ముగిసిన అంతర జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
ముగిసిన అంతర జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
Published Thu, Oct 13 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
కాకినాడ సిటీ :
జిల్లా బాల్‌బ్యాడ్మింటిన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రంగరాయ వైద్య కళాశాలలో నిర్వహించిన అంతర జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొనగా, హోరాహోరీగా పోటీలు జరిగాయి. బాలుర విభాగంలో కర్నూలు జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, తూర్పుగోదావరి ద్వితీయ, ప్రకాశం తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో కడప జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, విశాఖపట్నం ద్వితీయ, గుంటూరు తృతీయ, తూర్పుగోదావరి జట్టు నాల్గో స్థానంలో నిలిచాయి. పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి విజేతలకు సిర్టిఫికెట్లు, షీల్డ్‌లను అందజేశారు. క్రీడాకారులు క్రీడలతో పాటు చదువుపైనా దృష్టి కేంద్రీకరించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. జిల్లా బాల్‌బ్యాడ్మింటిన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పన వీర్రాజు అధ్యక్షతన జరిగి ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, రంగరాయ వైద్యకళాశాల పీడీ కె.స్పర్జన్‌రాజు, బాల్ బ్యాడ్మింటిన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఐ.వి.రావు, జిల్లా కార్యదర్శి వి.ఆర్.కె.తంబి పాల్గొన్నారు.
Advertisement