banni festival
-
రక్తమోడిన దేవరగట్టు
హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్ క్యాంప్‌లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్‌లో చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం.. ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం ఆలూరు రూరల్: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌పై వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్‌పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
రక్తమోడిన దేవరగట్టు: పగిలిన తలలు.. చిందిన రక్తం
ఓ వైపు డిర్ర్.. డిర్ర్ శబ్దాలు ఆకాశాన్నంటుతుండగా.. మరో వైపు దివిటీలు వెలుగులు విరజిమ్ముతుండగా.. రింగులు తొడిగిన కర్రలు గాలిలో కరాళ నృత్యం చేశాయి. దేవరగట్టు మళ్లీ రక్తమోడింది. ఉత్కంఠ భరితంగా సాగిన జైత్రయాత్రలో భక్తులే పట్టు సాధించి సంప్రదాయాన్ని గెలిపించారు. ఈ ఏడాది బన్ని ఉత్సవానికి ముందే జరిగిన అరికెర భక్తుల మధ్య ఘర్షణ భయాందోళనకు గురి చేసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య మాళమల్లేశ్వరుడి కల్యాణం, శమీ పూజ, కార్ణికం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సాక్షి, హొళగుంద (కర్నూలు): విజయ దశమి పర్వదినాన దేవరగట్టులో నిర్వహించిన బన్ని ఉత్సవంలో సంప్రదాయమే గెలిచింది. కోవిడ్ నిబంధనలు, అధికారుల ఆదేశాలను విస్మరించిన భక్తులు అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించారు. మాళ మల్లేశ్వరుని జైత్రయాత్ర మొగలాయి యుద్ధాన్ని తలపించింది. రక్తపాతాన్ని తగ్గించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఫలించలేదు. శుక్రవారం రాత్రి గట్టులో జరిగిన కర్రల సమరంలో దాదాపు 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఉత్సవాన్ని తిలకించారు. కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తామని మూడు గ్రామాల పెద్దలు ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్ సమక్షంలో పాల బాస చేశారు. వారికి బండారం (పసుపు) ఇచ్చి స్వామి కల్యాణానికి అనుమతి తీసుకుని కొండపైకి చేరుకోవడంతో ఉత్సవం ప్రారంభమైంది. అరికెర భక్తుల ఘర్షణతో ఉద్రిక్తత ఈ ఏడాది మాళ మల్లేశ్వరుని కల్యాణోత్సవానికి ముందే ఆస్పరి మఠం పక్కనే అరికెరకు చెందిన కొంత మంది భక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడ ఉన్న వేలాది మంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురు వ్యక్తుల తలలు పగిలి, చేతులు విరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మానవత్వం మరిచి రింగు కర్రలతో తలలపై బాదుతున్నా వారిని నిలవరించేందుకు ఎవరూ సాహసించ లేదు. ఆ దృశ్యం భక్తులను గగుర్పాటుకు గురి చేసింది. కొద్ది దూరంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గరలోనే ఉన్న హెల్త్ క్యాంప్‌నకు తరలించారు. గాయపడిన పరమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పగిలిన తలలు.. చిందిన రక్తం కర్రల సమరంలో అరికెర, కొత్తపేట, ఆలూరు, కురుకుంద, సుళువాయి, తదితర గ్రామాలకు చెందిన 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. కొందరికి కర్రలు తగిలి తలలకు గాయాలు కాగా మరి కొందరికి దివిటీలు తాకి కాలిన గాయాలయ్యాయి. ఆలూరుకు చెందిన జనార్దన్, బిలేహాళ్కు చెందిన ఈరన్న, నెరణికి చెందిన మల్లన్నగౌడ్ చేతులు విరిగాయి. తొక్కిసలాటలో హాలహర్వి మండలానికి చెందిన ఓ యువకుడు గాయపడ్డాడు. దాదాపు 15 మంది వరకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆదోని, ఆలూరు, కర్నూలుకు రెఫర్ చేశారు. ఆదోనికి చెందిన లక్ష్మీదేవి దివిటీ తగిలి గాయపడింది. ఆలూరుకు చెందిన వీరశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారికి తరలించారు. క్షతగాత్రులతో కిక్కిరిసిన వైద్య శిబిరం ఉత్సవంలో గాయపడిన భక్తుల్లో ఎక్కువ శాతం నాటుసారా, మద్యం సేవించిన వారే ఉన్నారు. కర్రల సమరంలో రక్తపాతాన్ని తగ్గించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది గట్టుకు భారీ వాహనాలకు అనుమతి లేదు. అయినా భక్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకున్నారు. దాదాపు 1,350 మందితో బందోబస్తు నిర్వహించారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి వందకు పైగా సీసీ కెమెరాలు, 4 డ్రోన్ కెమెరాలు, విడీయో కెమెరాలు వినియోగించారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ►శుక్రవారం ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాళమల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ►11.30 గంటల నుంచి భక్తులు కాలినడకన, బైక్‌లపై గట్టుకు చేరుకోవడం ప్రారంభమైంది. ► సాయంత్రం 4 గంటలకు భక్తుల రద్దీ కనిపించింది. ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. ► 5.30కు బందోబస్తు నిమిత్తం కేటాయించిన ప్రాంతానికి పోలీసులు బయలుదేరారు. ► రాత్రి 7:35కు జైత్రయాత్రను తిలకించడానికి వీలుగా స్థల అన్వేషణలో భక్తులు నిమగ్నమయ్యారు. ► 10.45కు ఆస్పరి మఠం పక్కనే అరికెరకు చెందిన భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ► 11.45కు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు డొళ్లిన బండ వద్దకు చేరుకుని పాలబాస తీసుకున్నారు. ► అర్ధరాత్రి 12:35కు మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలను మూడు గ్రామాల పెద్దలు కొండ పైకి చేర్చారు. ► శనివారం 1 గంటకు మాళ మల్లేశ్వరుని కల్యాణోత్సవాన్ని నెరణికి గ్రామానికి చెందిన పురోహితులు రవిశాస్త్రి, ఆలయ ప్రధాన పూజారులు ఘనంగా నిర్వహించారు. ► 1:30కు స్వామివారి పల్లకీ, విగ్రహాలు అశ్వత్థ సత్య నారాయణ కట్ట వద్దకు చేరడంతో కర్రలు, అగ్గి కాగడాలు ఒక్క సారిగా గాలిలో లే చాయి. డోళ్లు, తప్పెట్లు కొట్టు్టకుంటూ బసవన్న గుడి వైపు బయలుదేరి 2.50 గంటలకు ముళ్లబండకు చేరుకోవడంతో అక్కడ పూజలు చేశారు. ► 3.20 æగంటలకు విగ్రహాలు పాదాలగట్టుకు చేరుకోగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ► తెల్లవారు జామున 4 గంటలకు రక్షపడికి చేరుకోగా అక్కడ మణి, మల్లాసుర అనే రాక్షస గుండులకు కంచాబీర వంశానికి చెందిన గొరువయ్య బసవరాజు తన కాలి పిక్కలకు దప్పణంతో గుచ్చుకుని రక్త తర్పణం చేశారు. ► 4.30కు శమీవృక్షం వద్దకు విగ్రహాలు చేరుకోవడంతో అక్కడ పూజలు చేశారు. అనంతరం బసవన్న గుడి వైపు బయలుదేరాయి. ► శనివారం ఉదయం 6.10 గంటలకు పూజారి గిరిస్వామి గుడి పైకి ఎక్కి భవిష్యవాణి చెప్పారు. 2023 వరకు కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలుంటాయని, ఈ ఏడాది ఉత్తర భాగంలో వర్షాలుంటాయనే అర్థంతో, నిత్యావసర ధరలు పెరిగి తగ్గుతాయని,పంటలకు గిట్టుబాటు ధరలు 3:6, 6:3 ప్రకారం పెరుగుతాయని కార్ణీకం (భవిష్యవాణి) వినిపించారు. ► 6.35 గంటలకు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోగానే కర్రలు పట్టుకుని ఎగురుతున్న భక్తులు వెంటనే కిందకు దింపి మల్లేశ్వరస్వామికి జేజేలు పలికి ఇంటిదారి పట్టారు. -
బన్నీ ఉత్సవంలో చిందిన రక్తం
-
బన్నీ ఉత్సవంలో చిందిన రక్తం
-
రక్తమోడిన దేవరగట్టు
- కొనసాగిన కర్రల సమరం - ఒకరి పరిస్థితి ఆందోళనకరం - 30 మందికి పగిలిన తలలు - ఆరుగురికి కాలిన గాయాలు - ఫలించని అధికారుల వ్యూహం - వైభవంగా మాళమల్వేశ్వరుల కల్యాణం హొళగుంద/ఆలూరు/ఆలూరు రూరల్: దేవరగట్టులో కర్రల సమరాన్ని ఆపేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దసరా సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి హొళగుంద మండలంలోని దేవరగట్టు..కర్రల సమరంతో రక్తమోడింది. బన్ని ఉత్సవంలో 30 మంది భక్తులకు తలలు పగిలాయి. ఆరుగురికి కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆలూరు మండలం తుంబళబీడు గ్రామానికి చెందిన మఠం చిన్న తిక్కయ్య అనే భక్తుని పరిస్థితి విషమంగా ఉంది. ఆటవిక సంస్కృతికి స్వస్తి చెప్పాలని 15 రోజులుగా పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు 600 కర్రలను స్వాధీనం చేసుకున్నారు. సమరాన్ని అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం 1000 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. అయినా వేల సంఖ్యలో కదన రంగానికి కట్టెలతో భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. సమరం సాగిందిలా.. పోలీస్ వ్యూహ రచనలను తిప్పికొట్టేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు బన్ని ఉత్సవాన్ని గతేడాది కంటే 20 నిమిషాల ముందే ముందే ప్రారంభించారు. అర్ధరాత్రి 11:55 గంటల సమయంలో కలిసిగట్టుగా ఉత్సవాన్ని నిర్వహించుకుందామని పాలబాస చేశారు. అనంతరం గట్టుపైకి వస్తున్నట్లుగా పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ, డప్పుల శబ్దంతో ఒక్కసారిగా వేలసంఖ్యలో కట్టెలను పట్టుకుని దైవసన్నిధికి చేరుకున్నారు. శ్రీ మాళమల్లేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవుని విగ్రహాలను పల్లకిలో ఉంచి..కొండ దిగే సమయంలో జైత్రయాత్ర ప్రారంభమైంది. కాగడాలను చేతబట్టి, ఇనుప రింగులు తొడిగిన కర్రలను గాలిలోకి తిప్పుతూ భక్తులు నృత్యం చేస్తూ ముందుకు సాగారు. అప్పటికే మొగలాయి ఆడుతున్న అరికెర, సుళావాయి, బిలేహాల్, నిట్రవట్టి, సమ్మతగేరి, అరికెరతండా, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు ఉత్సవమూర్తుల ఊరేగింపులో కలిశారు. విగ్రహాలను మల్లప్ప గుడిలోనే సింహాసనం కట్టమీద అధిష్టించే సమయంలో కర్రలు ఆకాశంలోకి ఒక్కసారిగా లేచాయి. జైత్రయాత్రలో విగ్రహాలకు రక్షణగా నిలిచిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట మూడు గ్రామాల భక్తులు దిక్కులు కిక్కటిల్లేలా 'డ్రూర్ గొబారక్...బహూపరాక్' అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలతో ఆ ప్రాంతం యుద్ధభూమిగా మారింది. ఏఎస్ఐకి గాయాలు.. గాయాలైన భక్తులు పసుపు(బండారం) అంటించుకుని పగిలిన తలలతోనే కర్రల సమరంలో పాల్గొన్నారు. ఈ సమరంలో అరికెర, కొత్తపేట, ఆలూరు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామాలకు చెందిన రంగయ్య, ఈరప్ప, మఠం చిన్నతిక్కయ్యతో పాటు మరో 27 మందికి తలలు పగిలాయి. జయరాముడు, శివతో పాటు మరో నలుగురి భక్తులకు కాలిన గాయాలయ్యాయి. ఉత్సవానికి బందోబస్తుగా వచ్చిన తియోఫిలాస్ అనే ఏఎస్ఐ (ఏఆర్) మీదకు భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆయన భయాందోళనకు గురై కిందికి పడిపోయాడు. గాయపడిన ఏఎస్ఐని పోలీస్‌సిబ్బంది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఆస్పత్రిలో చేర్చారు. బన్ని ఉత్సవంలో గాయపడిన భక్తులను, ఉత్సవాలకు వచ్చి వివిధ కారణాలచేత అస్వస్థతకు గురైన సిబ్బందిని జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరామర్శించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 20 పడకల ఆస్పత్రిలో వైద్యసేవలను డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీదేవిని వారు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రక్త సంతర్పణ కర్రల సమరం పాదాల గట్టు, ముండ్లబండ మీదుగా ఆలయానికి సుమారు 4 కి.మీ. దూరంలోనే దట్టమైన అడవిలో ఉన్న రాక్షసపడి( పెద్ద గుండ్లు) వద్దకు చేరుకుంది. భయంకరమైన వాతావరణంలో కంచాభీర వంశానికి చెందిన భక్తుడు తమ ఎడమకాలు తొడలో దబ్బణం గుచ్చుకుని అక్కడి నుంచి వచ్చిన రక్తాన్ని మని, మళ్లాసురులుగా పిలిచే రాతి గుండ్లకు సమర్పించాడు. అక్కడి నుంచి శమీ వృక్షం మీదకు చేరుకున్న మాళమల్లేశ్వరుల విగ్రహ మూర్తులకు పూజలనంతరం ఎదురుబసవన్న గుడి వద్దకు తీసుకొచ్చారు. భవిష్యవాణి ఎదురుబసవన్న గుడి దగ్గర ఆలయ ప్రధాన అర్చకులగా వ్యవహరించే కుటుంబంలో ఒకరైన గిరిస్వామి గుడి పైకెక్కి భవిష్యవాణిని వినిపించారు. ఈ ఏడాది వివిధ పంటలకు గిట్టుబాటు ధరలో హెచ్చు తగ్గులో ఉంటుందన్నారు. పత్తి క్వింటం ధర రూ.4 వేలు పైగా, జొన్న రూ.1600కు పైగా ధర పలుకుతుందని ఆయన చెప్పారు. వర్షాలు ఎక్కువగా ఒకే వైపు కురుస్తాయని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు, పంటల దిగుబడుల ధరలు కూడా పెరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. తగ్గిన భక్తుల రద్దీ సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాది కన్నా ఈ యేడాది ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. బన్ని ఉత్సవంలో పాల్గొనే దాదాపు 15 గ్రామాల్లో మొహర్రం జరుగుతండడమే ఇందుకు కారణం. స్వామిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ కుటుంబ సభ్యులు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలకు కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ దంపతులు, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ దంపతులు హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అక్కడే ఉండి బన్ని ఉత్సవాన్ని తిలకించారు. – నేడు రథోత్సవం మాళమల్లేశ్వరస్వామి రథోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించనున్నారు. రథోత్సవంలో భాగంగా ఉదయం నెరణికి గ్రామ భక్తుల ఆధ్వర్యంలో పురోహితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. డ్రోన్ పర్యవేక్షణ.. బన్ని ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. దానికితోడు మాళమల్లేశ్వరస్వామి సన్నిధానంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. బన్ని ఉత్సవం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన 'బన్ని ఉత్సవం.. సమస్యల సమరం' అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గాయపడిన భక్తుల కోసం ఇరవై పడకల ఆస్పత్రిని అనుకూలమైన ప్రదేశానికి మార్చారు. ఎక్సైజ్ పోలీసులు వెయ్యిమంది దాక గస్తీ నిర్వహిస్తూ నాటుసారా విక్రయాలను పూర్తిగా అరికట్టారు. -
దేవరగట్టు జాతరలో బాలుడి మృతి
-
దేవరగట్టు జాతరలో బాలుడి మృతి
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. మాల మల్లేశ్వర స్వామి మూలవిరాట్టును దక్కించుకోడానికి కర్రలతో చేసుకున్న ఈ యుద్ధంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా చాలామందికి తలలు పగిలాయి. మొత్తం 37 మంది భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆదోని డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మహేశ్ అనే పదేళ్ల బాలుడు ఈ ఘర్షణలో మరణించాడు. వాస్తవానికి ఉత్సవం చూడటానికి వచ్చిన మహేశ్.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో నలిగిపోయి మరణించినట్లు పోలీసులు చెప్పారు. హొలగుండ మండలం దేవరగట్టులో ప్రతియేటా ఈ జాతర జరుగుతుంటుంది. దీనికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈసారి కూడా ఈ ఉత్సవంలో ఊహించినట్టుగానే చాలామంది గాయపడ్డారు. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.. వాళ్లు ప్రేక్షతపాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. శనివారం తెల్లవారేవరకూ ఈ కర్రల యుద్ధం కొనసాగింది. పది గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ కోసం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్‌తో పాటు బాష్పవాయువు ఉపయోగించారు.