వాషింగ్టన్: పీఎన్‌బీ స్కాంలో నిందితుడు, వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ అమెరికాలో ఉన్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలు తమ దృష్టికి వచ్చాయని, నీరవ్ అమెరికాలో ఉన్నారని చెప్పలేమని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. అతని ఆచూకీపై భారత్‌కు సాయంపై ఆయన స్పందిస్తూ.. భారతీయ అధికారులకు న్యాయ సాయానికి సంబంధించిన ప్రశ్నల కోసం న్యాయ శాఖనే సంప్రదించాలన్నారు. నీరవ్ అంశంపై స్పందించేందుకు అమెరికా న్యాయ శాఖ మాత్రం నిరాకరించింది. మరోవైపు, అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేసిన నీరవ్ మోదీపై రుణదాతలు ఒత్తిడి చేయకుం డా న్యూయార్క్‌లోని కోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీ దక్షిణ న్యూయార్క్‌లోని దివాలా కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment