batminton
-
బాడ్మింటన్ స్టార్ సిక్కిరెడ్డికి కరోనా పాజిటివ్
-
బాలుడి కిడ్నాప్!
చిలకలూరిపేటటౌన్: బడికెళ్లిన పన్నెండేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చందనపేట మండలం కంభాలపల్లి గ్రామానికి చెందిన గన్నెబోయిన మల్లేష్‌యాదవ్ తన కుమారుడు విశ్వతేజ ఉరఫ్ ఉమేష్‌ను చిలకలూరిపేట పట్టణంలోని నవోదయ కోచింగ్ సెంటర్లో గత నెల 23న చేర్పించారు. ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరచడానికి ఉపయుక్తంగా ఉంటుందని స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్లో చేర్చారు. గత నాలుగు రోజుల నుంచి పట్టణంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనేందుకు విశ్వతేజ ఉదయం పాఠశాల క్రీడా ప్రాంగణంలో స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. తరగతులకు హాజరయ్యేందుకు సమయం అవుతుండటంతో ఫ్రెషప్ అవడానికి రూముకు వెళ్తున్నానని తోటి సహచరులకు చెప్పి వెళ్లాడు. అలా వెళ్లిన బాలుడు రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు కథ ఇది... బాలుడి తండ్రి మల్లేష్ యాదవ్ దేవరకొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా పనిచేస్తున్నాడు. రేషన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. బాలుని మేనమామ మేకల శ్రీనివాస యాదవ్ దేవరకొండ ఎంపీపీగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరికీ ప్రతిపక్ష నాయకులతో గత కొంతకాలంగా రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ సమయంలో తమ బిడ్డ అదృశ్యం పట్ల ఆం దోళన, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విపక్ష నాయకులే కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందరితో ఆడుకుని స్కూల్ నుంచి ఒంటరిగా బయటకు ఎలా వెళ్లగలడని ప్రశ్నిస్తున్నారు. తమపై కక్షతోనే తమ బిడ్డను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. -
ముగిసిన అంతర జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
కాకినాడ సిటీ : జిల్లా బాల్‌బ్యాడ్మింటిన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రంగరాయ వైద్య కళాశాలలో నిర్వహించిన అంతర జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొనగా, హోరాహోరీగా పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో కర్నూలు జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, తూర్పుగోదావరి ద్వితీయ, ప్రకాశం తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో కడప జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, విశాఖపట్నం ద్వితీయ, గుంటూరు తృతీయ, తూర్పుగోదావరి జట్టు నాల్గో స్థానంలో నిలిచాయి. పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి విజేతలకు సిర్టిఫికెట్లు, షీల్డ్‌లను అందజేశారు. క్రీడాకారులు క్రీడలతో పాటు చదువుపైనా దృష్టి కేంద్రీకరించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. జిల్లా బాల్‌బ్యాడ్మింటిన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పన వీర్రాజు అధ్యక్షతన జరిగి ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, రంగరాయ వైద్యకళాశాల పీడీ కె.స్పర్జన్‌రాజు, బాల్ బ్యాడ్మింటిన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఐ.వి.రావు, జిల్లా కార్యదర్శి వి.ఆర్.కె.తంబి పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
దేవరకొండ : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారం డీఎస్పీ ఎంజీ. చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతమైన దేవరకొండలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కొద్దిసేపు డీఎస్పీ బ్యాడ్మింటన్ ఆడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎన్వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కాశిమల్ల భాస్కర్, కృష్ణకిషోర్, తాళ్ల సురేష్, పంతులాల్, బాబా, ఖాలేక్, సురేష్, శేఖర్, వెంకట్ పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ విజేత ‘పశ్చిమ’
ప్రొద్దుటూరు కల్చరల్ : రాష ్ట్రస్థాయి బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుధా కళ్యాణి, హారిక విజేతలుగా నిలిచారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని జార్జ్ కారొనేషన్lక్లబ్‌లోని వర్రా గురివిరెడ్డి ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీలలో గెలుపొందిన విజేతలకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మెడల్స్, షీల్డ్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బ్యాడ్మిం టన్ అభివృద్ధికి అకాడమీలను నెలకొల్పుతామని చెప్పారు. -
స్విస్ ఓపెన్‌పై సైనా గురి
బాసెల్ (స్విట్జర్లాండ్): ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తనకు కలిసొచ్చిన స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2011, 2012లలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన సైనా గతేడాది సెమీఫైనల్లో నిష్ర్కమించింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లతోపాటు మిక్స్డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాలలో క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహిస్తారు. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్... మహారాష్ట్ర ప్లేయర్ ఆనంద్ పవార్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో హుర్స్‌కెనైన్ (స్వీడన్)తో శ్రీకాంత్; కాక్ పోంగ్ లోక్ (మలేసియా)తో ఆనంద్ పవార్; మిజెస్ (నెదర్లాండ్స్)తో కశ్యప్ ఆడతారు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా... షిజియాన్ వాంగ్ (చైనా)తో సైలి రాణే తలపడతారు. పి.వి.సింధుతో ఆడాల్సిన బీట్రిజ్ (స్పెయిన్) వైదొలగడంతో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయికి ‘వాకోవర్’ లభించే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్స్‌లో టాప్ సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సైనా; షిజియాన్ వాంగ్‌తో సింధు తలపడే అవకాశముంది. డబుల్స్ తొలి రౌండ్లోహెరిచ్-కార్లా నెల్టి (జర్మనీ) జోడితో జ్వాల-అశ్విని పొనప్ప జంట తలపడుతుంది. -
సైనా సత్తాకు పరీక్ష
బర్మింగ్‌హామ్: గత ఏడాది ఎదురైన చేదు ఫలితాలను వెనక్కినెట్టి ఈ ఏడాదిని ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ విజయంతో మొదలుపెట్టిన భారత స్టార్ సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమైంది. మంగళవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఏడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సైనాతోపాటు మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు... పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా; సున్ యూ (చైనా)తో సింధు; కెంటో మొమొటా (జపాన్)తో శ్రీకాంత్; కెనిచి టాగో (జపాన్)తో కశ్యప్ తలపడతారు. గతేడాది సెమీఫైనల్‌కు చేరుకున్న సైనా ఈసారి మరింత మెరుగైన ఫలితాన్ని సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘నెల రోజులు సాధన చేసి ఈ టోర్నీకి పక్కాగా సిద్ధమయ్యాను. బరువు తగ్గి ఫిట్నెస్ కూడా మెరుగుపర్చుకొని అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ‘డ్రా’ కఠినంగానే ఉన్నా కనీసం క్వార్టర్ ఫైనల్ చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని ప్రపంచ ఏడో ర్యాంకర్ సైనా వ్యాఖ్యానించింది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే సైనాకు రెండో రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ)... క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) ఎదురయ్యే అవకాశాలున్నాయి. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో కుర్నియావాన్ (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్ (భారత్); చోల్ మ్యాగీ (ఐర్లాండ్)తో సైలి రాణే (భారత్) పోటీపడతారు. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడికి బై లభించింది. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో మాథ్యూ నాటింగ్హమ్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జోడితో తరుణ్ కోనా-అశ్విని పొన్నప్ప (భారత్) జంట ఆడుతుంది.