గన్నెబోయిన విశ్వతేజ (ఫైల్)
చిలకలూరిపేటటౌన్: బడికెళ్లిన పన్నెండేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చందనపేట మండలం కంభాలపల్లి గ్రామానికి చెందిన గన్నెబోయిన మల్లేష్‌యాదవ్ తన కుమారుడు విశ్వతేజ ఉరఫ్ ఉమేష్‌ను చిలకలూరిపేట పట్టణంలోని నవోదయ కోచింగ్ సెంటర్‌లో గత నెల 23న చేర్పించారు. ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరచడానికి ఉపయుక్తంగా ఉంటుందని స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్‌లో చేర్చారు. గత నాలుగు రోజుల నుంచి పట్టణంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోటీలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనేందుకు విశ్వతేజ ఉదయం పాఠశాల క్రీడా ప్రాంగణంలో స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. తరగతులకు హాజరయ్యేందుకు సమయం అవుతుండటంతో ఫ్రెషప్ అవడానికి రూముకు వెళ్తున్నానని తోటి సహచరులకు చెప్పి వెళ్లాడు. అలా వెళ్లిన బాలుడు రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలు కథ ఇది...
బాలుడి తండ్రి మల్లేష్ యాదవ్ దేవరకొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా పనిచేస్తున్నాడు. రేషన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. బాలుని మేనమామ మేకల శ్రీనివాస యాదవ్ దేవరకొండ ఎంపీపీగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరికీ ప్రతిపక్ష నాయకులతో గత కొంతకాలంగా రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ సమయంలో తమ బిడ్డ అదృశ్యం పట్ల ఆం దోళన, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విపక్ష నాయకులే కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందరితో ఆడుకుని స్కూల్ నుంచి ఒంటరిగా బయటకు ఎలా వెళ్లగలడని ప్రశ్నిస్తున్నారు. తమపై కక్షతోనే తమ బిడ్డను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment