ : పాలకుల దివాళా కోరు విధానాల వల్ల రైతులు, కార్మికులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మేడే సందర్భంగా సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక హనుమాన్‌పేటలోని సీఐటీయూ కార్యాలయం నుంచి రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం రాజీవ్‌చౌక్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర రావాలని, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే మేడే స్ఫూర్తిగా ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో మిర్చి, కందులు పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు కావల్సినవి, అసరమైనవి అడిగితే అడగని వాటి గురించి హామీలు ఇస్తాడని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి, లక్ష మందికి ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేయడం వల్ల పేద వర్గాలే తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రూ.7.50 లక్షల కోట్లు కార్పోరేట్ శక్తులకు రాయితీలు కల్పించారని, లెవీ విధానాన్ని తొలగించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు వ్యాపారులు, కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని వివరించారు. పేద ప్రజల గురించి పట్టించుకోని పాలకులను ప్రతిఒక్కరు నిలదీయాలన్నారు. దోపిడిలేని సమానత్వం రావాలని, సమసమానత్వం కోసం ఉద్యమించాలని కొరా రు. రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బాగుపడితేనే బంగారు తెలం గాణా వస్తుందని, కానీ పాలకులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షత వహించగా సభ, ర్యాలీలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ మాలి పురుషోత్తంరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మహ్మద్‌బిన్ సయ్యద్, కౌన్సిలర్ ఘని, నాయకులు మల్లుగౌతమ్‌రెడ్డి, గాదె పద్మ మ్మ, పాపానాయక్, చంద్రశేఖర్‌యాదవ్, జగదీశ్చంద్ర, రహమాన్‌ఖాన్, రవినాయక్, అమ్జద్, శంకర్, పరురాములు పాల్గొన్నారు.